హాలీవుడ్ రేంజ్‌లో తెలుగు సినిమా గ్రాండియర్!
టాలీవుడ్ గ్లోబల్ స్థాయిలో సంపాదిస్తున్న కీర్తి ప్రతిష్టలు విదేశీ నటులను కూడా విశేషంగా ఆకర్షిస్తున్నాయి. హాలీవుడ్ - బ్రిటన్ నటులు సైతం దక్షిణాది చిత్రాల్లో నటించేందుకు ఎంతో ఆసక్తి చూపిస్తున్నారు.
టాలీవుడ్ గ్లోబల్ స్థాయిలో సంపాదిస్తున్న కీర్తి ప్రతిష్టలు విదేశీ నటులను కూడా విశేషంగా ఆకర్షిస్తున్నాయి. హాలీవుడ్ - బ్రిటన్ నటులు సైతం దక్షిణాది చిత్రాల్లో నటించేందుకు ఎంతో ఆసక్తి చూపిస్తున్నారు. త్వరలో రాబోతున్న భారీ పాన్-ఇండియా చిత్రం `రణబలి`లో కీలక పాత్ర పోషిస్తున్న బ్రిటన్ నటుడు బెనెడిక్ట్ గారెట్ తెలుగు చిత్ర పరిశ్రమతో తన అనుభవాలను తాజాగా పంచుకున్నారు.
తెలుగు సినిమా రంగంలో పనిచేయడం తనకెంతో అద్భుతమైన అనుభూతిని ఇచ్చిందని బెనెడిక్ట్ తెలిపారు. బ్రిటన్ సంస్కృతికి, టాలీవుడ్ వర్కింగ్ స్టైల్‌కు చాలా తేడా ఉందని.. అయితే ఇక్కడ సెట్స్‌లో దొరికే ఆదరణ, సాంకేతిక నిపుణుల పనితీరు తనను ఎంతగానో ఆకట్టుకున్నాయని కొనియాడారు. భాష రాకపోయినా? భావో ద్వేగాలను అర్థం చేసుకుంటూ దర్శకులు, తోటి నటులు అందించే సహకారం మరువలేనిదని పేర్కొన్నారు.
ఈ సందర్భంగా విజయ్ దేవరకొండ - రష్మిక మందన్నాలతో పనిచేసిన అనుభవాలను బెనెడిక్ట్ ప్రత్యేకంగా గుర్తు చేసుకున్నారు. వారిద్దరితో స్క్రీన్ పంచుకోవడం ఎంతో సంతోషాన్నిచ్చిందని.. సెట్స్‌లో వారి వినయం, అంకి తభావం తనను ఆశ్చర్యపరిచాయన్నారు. స్టార్ స్టేటస్ ఉన్నా? ఎక్కడా గర్వం లేకుండా అందరితోనూ కలివిడిగా ఉండే వారి సహజ సిద్ధమైన స్వభావం తనకు ఎంతో నచ్చిందని ప్రశంసించారు.
టాలీవుడ్ చిత్రాల మేకింగ్ గురించి మాట్లాడారు. ఇక్కడ ప్రతి షాట్‌ను, ప్రతి సన్నివేశాన్ని అత్యంత గ్రాండ్‌గా, విజువల్ వండర్‌లా మలచడానికి పడే శ్రమ చాలా గొప్పదని బెనెడిక్ట్ అభిప్రాయపడ్డారు. హాలీవుడ్ సినిమాలకు ఏమాత్రం తీసిపోని రీతిలో టెక్నికల్ వాల్యూస్ ఉండటం, భారీ సెట్లు వేసి ప్రతి విషయంలోనూ నాణ్యతను పాటించడం తెలుగు పరిశ్రమ ప్రత్యేకత అని కొనియాడారు.
భారతీయ సంస్కృతి.. తెలుగు వారి ఆచార వ్యవహారాలు, ఇక్కడి వంటకాలు తనను ఎంతగానో ఆకట్టుకు న్నాయన్నారు. షూటింగ్ విరామ సమయాల్లో యూనిట్ సభ్యులతో కలిసి మాట్లాడటం, ఇక్కడి సంప్రదాయాలను తెలుసుకోవడం తనకు సరికొత్త అనుభూతినిచ్చిందన్నారు. భవిష్యత్తులోనూ తెలుగు సినిమాల్లో మరిన్ని వైవిధ్యమైన పాత్రలు చేసేందుకు ఆసక్తిగా ఉన్నట్లు వెల్లడించారు.
అలాగే రాజమౌళి దర్శకత్వం వహించిన `ఆర్ ఆర్ ఆర్` సినిమాలో నటించిన పలువురు బ్రిటన్ నటులు కూడా తెలుగు సినిమా గురించి ఎంతో గొప్పగా చెప్పిన సందర్భాలున్నాయి. ఇక్కడ మనుషులు..మనస్తత్వాలు.. నడుచుకునే విధానాన్ని ప్రత్యకంగా సదరు నటులు ప్రశంసించారు.