ఇక్కడ ఇరుముడి.. అక్కడ ప్రేమద ఊరల్లీ

తెలుగు రాష్ట్రాల్లో ఇరుముడి సినిమాను ఎలా అయితే చూశారో ఇప్పుడు కన్నడ ప్రేక్షకులు ఈ సినిమాను అలా చూస్తున్నారని నెంబర్స్ చెప్పకనే చెబుతున్నాయి.

Update: 2026-10-13 09:57 GMT

రవితేజ హీరోగా నటించిన 'ఇరుముడి' సినిమా ఏ స్థాయిలో విజయాన్ని సొంతం చేసుకుందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. మొదటి వారంతో పోల్చితే రెండో వారం, మూడో వారంలో ఇరుముడికి అత్యధికంగా కలెక్షన్స్ నమోదు అయ్యాయి. ఊర్ల నుంచి సింగిల్‌ స్క్రీన్స్ కు ఆటోలు, ట్రాక్టర్‌లు కట్టుకుని మరీ జనాలు వచ్చి ఇరుముడి సినిమాను చూసిన విషయం తెల్సిందే. దశాబ్ద కాలంలో ఎప్పుడూ లేని విధంగా మూడో వారం, నాల్గవ వారం ఒక తెలుగు సినిమా ఆ స్థాయి వసూళ్లు సొంతం చేసుకోవడం చూసి బాక్సాఫీస్ వర్గాల వారు సైతం అవాక్కయ్యారు. ఈ ఏడాది బాక్సాఫీస్ వద్ద బిగ్గెస్ట్‌ బ్లాక్‌ బస్టర్‌ విజయాన్ని అందుకున్న ఇరుముడి సినిమా తరహాలోనే ఇప్పుడు కన్నడ సినిమా ఇండస్ట్రీలో ఒక విజయం నమోదు అయింది. ఆ విజయాన్ని చూసి అంతా షాక్ అవుతున్నారు. మూడో వారంలోనూ చాలా థియేటర్లలో హౌస్ ఫుల్‌ కలెక్షన్స్‌ నమోదు అవుతున్నాయనే రిపోర్ట్‌లు వస్తున్నాయి.

ప్రేమద ఊరల్లీ మూవీతో...

ఆ కన్నడ మూవీ మరేదో కాదు 'ప్రేమద ఊరల్లీ'. కేవలం రూ.3 కోట్ల బడ్జెట్‌తో రూపొందిన ఈ సినిమాకు ఇప్పటివరకు దాదాపు రూ.70 కోట్లు నమోదు అయినట్లు కన్నడ బాక్సాఫీస్ వర్గాల ద్వారా సమాచారం అందుతోంది. మొదట్లో చిన్న సినిమా, కొత్త వారి సినిమా అని చాలా మంది చూసేందుకు ఆసక్తి చూపించలేదు. మొదటి వారంలో ప్రేమద ఊరల్లీ సినిమాకు దాదాపు రూ.5 కోట్ల వసూళ్లు మాత్రమే నమోదు అయ్యాయి. అది కూడా మొదటి రెండు రోజుల్లో వసూళ్లు లక్షల్లోనే నమోదు కావడం విశేషం. సినిమాకు పాజిటివ్‌ టాక్‌ పెరిగినా కొద్ది, మౌత్ టాక్ పెరిగినా కొద్ది వసూళ్లు పెరుగుతూ వస్తున్నాయి. రెండో వారంలో వసూళ్లు భారీగా పెరిగాయి. రెండో వారం తో పోల్చితే మూడో వారంలో అంతకు మించి అన్నట్లుగా వచ్చినట్లు బాక్సాఫీస్ వర్గాల ద్వారా సమాచారం అందుతోంది.

రవితేజ ఇరుముడి కలెక్షన్స్‌...

తెలుగు రాష్ట్రాల్లో ఇరుముడి సినిమాను ఎలా అయితే చూశారో ఇప్పుడు కన్నడ ప్రేక్షకులు ఈ సినిమాను అలా చూస్తున్నారని నెంబర్స్ చెప్పకనే చెబుతున్నాయి. సినిమా భారీ స్టార్‌ కాస్ట్‌ కాకపోవడంతో పాటు, యూనిట్ సభ్యులు అంతంత మాత్రంగానే పబ్లిసిటీ చేస్తున్న కారణంగా ఇరుముడి స్థాయిలో వసూళ్లు నమోదు కావడం లేదు, కానీ ఆ స్థాయిలో సినిమా బాక్సాఫీస్ వద్ద సత్తా చాటుతుందనే టాక్‌ వినిపిస్తుంది. లాంగ్ రన్‌లో సినిమా కచ్చితంగా రూ.100 కోట్ల మార్క్ ను చేరుతుందనే విశ్వాసం వ్యక్తం అవుతోంది. ఒక చక్కని ఫ్యామిలీ డ్రామాగా రూపొంది, అందులోనే ఒక మంచి ప్రేమ కథను చూపించిన దర్శకుడు విభిన్నమైన నేపథ్యం ను కన్నడ ప్రేక్షకుల ముందుకు తీసుకు వచ్చాడు. సినిమాకు ఫ్యామిలీ ఆడియన్స్ కనెక్ట్‌ కావడంతో వసూళ్లు భారీగా నమోదు అవుతున్నాయి.

టాలీవుడ్‌లో ది ప్యారడైజ్ మూవీ...

ఈ సినిమా తెలుగులోనూ సెప్టెంబర్‌ 25న విడుదల చేయాలని భావించినప్పటికీ నాని ది ప్యారడైజ్ మూవీకి పోటీగా వద్దనే ఉద్దేశంతో వాయిదా వేసి అక్టోబర్‌ 2న విడుదల చేయడం జరిగింది. తెలుగు ప్రేక్షకుల నుంచి సినిమాకు ఆశించిన స్థాయిలో పాజిటివ్‌ రెస్పాన్స్ దక్కలేదు. మల్టీప్లెక్స్ ప్రేక్షకులు కొందరు సినిమాను చూసినప్పటికీ కన్నడ ప్రేక్షకులు చూసిన రేంజ్‌ లో తెలుగు ప్రేక్షకులు ప్రేమనే ఊరిలో సినిమాను చూడలేదు. కన్నడ ప్రేక్షకులు మరో రెండు వారాల పాటు ప్రేమద ఊరల్లీ సినిమాను చూసే అవకాశాలు కనిపిస్తున్నాయి. దాంతో రజనీకాంత్‌ జైలర్‌ 2 వస్తున్నప్పటికీ ఈ సినిమాను పూర్తిగా తీసేందుకు ఎగ్జిబ్యూటర్లు ఆసక్తి చూపడం లేదు. జైలర్‌ 2 కంటే కూడా ఎక్కువగా ప్రేమద ఊరల్లీ సినిమాను కన్నడ ప్రేక్షకులు చూస్తారని ఎగ్జిబ్యూటర్స్ భావిస్తున్నారు. మొత్తానికి కన్నడ సినీ ఇండస్ట్రీ మొత్తం ఇప్పుడు ప్రేమద ఊరల్లీ సినిమా గురించి మాట్లాడుకుంటున్నారు. కేజీఎఫ్‌, కాంతార సినిమాల రేంజ్‌లో జాతీయ స్థాయిలోనూ సినిమా గురించి చర్చ జరుగుతోంది.

Tags:    

Similar News