ఏలియన్స్ భూమిపైకి వచ్చేశాయా?
ఇటీవలి కాలంలో ప్రపంచవ్యాప్తంగా ఉన్న వివిధ దేశాల అంతరిక్ష పరిశోధనా సంస్థలు ఏలియన్స్ ఉనికిపై చేస్తున్న పరిశోధనలను స్వాగతించారు.
హాలీవుడ్ దిగ్గజ దర్శకుడు స్టీవెన్ స్పీల్ ఏలియన్స్ ..యూఎఫ్ఓ ల ఉనికిపై చేసిన వ్యాఖ్యలు ప్రపంచవ్యాప్తంగా తీవ్ర చర్చకు దారితీశాయి. సైన్స్ ఫిక్షన్ చిత్రాలను తెరకెక్కించడంలో దిట్ట అయిన బర్గ్ .. అంతరిక్షంలో మనకంటే అత్యంత తెలివైన జీవులు ఉన్నాయని తాను బలంగా నమ్ముతున్నట్లు పేర్కొన్నారు. ఇటీవల జరిగిన `డిస్‌క్లోజర్ డే` సందర్భంగా ఈ అంశంపై స్పీల్ ఆసక్తికరమైన కోణాలను పంచుకున్నారు. గ్రహాంతరవాసుల ఉనికి అనేది కేవలం ఊహ కాదని.. అది వాస్తవ రూపం దాల్చే రోజు ఎంతో దూరంలో లేదని అభిప్రాయపడ్డారు. స్పీల్ తన సుదీర్ఘ సినీ కెరీర్‌లో `క్లోజ్ ఎన్‌కౌంటర్స్ ఆఫ్ ది థర్డ్ కైండ్`, `ఈ.టి. ది ఎక్స్‌ట్రా-టెరెస్ట్రియల్` వంటి అద్భుతమైన ఏలియన్ ఆధారిత చిత్రాలను ప్రేక్షకులకు అందించారు.
అయితే ఇవన్నీ కేవలం తన కల్పనలు కావని, విశ్వంలో మానవాళి కంటే శక్తివంతమైన సమాజాలు ఉన్నాయనే తన నమ్మకానికి దృశ్యరూపాలేనని స్పష్టం చేశారు. విశ్వం ఎంత విశాలమైనదో? ఆలోచిస్తే కేవలం మన భూమిపై మాత్రమే జీవం ఉందని అనుకోవడం చాలా అవివేకం అవుతుందని వ్యాఖ్యానించారు. ఇదే సందర్భంలో ఆయన అమెరికా ప్రభుత్వం -రక్షణ రంగ సంస్థల వద్ద ఉన్న గోప్యమైన సమాచారం గురించి ప్రస్తావించారు. ఆకాశంలో కనిపించే కొన్ని గుర్తుతెలియని ఎగిరే వస్తువులకు సంబంధించిన ఆధారాలను , వీడియోలను ప్రభుత్వం చాలా కాలంగా దాచిపెడుతోందని వస్తున్న ఆరోపణలను గుర్తు చేశారు.
శాస్త్ర సాంకేతిక రంగాలలో ప్రభుత్వం సాధించిన ప్రగతి కంటే, అంతరిక్షం నుండి వచ్చే జీవుల సాంకేతికత ఎంతో ముందంజలో ఉండి ఉండవచ్చని అందుకే వాటి గురించి పూర్తి వివరాలను వెల్లడించడానికి ప్రభుత్వాలు వెనుకాడతాయని అభిప్రాయపడ్డారు. గ్రహాంతరవాసులు ఇప్పటికే ఏదో ఒక రూపంలో భూమిని సందర్శించి ఉంటారనే అనుమానాన్ని వ్యక్తం చేసారు. `వారు మనల్ని గమనిస్తూ ఉండవచ్చు. కానీ మన నాగరికత వారి కంటే వెనుకబడి ఉండటం వల్ల లేదా మనతో నేరుగా సంబంధాలు పెట్టుకోవడం వారికి ఇష్టం లేకపోవడం వల్ల వారు బహిరంగంగా కనిపించడం లేదేమో` అని స్పీల్ విశ్లేషించారు. గ్రహాంతరవాసుల సాంకేతికత మానవాళి ఊహకందని స్థాయిలో ఉంటుందని ఆయన నమ్ముతున్నారు.
ఇటీవలి కాలంలో ప్రపంచవ్యాప్తంగా ఉన్న వివిధ దేశాల అంతరిక్ష పరిశోధనా సంస్థలు ఏలియన్స్ ఉనికిపై చేస్తున్న పరిశోధనలను స్వాగతించారు. గతంతో పోలిస్తే ఇప్పుడు యూఎఫ్ఓల గురించిన చర్చలు బహిరంగంగా సాగుతున్నాయని, ఇది సానుకూల పరిణామమని అన్నారు. ప్రజలు కూడా ఇలాంటి విషయాలను కేవలం సైన్స్ ఫిక్షన్ కథలుగా చూడకుండా శాస్త్రీయ కోణంలో అర్థం చేసుకోవడానికి ప్రయత్నించాలని కోరారు. భవిష్యత్తులో ఏదో ఒక రోజు మానవాళికి, గ్రహాంతరవాసులకు మధ్య అధికారికంగా పరిచయం ఏర్పడే అవకాశం ఉందని స్పీల్ ఆశాభావం వ్యక్తం చేశారు. ఆ రోజు ప్రపంచ చరిత్రలోనే అత్యంత కీలకమైన మలుపు కాబోతుందన్నారు. అంతరిక్ష రహస్యాలను ఛేదించడంలో మానవుడు మరింత పురోగతి సాధించాల్సిన అవసరం ఉందన్నారు. అలాగే ఏలియన్స్ గురించిన సత్యం ఇంకెంతో కాలం దాగదని ముగించారు.