వార్నర్ బ్రదర్స్ ను కోలుకోలేని దెబ్బతీసిన టామ్ క్రూజ్ ప్రయోగం!
విశ్లేషకుల అభిప్రాయం ప్రకారం ఈ చిత్రాన్ని మైండ్‌ఫుల్ ఆర్ట్-హౌస్ సినిమాగా ప్రచారం చేయాల్సి ఉండగా.. మేకర్స్ మాస్ గ్లోబల్ ఎంటర్‌టైనర్‌గా ప్రమోట్ చేయడమే ప్రధాన తప్పిదమంటున్నారు.
హాలీవుడ్ సూపర్‌స్టార్ టామ్ క్రూజ్ పేరు వింటే బాక్సాఫీస్ వద్ద భారీ వసూళ్లు.. మైండ్ బ్లోయింగ్ యాక్షన్ సీన్స్ గుర్తుకొస్తాయి. అయితే ఆయన కథానాయకుడిగా నటించిన తాజా చిత్రం `డిగ్గర్` మాత్రం విశ్లేషకులను - నిర్మాణ సంస్థ వార్నర్ బ్రదర్స్ యాజమాన్యాన్ని తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసింది. ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో తీవ్రంగా నిరాశపరిచిన ఈ చిత్రం ఏకంగా 250 మిలియన్ డాలర్ల (సుమారు 2,100 కోట్లు) భారీ నష్టాన్ని మిగిల్చే దిశగా సాగుతోంది.
ఆస్కార్ విజేత దర్శకుడు అలెజాండ్రో గొంజాలెజ్ ఇన్యారిటు దర్శకత్వంలో తెరకెక్కిన `డిగ్గర్` ఒక పొలిటికల్ అండ్ ఎన్విరాన్‌మెంటల్ శాటిరికల్ డ్రామా . ఈ చిత్రం కోసం మేకర్స్ $160 మిలియన్ల నుండి $180 మిలియన్ల వరకు ప్రొడక్షన్ బడ్జెట్‌ను వెచ్చించారు. టామ్ క్రూజ్ ప్రమోషన్లు .. గ్లోబల్ ప్రచారానికై మరో $100 మిలియన్ల వరకు మార్కెటింగ్ ఖర్చులు చేశారు. ప్రపంచవ్యాప్తంగా విడుదలైన తర్వాత ఈ చిత్రం రెండు వారాల్లో కనీసం $40 మిలియన్లు కూడా వసూలు చేయలేక చతికిలపడింది.
టామ్ క్రూజ్ అంటే `మిషన్ ఇంపాసిబుల్`, `టాప్ గన్` లాంటి మాస్ యాక్షన్ హీరోయిజం మైండ్-సెట్‌తో వచ్చే ప్రేక్షకులకు `డిగ్గర్` లో ఆయన రూపం .. పాత్ర పూర్తి విరుద్ధంగా అనిపించాయి. ఈ సినిమాలో ఆయన ఒంటిపై బట్టతల, పొట్టతో ఉన్న ధనవంతుడైన ఆయిల్ వ్యాపారి పాత్రలో ప్రయోగత్మకంగా కనిపించారు. అమెరికన్ సంస్కృతిని, పర్యావరణ విధ్వంసాన్ని ఎండగట్టేలా సాగే ఆర్ట్-హౌస్ తరహా కథాంశం మాస్ ప్రేక్షకులకు ఏమాత్రం కనెక్ట్ కాకపోవడంతో? బాక్సాఫీస్ వద్ద సీన్ రివర్స్ అయింది.
ఈ భారీ డిజాస్టర్ సమయం కూడా వార్నర్ బ్రదర్స్ సంస్థకు ఎంతమాత్రం కలిసిరాలేదు. పారామౌంట్-స్కైడాన్స్ విలీన ఒప్పందాలు జరుగుతున్న సమయంలో ఇంత పెద్ద ఆర్థిక లోటు ఏర్పడటం హాలీవుడ్ వర్గాల్లో చర్చ నీయాంశంగా మారింది. పైగా డ్యూన్ వంటి ఇతర భారీ చిత్రాలకు ఇతర కో-ఫైనాన్షియర్స్ ఉండేలా ప్లాన్ చేసే వార్నర్ బ్రదర్స్ ఈ చిత్రానికి మాత్రం పూర్తి గా 2100 కోట్ల రిస్క్‌ను ఒంటరిగానే భరించడం వల్ల ఈ నష్టాన్ని పూర్తిగా ఆ సంస్థే తలకెత్తుకోవాల్సి వచ్చింది.
విశ్లేషకుల అభిప్రాయం ప్రకారం ఈ చిత్రాన్ని మైండ్‌ఫుల్ ఆర్ట్-హౌస్ సినిమాగా ప్రచారం చేయాల్సి ఉండగా.. మేకర్స్ మాస్ గ్లోబల్ ఎంటర్‌టైనర్‌గా ప్రమోట్ చేయడమే ప్రధాన తప్పిదమంటున్నారు. అయితే టామ్ క్రూజ్ వంటి గ్లోబల్ స్టార్ ఇలాంటి సవాలుతో కూడిన కథాంశాన్ని ఎంచుకోవడం పట్ల పరిశ్రమలోని ఒక విభాగం ప్రశంసిస్తున్నా? బాక్సాఫీస్ లెక్కల్లో మాత్రం ఆయన కెరీర్‌లోనే అతిపెద్ద పరాజయాలలో ఒకటిగా మిగిలిపోతుందని భావిస్తున్నారు.
విమర్శలు, నష్టాలు ఏ స్థాయిలో ఉన్నా? నటుడిగా తన ప్రయత్నంపై టామ్ క్రూజ్ పూర్తి సంతృప్తి వ్యక్తం చేస్తు న్నారు. కాలంతో పాటు ప్రేక్షకులు సినిమాలో సారాంశాన్ని, కళాత్మక విలువలను అర్థం చేసుకుంటారని.. ఇది కాలానుగుణంగా గుర్తింపు పొందుతుందని ధీమా వ్యక్తం చేశారు. ఏదేమైనా? ఒక ప్రయోగం సరికొత్త ప్రయత్నం కోసం హాలీవుడ్ అగ్ర నటుడు .. దిగ్గజ నిర్మాణ సంస్థ భరించిన భారీ మూల్యం గ్లోబల్ సినిమా రంగాన్ని కుదిపేస్తోంది.