స్టార్ హీరోల ఇమేజ్ కంటే కథే ముఖ్యం: ఆదిత్య ధర్ తదుపరి వ్యూహం!
ప్రస్తుత పరిస్థితిలో ఆదిత్య ధర్ పేరు దర్శకుడికి మాత్రమే పరిమితం కాలేదు. అది ఇండియన్ బాక్సాఫీస్ వద్ద బలమైన బ్రాండ్‌గా మారిపోయింది.
ఇండియన్ సినిమా ఇండస్ట్రీలో ఆసక్తికరంగా మారిన పేరు డైరెక్టర్ ఆదిత్య ధర్. `ఉరి: ది సర్జికల్ స్ట్రైక్` చిత్రంతో ప్రతిభను చాటుకున్న టాలెంటెడ్ డైరెక్టర్ `ధురంధర్` ఫ్రాంచైజీతో బాక్సాఫీస్ వద్ద ఏకంగా 3,000 కోట్ల వసూళ్లను సాధించి సరికొత్త చరిత్ర సృష్టించారు. భారతీయ సినిమా చరిత్రలో ఒక ఫ్రాంచైజీతో ఈ స్థాయిలో గ్లోబల్ కలెక్షన్లు రాబట్టిన తొలి దర్శకుడిగా ధార్ అగ్రస్థానంలో నిలిచారు. అయితే ఈ సంచలన విజయాల తర్వాత ఆయన తదుపరి ప్రాజెక్ట్ ఎవరితో ఉండబోతుందనే దానిపై ఇప్పటివరకు ఎలాంటి క్లారిటీ లేదు. కొంతమంది హీరోల పేర్లు తెరపైకి వచ్చాయి గానీ అదంతా ప్రచారమేనని తేలిపోయింది.
ప్రస్తుత పరిస్థితిలో ఆదిత్య ధర్ పేరు దర్శకుడికి మాత్రమే పరిమితం కాలేదు. అది ఇండియన్ బాక్సాఫీస్ వద్ద బలమైన బ్రాండ్‌గా మారిపోయింది. ఏ హీరోతో సినిమా చేసినా? ఏ జానర్‌ను ఎంచుకున్నా? ఆ ప్రాజెక్ట్‌పై అంచనాలు తారా స్థాయిలో ఉంటాయి. స్టార్ హీరోల ఇమేజ్‌పై ఆధారపడకుండా కథలోని బలంతో, ప్రేక్షకులను కట్టిపడేసే స్క్రీన్‌ప్లేతో అద్భుతాలు సృష్టించగలగడమే ఆదిత్య ధర్ అసలైన బలంగా విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.
ఇప్పుడు ధార్ కి కావాల్సింది పెద్ద హీరోల క్రేజ్ కాదు. ఆ పాత్రలో పూర్తిగా ఒదిగిపోగల టాలెంటెడ్ నటుడు , బలమైన కథాంశం మాత్రమే. `ధురంధర్` సిరీస్‌తో తనకంటూ ప్రత్యేకమైన బెంచ్‌మార్క్‌ను సృష్టించుకున్న ధార్ రాబోయే రోజుల్లో ఏ చిన్న సినిమా చేసినా? లేదా భారీ చారిత్రాత్మక నేపథ్యం ఉన్న కథను ఎంచుకున్నా? అది బాక్సాఫీస్ వద్ద సులభంగా సెన్సేషన్ సృష్టించడం ఖాయం. కథపై ఉన్న పట్టు, టెక్నికల్ వాల్యూస్ విషయంలో ఆయన చూపించే శ్రద్ధే ధార్ ని మిగతా దర్శకుల కంటే భిన్నంగా నిలబెడుతున్నాయి.
ప్రస్తుతం టాలీవుడ్ నుంచి బాలీవుడ్ వరకు అంతా ఆదిత్య ధర్ నెక్స్ట్ మూవ్ ఏంటని ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ధార్ ఎలాంటి కథను ఎంచుకుంటారు? ఏ హీరోతో మరోసారి గ్లోబల్ బాక్సాఫీస్‌ను టార్గెట్ చేస్తారనే! విషయాలపై రకరకాల ఊహాగానాలు వినిపిస్తున్నాయి. ఏదేమైనా? ఒకసారి తన సత్తా ఏంటో నిరూపించుకున్న గొప్ప సృష్టికర్తకు ఇప్పుడు ఇమేజ్ హద్దులు లేవు. మేకింగ్ స్టైల్‌తో తన రికార్డులను తానే బ్రేక్ చేసే సత్తా ఆదిత్య ధర్ లాంటి విజనరీ డైరెక్టర్లకే సాధ్యమవుతుంది.