సందీప్ రెడ్డి వంగ 'స్పిరిట్' ఇంటర్వెల్ ఫైట్ లో ప్రభాస్ చేత గన్ పట్టిస్తున్నాడా? కత్తి పట్టిస్తాడా?

ప్రభాస్ సినిమాల్లో వెపన్స్ హైలెట్ అవుతుంటాయి. ఛత్రపతి సినిమాలో రాజమౌళి ప్రభాస్ చేతిలో గొడ్డలి పెట్టి ఫైట్ చేయించాడు.

Update: 2026-10-13 15:30 GMT

'అర్జున్ రెడ్డి' సినిమాతో ఇండియన్ సినిమా ఇండస్ట్రీ మీద చెరగని ముద్ర వేసిన దర్శకుడు సందీప్ రెడ్డి వంగా... 'అనిమల్' సినిమాతో బాలీవుడ్ ఇండస్ట్రీలో పెను సంచలనాలను క్రియేట్ చేశాడు. సందీప్ ప్రస్తుతం ప్రభాస్ హీరోగా 'స్పిరిట్' సినిమా చేస్తున్నాడు. ఈ సినిమా మీద రోజు రోజుకి అంచనాలు తార స్థాయికి వెళ్లిపోతున్నాయి. ఇప్పటి వరకు ఈ సినిమా నుంచి ప్రభాస్ కి సంబంధించిన ఒక్క వీడియో రాకపోయిన ఈ మూవీ మీద భారీ బజ్ ఉంది.

ప్రభాస్ పట్టుకునే వెపన్ ఏంటి?

ప్రభాస్ సినిమాల్లో వెపన్స్ హైలెట్ అవుతుంటాయి. ఛత్రపతి సినిమాలో రాజమౌళి ప్రభాస్ చేతిలో గొడ్డలి పెట్టి ఫైట్ చేయించాడు. ఆ తర్వాత బాహుబలి' సినిమాలో 'అమరేంద్ర బాహుబలి' గా కత్తి తో చేసిన పోరాట సన్నివేశాలు ఇప్పటికీ మన కళ్ళ ముందు కదలాడుతూనే ఉంటాయి. స్పిరిట్ లో సందీప్ ప్రభాస్ ను ఏ రేంజ్ లో చూపించబోతున్నాడు. అతని చేతుల్లో కత్తి పెట్టి హై ఓల్టేజ్ సన్నివేశాలను చిత్రీకరించబోతున్నాడా? అభిమానుల్లో జోష్ నింపడానికి గన్స్ తో యుద్ధం చేయిస్తాడా? ఆయన ఏం ప్లాన్ చేశాడు అనేది ఇప్పుడు ప్రతి ఒక్కరి మదిలో మెదులుతున్న ప్రశ్న... ఇక ఇంటర్వెల్ ఫైట్ భారీగా ఉండబోతుందట. సిన్సియర్ పోలీస్ ఆఫీసర్ అయిన ప్రభాస్ తన చేతికి ఏ వెపన్ దొరికితే దాంతో రౌడీల మీద ఎదురుదాడి చేస్తాడట. ప్రస్తుతం అందుతున్న సమాచారం ప్రకారం ఇప్పటివరకు ఆయన చేసిన సినిమాల్లోనే ఈ ఫైట్ చాలా హైలెట్ గా నిలువబోతుందట.

మొత్తానికైతే ప్రభాస్ మూవీలో యాక్షన్ సన్నివేశాలు హైలెట్ అవుతుంటాయి. అతనికి విపరీతమైన క్రేజ్ రావడానికి ముఖ్య కారణం కూడా అతను చేసే ఫైట్లే కావడం విశేషం... దానివల్లే సందీప్ వాటన్నింటిని దృష్టిలో పెట్టుకొని తన అభిమానులతో పాటు ప్రేక్షకులను కూడా నిరాశపరచకూడదని అన్ని రకాలుగా ఆలోచించి యాక్షన్ సన్నివేశాలకు ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నట్టుగా తెలుస్తుంది. ఇక ఇంటర్వెల్ సీక్వెన్స్ మొత్తం గన్స్, కత్తులతో ఉంటుందట. ఇది ఫ్యాన్స్ కి ఐ ఫీస్ట్ ఇవ్వడం పక్కా అంటూ సినీ విశ్లేషకులు వాళ్ల అభిప్రాయాలను తెలియజేస్తున్నారు. రీసెంట్ గానే ఇంటర్వెల్ ఫైట్ సీన్ షూటింగ్ కంప్లీట్ చేసినట్టుగా ఫిల్మ్ నగర్ సర్కిల్ లో వార్తలు చక్కర్లు కొడుతున్నాయి...ఈ ఫైట్ ని సందీప్ చాలా అద్భుతంగా తెరకెక్కించారట. ఈ సినిమాతో ప్రభాస్ ఏ రేంజ్ సక్సెస్ ని సాధిస్తాడు. ప్రభాస్ కి మరో ఇండస్ట్రీ హిట్ దక్కుతుందా? లేదా అనేది తెలియాలంటే మాత్రం మరి కొద్ది రోజులు వెయిట్ చేయాల్సిందే...

Tags:    

Similar News