• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  నాని.. ఆ ఒక్కటి...

నాని.. ఆ ఒక్కటి తక్కువైందని..

| టాలీవుడ్ లో మోస్ట్ స్టైలిష్ డైరెక్టర్ గా తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపుని సొంతం చేసుకున్న యువ దర్శకుడు సుజిత్.

By - Tupaki Desk
Update: 2024-04-13 11:30 GMT

టాలీవుడ్ లో మోస్ట్ స్టైలిష్ డైరెక్టర్ గా తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపుని సొంతం చేసుకున్న యువ దర్శకుడు సుజిత్. రన్ రాజా రన్, సాహో సినిమాలతో తన సత్తా ఏంటో చూపించాడు. ఇప్పుడు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో ఓజీ మూవీ పాన్ ఇండియా రేంజ్ లో చేస్తున్నాడు. ఈ సినిమాపై పవర్ స్టార్ అభిమానులు భారీ ఆశలే పెట్టుకున్నారు. ఇప్పటి వరకు మూవీ నుంచి వచ్చిన పోస్టర్స్, గ్లింప్స్ కూడా సినిమాపై హైప్ పెంచాయి.

డివివి దానయ్య ఈ చిత్రాన్ని భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నారు. ఈ మూవీ తర్వాత సుజిత్ నేచురల్ స్టార్ నానితో ఓ సినిమాని కన్ఫర్మ్ చేసేసాడు. ఈ మూవీని కూడా డివివి దానయ్య నిర్మించబోతున్నారు. ఓజీ రిలీజ్ తర్వాత ఈ ఏడాదిలోనే నానితో చేయబోయే ఆ కొత్త సినిమా కూడా పట్టాలు ఎక్కనుంది. ప్రస్తుతం నాని వివేక్ ఆత్రేయ దర్శకత్వంలో సరిపోదా శనివారం మూవీ చేస్తున్నారు. ఈ సినిమా త్వరలో రిలీజ్ కానుంది.

దీని తర్వాత సుజిత్ దర్శకత్వంలో చేయబోయే సినిమాపై ఫోకస్ చేయనున్నాడని టాక్ వినిపిస్తోంది. ఈ మూవీ గురించి ఇంటరెస్టింగ్ టాక్ బయటకొచ్చింది. ఈ సినిమా సుజిత్ మొదటి చిత్రం రన్ రాజా తరహాలో ఎంటర్టైన్మెంట్ మిక్స్ అయిన యాక్షన్ మూవీగా ఉండబోతోందంట. కథ కొత్తగా ఇంటరెస్టింగ్ గా ఉండటంతో నాని ఒకే చేసాడని టాక్.

ఈ మధ్యకాలంలో నాని నుంచి ఎక్కువగా సీరియస్ నోట్ లో ఉన్న కథలే వస్తున్నాయి. దసరా, హాయ్ నాన్న, ఇప్పుడు చేస్తోన్న సరిపోదా శనివారం సినిమాలలో కామెడీ కొద్దిగా తక్కువగానే ఉంది. నాని నుంచి ఆడియన్స్ భలే భలే మగాడివోయ్ లాంటి కంప్లీట్ కామెడీ ప్యాకేజ్ తో పాటుగా యాక్షన్ కూడా కోరుకుంటున్నారు.

సుజిత్ ఈ రెండింటిని బ్యాలెన్స్ చేస్తూ నానితో నెక్స్ట్ మూవీ చేయబోతున్నాడంట. అయితే ఈ సారి నాని తన ఫ్యాన్స్ కి కొత్త అనుభూతిని అందించబోతున్నాడు అని అర్ధమవుతోంది. ఈ సినిమాతో నాని ఎలాంటి సక్సెస్ అందుకుంటాడు అనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. త్వరలోనే ఈ కాంబినేషన్ పై మరో క్లారిటీ రానుంది.

సుజిత్ మూవీ తర్వాత నాని దసరా దర్శకుడు శ్రీకాంత్ ఒదేలతో మరో సినిమా చేయనున్నాడు. ఆ ప్రాజెక్టు వచ్చే ఏడాది సెట్స్ పైకి వెళ్లనుందని టాక్. డివివి దానయ్య నిర్మాణంలో నాని గతంలో నిన్నుకోరి సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్నారు. ప్రస్తుతం సరిపోదా శనివారం మూవీతో వస్తున్నాడు. నెక్స్ట్ సుజిత్ మూవీతో మూడో సినిమా చేయబోతూ ఉండటం విశేషం.

Tags:    
  • Nani 
  • Saripodhasanivaram 
  • Sujeeth 
  • Ogmovie 
  • Srikanthodela 
  • Dasara 
  • Tollywood 
  • Filmindustry 

Similar News

ఫోటో స్టోరి: బెబో స్ట్రైక్స్ ఎగైన్.. రీప్లేస్‌మెంటే లేని అందం!

2026-11-02 13:52 GMT

కాంబినేష‌న్ విడిపోవ‌డం విచార‌క‌ర‌మే!

2026-11-02 13:51 GMT

హీరోలే విల‌న్లు ఇంకెన్ని మార్పులో!

2026-11-02 13:30 GMT

పాలిటిక్స్‌లోకి రావాలంటే ‘ది ట్రైటర్స్’ చూస్తే చాలు.. శ్రీదేవి చౌదరి కామెంట్స్ వైరల్!

2026-11-02 12:30 GMT

రజినీకాంత్ తో భారీ సక్సెస్ కొట్టలేకపోయిన ఈ తరం స్టార్ డైరెక్టర్లు...

2026-11-02 11:30 GMT

రామాయణంపై అనవసరమైన సెటైర్లు ఎందుకు?

2026-11-02 11:02 GMT

అందరినీ మెప్పించలంటే.. ఐస్‌క్రీమ్ అమ్ముకోవాలా..!

2026-11-02 10:00 GMT

వెండితెర నుంచి రగ్బీ మైదానం వరకు!

2026-11-02 10:00 GMT

కోలీవుడ్ చరిత్రలో సరికొత్త అధ్యాయం!

2026-11-02 09:52 GMT

బడా స్టార్లకు కొత్త కథలు కరువయ్యాయా? స్పై యాక్షన్‌పై పెరుగుతున్న అసంతృప్తి!

2026-11-02 09:50 GMT

ప్రత్యక్షంగా కనిపించకపోయినా..అభిమానుల మనసు గెలుచుకున్న బాద్‌షా!

2026-11-02 09:49 GMT

మెగా ఫ్యామిలీలో పెళ్లి సందడి.. సాయి ధరమ్ తేజ్ నిశ్చితార్థం, పెళ్లి ముహూర్తలు ఇవే..!

2026-11-02 09:49 GMT

Copyright @2026

Powered by Blink CMS