2026 లో డబుల్ డోస్ కి రెడీ అయిన స్టార్స్
అంటే 'రాజాసాబ్' రిలీజ్ అనంతరం ఆరు నెలల గ్యాప్ లోనే ప్రభాస్ ప్రేక్షకుల మధ్యలో ఉంటారు.మెగాస్టార్ చిరంజీవి కూడా ఈ సంక్రాంతికి 'మనశంకర వరప్రసాద్ గారు' అంటూ రచ్చ చేయడానికి సిద్దమయ్యారు.;
2025 లో దాదాపు స్టార్ హీరోలంతా స్కిప్ కొట్టేసారు. కొత్త సినిమా షూటింగ్ లతో బిజీగా ఉండటంతో ఎలాంటి చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకురా లేకపోయారు. కానీ ఆ గ్యాప్ ని 2026 లో డబుల్ డోస్ తో పుల్ ఫిల్ చేయబో తున్నారు. స్టార్ హీరోలంతా బ్యాక్ టూ బ్యాక్ రిలీజ్ లతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా నటిస్తోన్న 'ది రాజాసాబ్' సంక్రాంతి కానుకగా జనవరి 9న భారీ అంచనాల మధ్య రిలీజ్ అవుతుంది. రీజనల్ సినిమాగానే మొదలైన ప్రభాస్ పాన్ ఇండియా ఇమేజ్ ను దృష్టిలో పెట్టుకుని ఇండియా అంతటా భారీ ఎత్తున రిలీజ్ చేస్తున్నారు.
ఈ నేపథ్యంలో బాక్సాఫీస్ వద్ద ఎలాంటి ఓపెనింగ్స్ సాధిస్తుంది? లాంగ్ రన్ లో వందల కోట్లు రాబడుతుందా? లేదా? అన్న డిస్కషన్ ఇప్పటికే షురూ అయింది. ఇక ప్రభాస్ హీరోగా హనురాఘవపూడి దర్శకత్వంలో పీరియాడిక్ డ్రామాగా 'పౌజీ' తెరకెక్కుతోన్న సంగతి తెలిసిందే. భారీ వార్ లో అందమైన లవ్ స్టోరీ ని సైతం టచ్ చేసాడు హను. సినిమాపై అంచనాలు భారీగా ఉన్నాయి. టీజర్, ట్రైలర్ రిలీజ్ తర్వాత అవి పీక్స్ కు చేరతాయి. ఈ చిత్రాన్ని స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా ఆగస్టు 15న ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నారు.
అంటే 'రాజాసాబ్' రిలీజ్ అనంతరం ఆరు నెలల గ్యాప్ లోనే ప్రభాస్ ప్రేక్షకుల మధ్యలో ఉంటారు.మెగాస్టార్ చిరంజీవి కూడా ఈ సంక్రాంతికి 'మనశంకర వరప్రసాద్ గారు' అంటూ రచ్చ చేయడానికి సిద్దమయ్యారు.హిలేరియస్ ఎంటర్ టైనర్ గా అనీల్ రావిపూడి మార్క్ చిత్రంగా రిలీజ్ అవుతుంది. ఈసినిమాపై అంచనాలు భారీగానే ఉన్నాయి. ఇది రిలీజ్ అయిన వెంటనే చిరంజీవి నటిస్తోన్న మరో చిత్రం సోషియా ఫాంటసీ థ్రిల్లర్ 'విశ్వంభర' ప్రేక్షకుల ముందుకొస్తుంది. సమ్మర్ కానుకగా రిలీజ్ చేయాలని చూస్తున్నారు.
జనవరి అనంతరం రెండు..మూడు నెలల గ్యాప్ లోనే'విశ్వంభర' రిలీజ్ కు అవకాశం ఉంది. అలాగే నేచురల్ స్టార్ నాని హీరోగా శ్రీకాంత్ ఓదెల దర్శకత్వంలో తెరకెక్కుతోన్న మరో మాస్ ఎంటర్ టైనర్ 'ది ప్యారడైజ్' మార్చిలో రిలీజ్ అవుతుంది. గ్లోబల్ రేంజ్ లో రిలీజ్ ప్లాన్ చేస్తున్నారు. ఈసినిమా అనంతరం సుజిత్ దర్శకత్వంలో 'బ్లడీ రోమియో' మొదలవుతుంది. ఈ చిత్రం ఇదే ఏడాది ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు. అలాగే విక్టరీ వెంకటేష్ కూడా రెండు సినిమాలతో సందడి చేయనున్నారు. ఇప్పటికే 'ఆదర్శ కుటుంబం హౌస్ నెంబర్ 47 'సెట్స్ లో ఉంది.
త్రివిక్రమ్ దర్శకత్వం వహిస్తోన్న ఓ క్లాసిక్ ఎంటర్ టైనర్ ఇది. ఈ సినిమాతో పాటు 'దృశ్యం 3' చిత్రాన్ని కూడా పట్టాలెక్కించడానికి వెంకీ రెడీ అవుతున్నారు. ఈసి నిమా కూడా ఏడాది ముగింపులోనే ప్రేక్షకుల ముందుకు వచ్చే అవకాశం ఉంది. ఇదే ఏడాది మాతృక వెర్షన్ మాలీవుడ్ 'దృశ్యం 3' కూడా రిలీజ్ అవుతోన్న నేపథ్యంలో తెలుగు వెర్షన్ రిలీజ్ డిలే చేయడానికి వీలు లేదు.