విరుష్కలానే ఈ జంటలు దేశం విడిచిపెడతారేమో!
భారతదేశంలో సెలబ్రిటీలకు గోప్యత లేదు. వారి పిల్లలకు అసలే లేదు. అందుకే చాలామంది విదేశాలకు వెళ్లిపోతున్నారు.;
భారతదేశంలో సెలబ్రిటీలకు గోప్యత లేదు. వారి పిల్లలకు అసలే లేదు. అందుకే చాలామంది విదేశాలకు వెళ్లిపోతున్నారు. తమ విరామ సమయాన్ని తెలివిగా లండన్ లాంటి చోట్ల గడపాలని అనుకుంటున్నారు. దీనికి ఉదాహరణ విరుష్క దంపతులు. విరాట్ కోహ్లీ- అనుష్క శర్మ దంపతులు తమ పిల్లలు వామిక, అకాయ్ లను కేవలం లండన్ లో మాత్రమే పెంచాలని అనుకుంటున్నారు. అది కూడా ఒక అందమైన హిందూ సాంప్రదాయంలో ఇస్కాన్ లార్డ్ కృష్ణ సన్నిధానంలో స్వచ్ఛత (ప్యూరిటీ)తో పెంచాలని కోరుకుంటున్నారు.
అయితే ఇలాంటి సౌకర్యం భారతదేశంలో కుదురుతుందా? అని ప్రశ్నిస్తే, ముమ్మాటికి కుదరదు. ఇక్కడ అభిమానులు వెంబడిస్తారు. అనుమతితో పని లేకుండా సెల్ఫీలు దిగుతారు. అలాగే స్టిల్ ఫోటోగ్రాపర్లు అయితే అనుమతి లేకుండా పసికందుల ఫోటోలు, వీడియోల కోసం తహతహలాడుతుంటారు. ఇటీవల దీపిక పదుకొనే- రణ్ వీర్ సింగ్ దంపతుల కుమార్తె దువా సింగ్ వీడియోలను అనుమతి లేకుండా తీసేందుకు ఫోటోగ్రాఫర్లు ఎలా వెంటపడ్డారో చూసాం. దీపిక- రణ్ వీర్ జంట తమ కుమార్తె ముఖాన్ని చాలా కాలంగా మీడియాకు కూడా చూపించకుండా చాలా జాగ్రత్తగా దాచి ఉంచారు. కానీ ఒక అపరిచితుడు పసికందు దువా పదుకొనే సింగ్ వీడియోలను అనుమతి లేకుండా చిత్రీకరించి ఆన్ లైన్ లో రిలీజ్ చేసాడు. ఓవైపు దీపిక వారిస్తున్నా దానిని పట్టించుకోకుండా అతడు అలా చేసాడు. ఒక పసికందు విషయంలో అలా చేయడం సరైనదేనా?
దీపిక అనుమతితో పని లేకుండా, కొందరు మొదటిసారి దువా పదుకొనే సింగ్ ముఖం కనిపించేలా వీడియోను రివీల్ చేసారు. కానీ ఇది నైతికంగా తప్పు అని ఒక నెటిజన్ వ్యాఖ్యానించారు. ఒకరి అనుమతి లేకుండా ఇలా చేయకూడదని విమర్శలు వచ్చాయి. సెలబ్రిటీల గోప్యతను గౌరవించాల్సిన అవసరం అందరికీ ఉంది. అలా కాకుండా మొరటుగా ప్రవర్తించడం సరి కాదనే అభిప్రాయాన్ని నెటిజనులు వ్యక్తం చేస్తున్నారు. ఇటీవల రాహా కపూర్ విషయంలో ఆలియా- రణబీర్ కూడా ఫోటోగ్రాఫర్ల తీరుపై విరుచుకుపడ్డారు.
ఇలాంటి అత్యుత్సాహం, చెడు ప్రవర్తన ఉన్న చోట సెలబ్రిటీల స్వేచ్ఛ, గోప్యతకు భంగం కలుగుతూనే ఉంది. దీనిపై వారంతా తమ అసంతృప్తిని, అసౌకర్యాన్ని ఎప్పటికప్పుడు బయటపెడుతూనే ఉన్నారు. కొన్ని సందర్భాలు వారి పిల్లలను చాలా చికాకు పెడుతున్నాయి. ఇలాంటి వాటికి దూరంగా ఉండాలనే భారతదేశం విడిచిపెట్టి విరుష్క దంపతులు తమ పిల్లలతో లండన్ లో నివాసం ఉంటున్నారు. ఇప్పుడు రణవీర్ - దీపిక జంట, రణబీర్- ఆలియా జంట కూడా తమ పిల్లలను తీసుకుని విదేశాలకు వెళ్లిపోతారనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి. భారతదేశంలో సినీకెరీర్ వెలుగుతున్నంత సేపు వీరంతా ఇక్కడ ఉంటారు. ఆ తర్వాత విదేశీ గమ్య స్థానాలకు చేరుకుంటారని కూడా భావిస్తున్నారు.