పుష్ప మూవీలో కేశవ పాత్ర కోసం అతన్ని కూడా..

తాజాగా సుహాస్ పేరు కూడా కేశవ చేసిన రోల్ కోసం పరిశీలించడం జరిగిందని డైరెక్టర్ సుకుమార్ తెలిపారు.

Update: 2024-04-27 04:43 GMT

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన మూవీ పుష్ప పార్ట్ 1 ఎంత పెద్ద హిట్ అయ్యిందో అందరికి తెలిసిందే. ఈ సినిమాలో అల్లు అర్జున్ ఫ్రెండ్ క్యారెక్టర్ లో కేశవ నటించాడు. సుకుమార్ పుష్ప మూవీ కథని కూడా కేశవ పాయింట్ ఆఫ్ వ్యూలోనే నేరేట్ చేశారు. అతని పాత్రకి సినిమాలో మంచి ప్రాధాన్యత లభించింది. కేశవ పుష్ప మూవీ ద్వారా స్టార్ యాక్టర్ గా మారిపోయాడు.

 

పుష్ప 2 మూవీలో కూడా కేశవ పాత్రకి మంచి ప్రాధాన్యత ఉంది. అయితే కేశవ కంటే ముందుగా అతని పాత్ర కోసం సుకుమార్ చాలా మంది నటులను అనుకున్నారట. కొంతమంది పేర్లు పరిశీలించి మళ్ళీ ఆగిపోయారని తెలుస్తోంది. ప్రత్యేకంగా ఆడిషన్స్ కూడా నిర్వహించారు. అందులో కొంతమంది ప్రముఖ నటులు కూడా పాల్గొన్నారు. తాజాగా సుహాస్ పేరు కూడా కేశవ చేసిన రోల్ కోసం పరిశీలించడం జరిగిందని డైరెక్టర్ సుకుమార్ తెలిపారు.

సుహాస్ లీడ్ రోల్ లో నటించిన ప్రసన్నవదనం మూవీ ట్రైలర్ రిలీజ్ ఈవెంట్ లో సుకుమార్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా అతను సుహాస్ ని ప్రశంసించారు. నేచురల్ యాక్టర్ నాని తరహాలోనే సుహాస్ కూడా తన సహజసిద్ధమైన నటనతో ఆకట్టుకుంటున్నాడని పేర్కొన్నారు. సుహాస్ కి హీరోగా చాలా మంచి భవిష్యత్తు ఉందని తెలిపారు. పుష్ప సినిమాలో కేశవ రోల్ కోసం ముందుగా సుహాస్ పేరుని పరిశీలించడం జరిగిందని అన్నారు.

అయితే ఆ సమయంలో సుహాస్ హీరోగా నిలబడే ప్రయత్నం చేస్తున్నారని, అందుకే ఆ పాత్రకి తీసుకోవడం బాగోదనిపించి సంప్రదించలేదని సుకుమార్ తెలియజేశారు. అయితే సుహాస్ కేశవ పాత్రలో నటించి ఉంటే కచ్చితంగా అతని కెరియర్ కి మంచి మైలేజ్ లభించేదనే మాట వినిపిస్తోంది. అయితే సుహాస్ ప్రస్తుతం హీరోగా తనదైన శైలిలో వరుస సినిమాలు చేస్తూ దూసుకుపోతున్నాడు.

నేచురాలిటీకి దగ్గరగా ఉండే కథలు చేస్తూ నటుడిగా ఒక్కో మెట్టు ఎక్కుతున్నాడు. కచ్చితంగా ఫ్యూచర్ లో యాక్టర్ గా తనకంటూ ఒక మార్కెట్ ని సుహాస్ క్రియేట్ చేసుకుంటాడని సినీ విశ్లేషకులు భావిస్తున్నారు. తాజాగా సుహాస్ నుంచి వచ్చిన ప్రసన్నవదనం ట్రైలర్ కి పాజిటివ్ టాక్ వస్తోంది. మరో సారి డిఫరెంట్ కాన్సెప్ట్ తో సుహాస్ ప్రేక్షకుల ముందుకి రాబోతున్నాడనే అభిప్రాయం వ్యక్తం అవుతోంది. సుకుమార్ బ్లెస్సింగ్స్ దొరికాయి కాబట్టి భవిష్యత్తులో అతని ప్రొడక్షన్ లో కూడా సుహాస్ హీరోగా అవకాశం అందుకుంటాడేమో చూడాలి.

Tags:    

Similar News