సుధీర్ బాబు.. ఈసారి గట్టి ప్లాన్ తో..

టాలీవుడ్ యంగ్ హీరో సుధీర్ బాబు గురించి అందరికీ తెలిసిందే. సూపర్ స్టార్ కృష్ణ అల్లుడిగా, మహేష్ బాబు బావగా ఇండస్ట్రీలోకి వచ్చిన ఆయన.. తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్నారు.;

Update: 2025-11-12 05:30 GMT

టాలీవుడ్ యంగ్ హీరో సుధీర్ బాబు గురించి అందరికీ తెలిసిందే. సూపర్ స్టార్ కృష్ణ అల్లుడిగా, మహేష్ బాబు బావగా ఇండస్ట్రీలోకి వచ్చిన ఆయన.. తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్నారు. స్పెషల్ ఫ్యాన్ బేస్ ను సొంతం చేసుకున్నారు. ఎప్పుడూ వైవిధ్యమైన ప్రయోగాలకు ఎప్పుడు ముందు ఉండే హీరోల్లో ఒకరిగా నిలిచారు.

కెరీర్ స్టార్ట్ నుంచి కూడా ప్రత్యేక కథలు.. వైరుధ్యమైన కాన్సెప్టులు ఎంచుకుంటూ సందడి చేస్తున్నారు సుధీర్ బాబు. తన యాక్టింగ్ తో అందరినీ అలరిస్తున్నారు. రిజల్ట్ తో సంబంధం లేకుండా వరుస సినిమాలు చేస్తున్న ఆయన.. అనుకున్నంత స్థాయిలో హిట్స్ ను అందుకోలేకపోతున్నారు. సరైన విజయం కోసం ఎదురుచూస్తూ ఉన్నారు.

రీసెంట్ గా జటాధర మూవీతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన సుధీర్ బాబు.. మళ్లీ ఆడియన్స్ ను అలరించలేకపోయారనే చెప్పాలి. సూపర్ నేచురల్ థ్రిల్లర్ గా రూపొందిన సినిమాపై విడుదలకు ముందు సినీ ప్రియుల్లో మంచి అంచనాలు ఏర్పడ్డాయి. టీజర్, ట్రైలర్, సాంగ్స్ సహా ప్రమోషనల్ కంటెంట్ పాజిటివ్ బజ్ క్రియేట్ చేసింది.

కానీ మూవీ రిలీజ్ అయ్యాక మాత్రం అనుకున్న స్థాయిలో ఆడియన్స్ నుంచి రెస్పాన్స్ మాత్రం అందుకోలేకపోయింది. దీంతో సుధీర్ బాబు మంచి కమ్ బ్యాక్ ఇస్తారనుకుంటే మళ్లీ నిరాశే మిగిలింది. అయితే ఆయన మళ్లీ బాక్సాఫీస్ వద్ద నెవ్వర్ బిఫోర్ అనేలా హిట్ ను అందుకోవాల్సిన అవసరం ఎలా ఉంది. అప్పుడే సుధీర్ కెరీర్ గాడిలో పడుతుంది.

అందుకు గాను ఇప్పుడు సుధీర్ బాబు గట్టి ప్లాన్ తో సిద్ధమయ్యారని తెలుస్తోంది. వివిధ వర్గాల ప్రేక్షకులను ఆకర్షించే సరైన స్క్రిప్ట్‌ ను ఎంచుకోవడంపై దృష్టి పెట్టారని సమాచారం. నటుడు, దర్శకుడు రాహుల్ రవీంద్రన్ తో ఓ సినిమా చేసేందుకు రెడీ అవుతున్నారని సినీ వర్గాల్లో టాక్ వినిపిస్తోంది. ఇప్పటికే ఆ విషయంపై చర్చలు జరుగుతున్నాయట.

అయితే రీసెంట్ గా రాహుల్ రవీంద్రన్ తెరకెక్కించిన ది గర్ల్ ఫ్రెండ్ మూవీ రిలీజ్ అయిన సంగతి తెలిసిందే. రష్మిక మందన్న లీడ్ రోల్ లో నటించిన ఆ సినిమా.. మంచి రెస్పాన్స్ అందుకుంది. రాహుల్ రవీంద్రన్ తన మేకింగ్ అండ్ టేకింగ్ తో ప్రశంసలు అందుకున్నారు. ఇప్పుడు మరో ఇంట్రెస్టింగ్ సబ్జెక్ట్ తీసుకుని సుధీర్ బాబుతో వర్క్ చేయనున్నారని సమాచారం. మరి రాహుల్.. సుధీర్ బాబుకు ఎలాంటి హిట్ ను అందిస్తారో అంతా వేచి చూడాలి.

Tags:    

Similar News