కాలంతో పాటు అభిప్రాయాలు మారతాయి!

నాగ చైతన్యతో పెళ్లి తర్వాత తమ వ్యక్తిగత జీవితంపై మీడియా - నెటిజన్లలో పెరిగిన ఆసక్తిపై కూడా శోభితా స్పందించారు.

Update: 2026-10-13 23:30 GMT

యువ సామ్రాట్ నాగ చైతన్యతో వివాహ బంధంలోకి అడుగుపెట్టిన నటి శోభితా ధూళిపాళ్ల తాజాగా తన వ్యక్తిగత అభిప్రాయాలపై చేసిన వ్యాఖ్యలు సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతున్నాయి. గతంలో తాను నటుడిని ఎప్పటికీ వివాహం చేసుకోనని వ్యాఖ్యానించిన విషయమై ఇటీవల ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో శోభిత‌ స్పందించారు. వయసు - అనుభవంతో పాటు మనుషుల ఆలోచనా ధోరణి ఎలా? మారుతుందో ఈ సందర్భంగా వివరించారు.

`ఒక నటుడిని ఎప్పటికీ డేట్ చేయను.పెళ్లి చేసుకోను` అని చెప్పిన మాటలపై ప్రశ్నించగా శోభితా నవ్వుతూ సమాధానమిచ్చారు. `కాలంతో పాటు మనుషులు పరిణతి చెందుతారు కదా? ఆ సమయంలో నా చుట్టూ ఉన్న వాతావరణాన్ని చూసి మూస ధోరణిలో అలాంటి అభిప్రాయానికి వచ్చి ఉంటాను` అని శోభితా తెలిపారు. `ఆ సమయంలో నా ఆలోచనా పరిధి చాలా సంకుచితంగా ఉండి ఉంటుంది. తమ అభిప్రాయాలను ఎప్పటికీ మార్చుకోని వారే భావాలకు ఎక్కువ భయపడుతుంటారు. కానీ నేను వేర్వేరు సమయాల్లో భిన్నమైన అభిప్రాయాలు కలిగి ఉండటానికి.. పరిస్థితులకు అనుగుణంగా నన్ను నేను మార్చుకోవడానికి ఏమాత్రం సంకోచించను` అన్నారు.

నాగ చైతన్యతో పెళ్లి తర్వాత తమ వ్యక్తిగత జీవితంపై మీడియా - నెటిజన్లలో పెరిగిన ఆసక్తిపై కూడా శోభితా స్పందించారు. `సమాజంలో చర్చలు అనేవి వాతావరణం లాంటివి. అవి వస్తుంటాయి. పోతుంటాయి. ఆ వాతావరణంతో మనం ఎక్కువగా మమేకమైపోతే? అది మారినప్పుడు మన ఉనికినే కోల్పోతాం. కాబట్టి నిజమైన స్వరూపాన్ని, వాస్తవాన్ని గ్రహించి స్థిరంగా ఉండటమే ముఖ్యం` అని శోభితా తెలిపారు.

నాగ చైతన్య- శోభితా ధూళిపాళ్ల రిలేష‌న్ షిప్ ని చాలా కాలం పాటు గోప్యంగా ఉంచిన సంగతి తెలిసిందే. అటుపై డిసెంబరు 2024 లో హైదరాబాద్‌లోని అన్నపూర్ణ స్టూడియోస్‌లో ఇరు కుటుంబాల సభ్యులు, అత్యంత సన్నిహితుల సమక్షంలో సాంప్రదాయ పద్ధతిలో వివాహ బంధంతో ఒకటయ్యారు. ప్రస్తుతం ఇద్ద‌రు సినిమాలతో బిజీగా ఉన్నారు. శోభితా ధూళిపాళ్ల తదుపరి పా రంజిత్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న తమిళ సైన్స్ ఫిక్షన్ డ్రామా `వెట్టువం`లో నటిస్తుండగా, నాగ చైతన్య కార్తీక్ దండు దర్శకత్వంలో `వృషకర్మ` చిత్రంలో నటిస్తున్నారు.

ఇదంతా ప‌క్క‌న బెడితే? నాగ‌చైత‌న్య‌- శోభిత జంట‌గా సినిమా ఎప్పుడు చేస్తారు? అని అభిమానులు అంతే ఆస‌క్తిగా అడుగుతున్నారు. చై-శో జోడీ ఓసారి ఈ విష‌యం గురించి కూడా సీరియ‌స్ గా ఆలోచ‌న చేయాలంటూఏ రిక్వెస్ట్ చేస్తున్నారు.

Tags:    

Similar News