సుజీత్ మొండిపట్టు.. తన మాటల్లోనే!
సుజీత్.. ఇటీవల పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో ఓజీ సినిమా చేసి మంచి విజయం తన ఖాతాలో వేసుకున్నారు.;
సుజీత్.. ఇటీవల పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో ఓజీ సినిమా చేసి మంచి విజయం తన ఖాతాలో వేసుకున్నారు. మొదటి రోజే ఈ సినిమా రూ.150 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ వసూలు చేసి సంచలనం సృష్టించింది. అంతేకాదు పవన్ కళ్యాణ్ కెరియర్లో మొదటి రోజే రూ.100 కోట్ల క్లబ్లో చేరిన తొలి సినిమాగా కూడా రికార్డు సృష్టించింది. ఇదిలా ఉండగా.. ఈ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా పలు ఛానల్స్ కు ఇంటర్వ్యూ ఇస్తున్న సుజీత్.. ఓజీ సినిమా విశేషాలతో పాటు తన గత చిత్రాల విశేషాలను కూడా పంచుకుంటున్నారు.
అందులో భాగంగానే ప్రభాస్ తో చేసిన సాహో సినిమా గురించి.. ఆ సినిమా క్లైమాక్స్లో ప్రభాస్ కూర్చునే చైర్ గురించి తాజాగా ఒక ఇంటర్వ్యూలో వెల్లడించారు సుజీత్. ముఖ్యంగా ఈ చైర్ కోసం ఆయన ఎంత మొండిపట్టు పట్టారు అనే విషయాన్ని ఆయనే స్వయంగా వివరించారు కూడా. అసలు విషయంలోకి వెళ్తే.. ఇంటర్వ్యూలో భాగంగా.." సాహో సినిమా క్లైమాక్స్ లో వచ్చే చైర్ కోసం మీరు ఏకంగా నాలుగు సార్లు రీ డిజైన్ చేయించారంట కదా?" అని ప్రశ్నించగా..
దానికి సుజీత్ మాట్లాడుతూ.. ఇది విన్నాక చూసేవారికి ఏమనిపిస్తుంది అంటే.. 4 సార్లు రీ డిజైన్ చేయించారు అంటే వీడికి నిర్మాతల చేత డబ్బు ఎలా ఖర్చు పెట్టించాలా అనే కోరిక ఎక్కువ ఉంది అని అనుకుంటారు. నిజానికి ఒక పర్ఫెక్షన్ కోసమే మేము ఆ చైర్ ని డిజైన్ చేశాము. అయితే పెద్దగా ఆ చైర్ కు ఖర్చు కూడా అవ్వలేదు. మొదట మేము డీలర్స్ తో మాట్లాడి.. ఒక చైర్ తెప్పించాం. అన్నీ చైర్స్ కంటే ఒక మంచి చైర్ ఉండాలనుకున్నాము.
అందుకే మెటల్ తో చేయించిన చైర్ తెప్పించాం. ఇక చైర్ అయితే బాగుంది కానీ వెనకాల నుంచి డిఓపి షార్ట్ తీస్తుంటే చైర్ కనిపిస్తోంది కానీ హీరో తల కనిపించలేదు. అది ఒక డిస్కషన్, బేస్ మెంట్ నుంచీ చూస్తే మళ్లీ చిన్నగా అనిపించి.. దీన్ని పెద్దగా చేయిద్దామని అదొక డిస్కషన్.. ఎందుకంటే చూసే ఆడియన్స్ కి అనిపించాలి.. ఆ చైర్ లో ప్రభాస్ కూర్చోవాలి అని.. అందుకే ఆ షాట్ కోసం ఎంతో కష్టపడ్డాము. ముఖ్యంగా సినిమాలో మేము చేసిన ఫస్ట్ షాట్ కూడా అదే.. చూసే ఆడియన్స్ కోసమైనా పర్ఫెక్షనిస్ట్ తప్పనిసరి. అందుకే మొండిపట్టు పట్టు మరీ ఆ చైర్ ను అదే పనిగా తయారు చేయించి.. సినిమా కోసం పెట్టించాము. ఈ సినిమా లో ఇది క్లైమాక్స్ లో వచ్చినా.. సినిమా షూటింగ్ మొదలవగానే దీనినే ఫస్ట్ షాట్ గా తీయడం జరిగింది. ఆ తర్వాతే మిగతా సినిమా షూటింగ్ మొదలు పెట్టాము. " అంటూ ఆ చైర్ కోసం.. ఆ సన్నివేశం కోసం సుజిత్ ఎంత మొండిపట్టు పట్టారు అనే విషయాన్ని ఆయన మాటల్లోనే వివరించారు. ప్రస్తుతం ఈ విషయం విని సుజీత్ కి ఇంత పట్టుదలా.. అందుకే ప్రతి షాట్ అద్భుతం అంటూ ఫ్యాన్స్ కామెంట్లు చేస్తున్నారు.