అల్లూరి సీతారామరాజు- RRR తరహా దేశభక్తి చిత్రం.. `రణబాలి` ప్రీరిలీజ్‌లో శివ నిర్వాణ విశ్లేషణ
విజయ్ నటించిన రణబాలి సినిమా అక్టోబర్ 16న గ్రాండ్ గా థియేటర్లలోకి విడుదలవుతున్న సంగతి తెలిసిందే.
విజయ్ నటించిన రణబాలి సినిమా అక్టోబర్ 16న గ్రాండ్ గా థియేటర్లలోకి విడుదలవుతున్న సంగతి తెలిసిందే. తాజాగా హైదరాబాద్ లో జరిగిన ప్రీ-రిలీజ్ వేడుకలో పాల్గొన్న దర్శకుడు శివ నిర్వాణ చిత్ర బృందానికి శుభాకాంక్షలు తెలుపుతూ భావోద్వేగంగా ప్రసంగించారు. సినిమా టీమ్‌లోని టెక్నీషియన్లను అభినందించిన ఆయన.. వేదికపై తన ఆత్మీయ మిత్రుడు విజయ్ దేవరకొండతో ఉన్న బంధాన్ని గుర్తుచేసుకున్నారు. ``మనుషుల మధ్య ఎక్కువ ప్రేమ ఉన్నప్పుడు ఎక్కడి నుంచి మొదలుపెట్టాలో అర్థం కాదు.. ఐ లవ్ యు బ్రో``అంటూ విజయ్ పై తనకున్న అభిమానాన్ని పంచుకున్నారు. దేవరకొండతో `ఖుషి` సినిమాకి పని చేసనప్పటి జ్ఞాపకాలు గుర్తుకొచ్చాయని, ఈ సినిమా పెద్ద బ్లాక్‌బస్టర్ సాధించిన తర్వాత విజయ్ ఇంటికి వెళ్లి హగ్ చేసుకుని సక్సెస్ వేడుకలు జరుపుకోవాలని ఉందంటూ ఆనందం వ్యక్తం చేశారు.
సినిమాలోని కంటెంట్ గురించి శివ నిర్వాణ ప్రత్యేకంగా ప్రస్తావించారు. మనకు ఎన్నో కమర్షియల్, ఫ్యామిలీ సినిమాలు వస్తుంటాయని, కానీ దేశభక్తి నేపథ్యంలో వచ్చే సినిమాలు చాలా అరుదుగా ఉంటాయని అన్నారు. గతంలో అల్లూరి సీతారామరాజు, ఆర్ఆర్ఆర్ వంటి చిత్రాల్లో అలాంటి దేశభక్తి ఎఫెక్ట్ చూశామని.. ఇప్పుడు `రణబాలి` రూపంలో ఈ తరం ప్రేక్షకులకు థియేటర్లలో సెలబ్రేట్ చేసుకునే గొప్ప దేశభక్తి చిత్రం లభించిందని తెలిపారు. ఎక్స్‌ట్రీమ్ డీటైలింగ్, టెక్నికల్ వాల్యూస్.. అద్భుతమైన విజువల్స్‌తో దర్శకుడు ఈ చిత్రాన్ని తెరకెక్కించారని ప్రశంసించారు. చిత్రబృందం వీఎఫ్ఎక్స్ కోసం తీవ్రంగా శ్రమించారని కూడా తెలిపారు.
ఈ వేదికపై హీరోయిన్ రష్మిక మందన్న నటనను శివనిర్వాణ కొనియాడారు. ఏదైనా సినిమా చూస్తున్నప్పుడు కొందరు నటీనటులతో ఎలాగైనా వర్క్ చేయాలనే ఆలోచన దర్శకులకు వస్తుంటుందని.. అందులో రష్మిక ఎప్పుడూ ముందుంటారని చెప్పారు. ముఖ్యంగా `ది గర్ల్‌ఫ్రెండ్` సినిమాలో క్లైమాక్స్ పోర్షన్‌లో మీ పర్ఫార్మెన్స్ చూసి నేను స్టన్ అయ్యాను. మీతో ఒక అద్భుతమైన పాత్ర చేయించాలనే కోరిక ఉందని శివ నిర్వాణ చెప్పుకొచ్చారు.
చివరగా చిత్ర నిర్మాతలను, మైత్రీ మూవీ మేకర్స్‌ను ప్రత్యేకంగా అభినందించారు. దర్శకుల విజన్‌ను నమ్మి 100 శాతం సపోర్ట్ ఇచ్చే నిర్మాతలు ఉండటం ఇండస్ట్రీకి ఎంతో గర్వకారణమని కొనియాడారు. గొప్ప విఎఫ్ఎక్స్ వర్క్, అప్పటి కల్చర్ .. కాస్ట్యూమ్స్ ప్రామాణికంగా ఉన్న ఈ విజువల్ వండర్‌ను ప్రేక్షకులు, ఫ్యామిలీస్ అందరూ ఆగస్టు 16న థియేటర్లలో చూసి ఆదరించాలని శివ నిర్వాణ కోరారు.