మరో మిస్టిక్ థ్రిల్లర్ లో ఆది సాయి కుమార్...
హీరోగా, విలన్, క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా నటించి మెప్పిస్తున్న నటుడు సాయికుమార్... తన తనయుడిగా ఇండస్ట్రీ కి ఎంట్రీ ఇచ్చిన 'ఆది సాయికుమార్' మొదటి మూవీతోనే ఆకట్టుకున్నాడు.
హీరోగా, విలన్, క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా నటించి మెప్పిస్తున్న నటుడు సాయికుమార్... తన తనయుడిగా ఇండస్ట్రీ కి ఎంట్రీ ఇచ్చిన 'ఆది సాయికుమార్' మొదటి మూవీతోనే ఆకట్టుకున్నాడు. కెరియర్ మొదట్లో వరుసగా లవ్ స్టోరీలను చేస్తూ కొన్ని సక్సెస్ లను సాధించాడు. మధ్యలో ఆయన చేసిన సినిమాలు ప్రేక్షకులను పెద్దగా మెప్పించలేకపోయాయి. దాంతో ఆయన జానర్ మార్చి గత సంవత్సరం 'శంభాల' అనే మిస్టిక్ థ్రిల్లర్ తో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఈ సినిమా భారీ విజయాన్ని సాధించింది. చాలా రోజుల తర్వాత ఆది సాయికుమార్ కి హిట్ రావడంతో అతని అభిమానులతో పాటు ప్రేక్షకులు సైతం ఆనందాన్ని వ్యక్తం చేశారు. ఇలాంటి క్రమంలోనే ఇప్పుడు ఆయన మరో మిస్టిక్ థ్రిల్లర్ తో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు...
త్రిశూల్ ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ మీద ప్రశాంత్ జి రుద్రప్ప ప్రొడ్యూసర్ గా ప్రొక్షన్ నెంబర్ 3 పేరుతో అత్యంత ప్రతిష్టాత్మకంగా ఈ మూవీ రూపొందుతుంది. రీసెంట్ గా ఈ మూవీ నుంచి ఒక పోస్టర్ రిలీజ్ అయింది. 'నవరసన్' దర్శకత్వంలో ఎక్స్ట్రార్డినరీ విజువల్స్ తో ఈ మూవీ తెరకెక్కుతోంది. మిస్టిక్ థ్రిల్లర్ జానర్ లో వచ్చే ప్రతి సినిమా వెనుక ఒక దైవ రహస్యం దాగి ఉంటుంది. ఇందులో కూడా గొప్ప పాయింట్ ను టచ్ చేసినట్టుగా తెలుస్తుంది. ఈ సినిమాలో ట్విస్ట్ లు సైతం కీలక పాత్ర వహించబోతున్నాయంటూ ఫిలిం నగర్ సర్కిల్ లో కొన్ని వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. ప్రేక్షకుడిని కథలో ఇన్వాల్వ్ చేస్తూ స్క్రీన్ ప్లే ప్రేక్షకుడి అంచనాలకు మించి ఉన్నప్పుడు ఆటోమేటిక్ గా ఆడియన్ థ్రిల్ ఫీల్ అవుతూ ఉంటాడు. దానివల్ల సినిమా ప్రేక్షకుడికి విపరీతంగా నచ్చి సక్సెస్ ని సాధించే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి.
నవరసన్ డైరెక్షన్ లో వస్తున్న ఈ మూవీ నేపథ్యాన్ని పరిచయం చేస్తూ ఒక పోస్టర్ ను రిలీజ్ చేశారు. పురాతన పూజా స్థలాన్ని పోలి ఉండే దట్టమైన నీడలు కమ్ముకున్న అడవిలో పురాతన ఆయుధాలు, నూనెలో వెలుగుతున్న దీపం ఉంది. మధ్యలో ఉన్న త్రిశూలం చుట్టు ఒక పాము చుట్టుకొని శూలం పైన పడగ విప్పి ఉండటం చూస్తుంటే ఒళ్ళు జలదరిస్తుంది. కొన్ని మూవీస్ పోస్టర్స్ నుంచే పాజిటివ్ వైబ్ ను క్రియేట్ చేస్తుంటాయి. ఈ సినిమా అలాంటి కోవకు చెందిందే కావడం విశేషం... 'కాంతార' ఫేమ్ అంజనీష్ లోక్ నాథ్ ఈ మూవీ కి సంగీతాన్ని సమకూరుస్తున్నాడు. ఇప్పటికే తను ఇచ్చిన సాంగ్స్ బాగున్నాయి నేపథ్య సంగీతం లో కూడా వైవిధ్యాన్ని చూపించడానికి రెడీ అవుతున్నాడు అంటు సినిమా యూనిట్ నుంచి కొన్ని వార్తలు వినిపిస్తున్నాయి...
ఆది సాయి కుమార్ నుంచి మరో మిస్టిక్ థ్రిల్లర్...
గత సంవత్సరం శంభాల సినిమా భారీ విజయాన్ని సాధించింది. ఇప్పుడు ఆది సాయికుమార్ మరోసారి మిస్టిక్ థ్రిల్లర్ జానర్ లోనే సినిమా చేయడం చాలామందికి ఆశ్చర్యానికి గురిచేస్తుంది. బ్యాక్ టు బ్యాక్ ఒకే జానర్ లో సినిమాలు చేయడం కొంత వరకు రిస్క్ అయినప్పటికి మిస్టిక్ థ్రిల్లర్ లో అలాంటి రిస్క్ ఏం ఉండదు. లవ్ స్టోరీ తో సక్సెస్ సాధించి ఆ వెంటనే అదే జానర్ లో మూవీ చేస్తే సినిమా చూసే ప్రేక్షకుడికి కొంచెం బోర్ గా ఉండవచ్చు. కానీ మిస్టిక్ థ్రిల్లర్ లో అలా ఉండదు...
ఎంచుకున్న కథ బాగుండి, స్క్రీన్ ప్లే లో వైవిధ్యాన్ని చూపిస్తూ మొదటి సీన్ నుంచి చివరి సీన్ వరకు ప్రేక్షకుడిని ఎంగేజ్ చేయగలిగితే ఎన్ని థ్రిల్లర్ మూవీస్ చెందిన బోర్ కొట్టాడు విజయం సాధించడానికి అవకాశం ఎక్కువగా ఉంటుంది. స్క్రీన్ ప్లే గ్రిప్పింగ్ గా ఉంటే ప్రతి ప్రేక్షకుడిని ఆ సినిమాతో ట్రావెల్ చేసేలా చేయవచ్చు... మిస్టిక్ థ్రిల్లర్ లో దైవానికి సంబంధించిన రహస్యాన్ని చెబుతూనే దాన్ని చేధించే క్రమంలో హీరో చేసే ఇన్వెస్టిగేషన్ ఎంత కొత్తగా ఉంటే ఆ సినిమా అంత ఎఫెక్టివ్ గా ఉంటుంది... ఈ మూవీ పోస్టర్ లోనే కొత్తదనం కనిపిస్తుంది. కాబట్టి దానికి సంబంధించిన సెటప్ ను భారీగానే సెట్ చేసుకొని ప్రేక్షకులకు థ్రిల్ ఇవ్వడానికి రెడీ అవుతున్నట్టుగా తెలుస్తోంది. అక్టోబర్ 20 దసరా రోజు ఈ మూవీ కి సంబంధించిన పూర్తి అప్డేట్స్ ను ఇవ్వడానికి చిత్ర యూనిట్ రెడీ అవుతున్నారు...