పాన్ ఇండియా 'సుడిగాడు'లో యానిమల్...!
అల్లరి నరేష్ హీరోగా రూపొందిన '12ఎ రైల్వే కాలనీ' సినిమా నేడు ప్రేక్షకుల ముందుకు వచ్చింది.;
అల్లరి నరేష్ హీరోగా రూపొందిన '12ఎ రైల్వే కాలనీ' సినిమా నేడు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. గత రెండు వారాలుగా అల్లరి నరేష్ ఈ సినిమా ప్రమోషన్స్‌తో బిజీగా ఉన్నాడు. ఈ సినిమా విడుదలై, ప్రమోషన్ కార్యక్రమాలు పూర్తి అయిన తర్వాత వచ్చే వారం నుంచి కొత్త సినిమా షూటింగ్‌లో పాల్గొనబోతున్నట్లుగా నరేష్ ఒక ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చాడు. కామెడీ సినిమాల కోసం ఎదురు చూస్తున్న ప్రేక్షకులకు అల్లరి నరేష్ ఈ సినిమాతో థ్రిల్ చేసేందుకు వచ్చాడు. 12ఎ రైల్వే కాలనీ సినిమా హర్రర్ థ్రిల్లర్ అంటూ మొదటి నుంచి చెబుతూ వచ్చారు. పొలిమేర వంటి విభిన్న చిత్రాలను ప్రేక్షకులకు అందించిన అనిల్ రాసిన కథతో ఈ సినిమా రూపొందింది. నాని కాసర్గడ్డ దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమాలో డాక్టర్ కామాక్షి భాస్కర్ల హీరోయిన్‌గా నటించడం ప్రత్యేకంగా చెప్పుకోదగ్గ విషయం.
అల్లరి నరేష్ హీరోగా 12ఎ రైల్వే కాలనీ...
12ఎ రైల్వే కాలనీ సినిమాపై చాలా ఆశలు పెట్టుకున్న అల్లరి నరేష్ ప్రమోషన్ కార్యక్రమాల్లో చాలా యాక్టివ్‌గా కనిపించాడు. గత కొంత కాలంగా చాలా స్లోగా సినిమాలు చేస్తూ వచ్చిన అల్లరి నరేష్ ఇక ముందు బ్యాక్ టు బ్యాక్ సినిమాలతో బాక్సాఫీస్ వద్ద దడదడలాడిస్తాను అంటూ ప్రమోషన్ కార్యక్రమాల్లో, ఇంటర్వ్యూల్లో చెప్పుకొచ్చాడు. ప్రేక్షకులు కోరుకున్నట్లుగా కామెడీ సినిమాలతో పాటు, అన్ని తరహా సినిమాలు, పాత్రలు చేయడం ద్వారా బిజీగా ఉంటాను అని హామీ ఇచ్చాడు. ముఖ్యంగా ఈ సినిమా ప్రమోషన్ సమయంలో అల్లరి నరేష్ ప్రముఖంగా సుడిగాడు సినిమా సీక్వెల్ గురించి స్పందించాడు. సుడిగాడు 2 సినిమాను చేయాలి అనేది చాలా కాలంగా అనుకుంటున్నామని చెప్పుకొచ్చాడు. ఇప్పటికే స్క్రిప్ట్ చర్చల దశలో ఉందని, దాదాపుగా 16 నెలల పాటు సుడిగాడు స్క్రిప్ట్ పై వర్క్ జరిగినట్లు అల్లరి నరేష్ చెప్పుకొచ్చాడు. వచ్చే ఏడాది సుడిగాడు 2 ఉండవచ్చు అని అల్లరి నరేష్ చెప్పారు.
సుడిగాడు సినిమా కథ విషయంలో...
గతంలో ఒక వ్యక్తి సోషల్ మీడియాలో సౌత్ ఇండియన్ సినిమాల సీన్స్‌కు లాజిక్ ఉండదు అనే ఉద్దేశంతో సుడిగాడు సినిమాలోని ఒక సీన్ ను షేర్ చేయడం జరిగింది. అప్పుడు చాలా మంది అది ఒక పేరడీ మూవీ అని, దాన్ని లాజికల్‌గా చూడకూడదు అంటూ చెప్పడంతో ఆయన ఆ ట్వీట్‌ను డిలీట్ చేశాడు. సుడిగాడు సినిమాలో ఉండే పేరడీని నార్త్ ఇండియన్స్ అర్థం చేసుకోలేదు. అందుకే పాన్ ఇండియన్ సినిమాలు, ఉత్తరాదిన హిట్ అయిన సినిమాలను పేరడీ చేస్తూ కచ్చితంగా సుడిగాడు 2 ఉంటుంది అని అల్లరి నరేష్ అన్నాడు. దాంతో వారికి అప్పుడు కచ్చితంగా సుడిగాడు సినిమా యొక్క పేరడీ అర్థం అవుతుంది అన్నట్లుగా అల్లరి నరేష్ వ్యాఖ్యలు చేశాడు. సుడిగాడు సినిమా కోసం పుష్ప 2, యానిమల్ సినిమాలోని సీన్స్‌ను సైతం పేరడీ చేసేందుకు స్క్రిప్ట్ లో ప్లాన్ చేస్తున్నట్లుగా నరేష్ పేర్కొన్నాడు.
అల్లరి నరేష్ సుడిగాడు ఎప్పుడు..?
2012లో వచ్చిన సుడిగాడు సినిమా కథ చాలా విచిత్రంగా, వింతగా ఉంటుంది. ఇలాంటి కథతో సినిమా తీస్తారా అనే అనుమానం కలిగే విధంగా ఉంటుంది. ఏ మాత్రం లాజిక్ లేకుండా, కేవలం కామెడీ ప్రధానంగా సాగే సుడిగాడు సినిమాను ఇప్పటి తరం ప్రేక్షకులు ఏమేరకు ఆదరిస్తారు అనేది అనుమానమే. ఎందుకంటే ప్రస్తుతం కాలం పూర్తిగా మారింది, జెనరేషన్‌కు తగ్గట్లుగా కథలు, సినిమాలు రావాల్సిందే. పాత మూస పద్దతిలో వచ్చే సినిమాలకు ప్రేక్షకుల నుంచి తిరస్కరణ తప్పడం లేదు. అందుకే సుడిగాడు 2 సినిమాను తీసుకు వచ్చి, అప్పటి మాదిరిగానే విచిత్రమైన, వింత లాజిక్ లేని కథను తీసుకు వస్తే జనాలు ఆదరిస్తారా అనేది అనుమానమే. అయితే ప్రయోగాత్మకంగా మీడియం బడ్జెట్ లేదా లో బడ్జెట్‌లో సినిమాను తీస్తే ఒక వర్గం ప్రేక్షకులు అయినా చూసినా పెద్దగా ఇబ్బంది లేదు. కనుక సుడిగాడు 2 సినిమా విషయంలో అన్ని విధాలుగా జాగ్రత్తలు అవసరం అనేది విశ్లేషకుల అభిప్రాయం. మరి అల్లరోడు ఫైనల్‌గా ఏ కథను ఓకే చేస్తాడో? సుడిగాడు మళ్లీ ఎలా వస్తాడో చూడాలి.