అనుష్క డ్రాప్.. సుహాస్ కు పెద్ద రిలీఫ్.. హిట్ కొట్టేస్తాడా?

టాలీవుడ్ యంగ్ హీరో సుహాస్ కు ఎలాంటి క్రేజ్ ఉందో అందరికీ తెలిసిందే. తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్నారు.;

Update: 2025-07-02 13:30 GMT

టాలీవుడ్ యంగ్ హీరో సుహాస్ కు ఎలాంటి క్రేజ్ ఉందో అందరికీ తెలిసిందే. తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్నారు. స్పెషల్ ఫ్యాన్ బేస్ సొంతం చేసుకున్నారు. రిజల్ట్ తో సంబంధం లేకుండా వరుస సినిమాల్లో యాక్ట్ చేస్తున్నారు. ఇప్పుడు సుహాస్.. ఓ భామ అయ్యో రామతో థియేటర్స్ లోకి రానున్నారు.

బ్యూటిఫుల్ రొమాంటిక్ ఎంటర్టైనర్ గా హరీశ్ నల్ల తెరకెక్కిస్తున్న ఆ సినిమాలో మాళవిక మనోజ్ హీరోయిన్ గా నటిస్తున్నారు. అనిత, ఆలీ ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. ఇప్పటికే అన్ని పూర్తి చేసుకున్న చిత్రం నుంచి మేకర్స్ రిలీజ్ చేసిన ప్రమోషనల్ కంటెంట్ కు మంచి రెస్పాన్స్ వచ్చింది. ఇప్పుడు మేకర్స్ ప్రమోషన్స్ తో బిజీగా ఉన్నారు.

పలు ఇంటర్వూలు ఇచ్చి సందడి చేస్తున్నారు సుహాస్. కంటెంట్ చూస్తుంటే మంచి ఎంటర్టైన్మెంట్ సినిమాలో ఉన్నట్టు అనిపిస్తుంది. అదే సమయంలో సుహాస్ కూడా భారీ ఆశలు పెట్టుకున్నారు. ఎందుకంటే గొర్రె పురాణం, శ్రీరంగనీతులు, జనక అయితే గనక సినిమాలతో వరుసగా బాక్సాఫీస్ వద్ద డిజాస్టర్లను అందుకున్నారు.

అంబాజీ పేట మ్యారేజీ బ్యాండ్ మూవీతో పర్లేదనిపించుకున్నారు. అలా రైటర్ పద్మభూషణ్ తర్వాత సరైన హిట్ అందుకోని సుహాస్.. ఇప్పుడు ఓ భామ అయ్యో రామాతో భారీ విజయం అందుకోవాలని చూస్తున్నారు. బాక్సాఫీస్ వద్ద మరోసారి అలరించాలని ఫిక్స్ అయ్యారు. అయితే ఇప్పుడు సుహాస్ కు సోలో డేట్ దక్కినట్లు కనిపిస్తుంది.

ఎందుకంటే ఆ రోజుకి ఇప్పటికే షెడ్యూల్ చేసుకున్న స్టార్ హీరోయిన్ అనుష్క మూవీ ఘాటీ వాయిదా పడడం కన్ఫర్మ్. ఇంకా పోస్ట్ ప్రొడక్షన్ పనులు చాలా పెండింగ్ ఉన్నట్లు తెలుస్తోంది. క్రిష్ జాగర్లమూడి దర్శకత్వం వహిస్తున్న ఆ సినిమాను యూవీ క్రియేషన్స్ నిర్మిస్తోంది. మొత్తం వర్క్ అయ్యాక కొత్త రిలీజ్ డేట్ ను అనౌన్స్ చేయనుందట.

అలా ఘాటీ వాయిదా పడడం.. ఇప్పుడు సుహాస్ కలిసి రానుంది. అయితే సినిమా హిట్ అవ్వాలంటే.. మంచి వసూళ్లు రావాలంటే పాజిటివ్ టాక్ ఫుల్ గా స్ప్రెడ్ అవ్వాలి. మూవీ క్లిక్ అయితే పోస్ట్ ప్రమోషన్స్ ను జోరుగా నిర్వహించాలి. అప్పుడు సినిమాపై అందరి ఫోకస్ పడుతుంది. మరి ఓ భామ అయ్యో రామ ఎలా ఉంటుందో.. ఎంతటి హిట్ అవుతుందో వేచి చూడాలి.

Tags:    

Similar News