లోకేష్ కనగరాజ్‌ ఓడ బండి అయ్యిందా..!

సినిమా ఇండస్ట్రీలో ఎప్పుడు ఎలాంటి పరిస్థితులు ఉంటాయో చెప్పలేని పరిస్థితి. ప్రతి శుక్రవారం బండ్లు ఓడలు, ఓడలు బండ్లు అవ్వడం మనం చూస్తూనే ఉంటాం.;

Update: 2025-09-22 07:30 GMT

సినిమా ఇండస్ట్రీలో ఎప్పుడు ఎలాంటి పరిస్థితులు ఉంటాయో చెప్పలేని పరిస్థితి. ప్రతి శుక్రవారం బండ్లు ఓడలు, ఓడలు బండ్లు అవ్వడం మనం చూస్తూనే ఉంటాం. ఒక్క రోజులో సీన్‌ రివర్స్ కావడం సినిమా ఇండస్ట్రీలోనే జరుగుతుంది. అప్పటి వరకు కనీసం గుర్తింపు లేని నటుడు, దర్శకుడు ఒక్క శుక్రవారం వచ్చిన సినిమాతో ఓవర్‌ నైట్‌ స్టార్‌ కావడం, మరో దర్శకుడు లేదా హీరో ఒక శుక్రవారం వచ్చిన సినిమా ఫ్లాప్‌ కావడంతో కనిపించకుండా పోవడం తరచూ చూస్తూనే ఉన్నాం. ఇండస్ట్రీలో బండ్లు ఓడలు, ఓడలు బండ్లు కావడం అనేది కామన్‌ విషయం. అయితే ఇప్పుడు ఈ నానుడి ప్రముఖ దర్శకుడు లోకేష్ కనగరాజ్‌కి వర్తిస్తుంది అంటూ చాలా మంది విశ్లేషిస్తున్నారు. ఒక్కసారిగా ఉవ్వెత్తున లేచిన దర్శకుడు లోకేష్ కనగరాజ్. ఈయన దర్శకత్వంలో కమల్‌ హీరోగా వచ్చిన విక్రమ్‌ సినిమా మంచి విజయాన్ని సొంతం చేసుకోవడంతో ఈయనతో వర్క్‌ కి అన్ని భాషల సూపర్‌ స్టార్స్ ఆసక్తి చూపించారు.

కమల్‌ హాసన్‌, రజనీకాంత్‌ మల్టీస్టారర్‌...

విక్రమ్‌ తర్వాత ఏకంగా సూపర్‌ స్టార్‌ రజనీకాంత్‌ పిలిచి మరీ ఆఫర్‌ ఇచ్చారు. కూలీ సినిమాతో ఇటీవలే రజనీకాంత్‌తో కలిసి ప్రేక్షకుల ముందుకు వచ్చిన లోకేష్‌ కనగరాజ్‌ మరోసారి నిరాశకి గురి చేశాడు. అంతకు ముందు విజయ్‌తో తీసిన లియో సైతం గొప్పగా ఏమీ లేదు. విక్రమ్‌ తర్వాత మళ్లీ ఆ స్థాయి సినిమా కోసం లోకేష్ కనగరాజ్ నుంచి చాలా ఆశించారు. కానీ లోకేష్ కనగరాజ్‌ మాత్రం ఎప్పటికప్పుడు నిరుత్సాహంకు గురి చేస్తూనే వచ్చాడు. అమీర్‌ ఖాన్‌ తో పాటు ఇంకా పెద్ద పెద్ద ప్రాజెక్ట్‌లను లైన్‌లో పెట్టిన లోకేష్ ఇప్పుడు తదుపరి సినిమా ఏంటి అంటే ఠక్కున చెప్పలేని పరిస్థితి నెలకొంది. ఇప్పటికే అమీర్ ఖాన్‌తో సినిమా క్యాన్సల్‌ అయిందనే వార్తలు వస్తున్నాయి. మరో వైపు కమల్‌ హాసన్‌, రజనీకాంత్‌లతో మల్టీస్టారర్‌ సినిమాను లోకేష్‌ తో కాకుండా మరో పెద్ద దర్శకుడితో చేయాలనే ఆలోచనలో మేకర్స్‌ ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి.

ఖైదీ 2 కి ఏర్పాట్లు చేస్తున్న లోకేష్ కనగరాజ్‌

లోకేష్‌ కనగరాజ్‌ ఒక విభిన్నమైన యూనివర్శ్‌లో సినిమాను తీస్తాడని, ఒక కొత్త ప్రపంచం క్రియేట్‌ చేస్తాడని అంతా నమ్మకం పెట్టుకుని సినిమాలు చూస్తారు. కానీ కూలీ సినిమాలో ఆయన చూపించిన కంటెంట్‌ పూర్తిగా నిరుత్సాహంకు గురి చేసింది. అందుకే ఆయనతో వర్క్ చేయాలి అనుకున్న చాలా మంది స్టార్స్ సైతం ఇప్పుడు వద్దులే అన్నట్లుగా సైలెంట్‌ అయ్యారని తెలుస్తోంది. ఇలాంటి పరిస్థితుల్లో లోకేష్ కనగరాజ్‌ చాలా రోజులుగా వాయిదా వేస్తున్న తన ఖైదీ 2 సినిమాను పట్టాలెక్కించేందుకు రెడీ అవుతున్నాడని తెలుస్తోంది. కార్తీకి ఖైదీ సినిమా మంచి తెచ్చి పెట్టింది. అందుకే ఖైదీ 2 సినిమా కోసం ఆయన చాలా ఆసక్తిగా ఎదురు చూస్తున్నాడు. అయితే కూలీ ఎఫెక్ట్‌తో కార్తీ ఏమైనా ఆలోచనలో పడుతాడా అనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. ఒకవేళ ఆయన ఆలోచనలో పడితే ఖచ్చితంగా లోకేష్ మరింత గడ్డు పరిస్థితులు ఎదుర్కోవాల్సి ఉంటుంది.

టాలీవుడ్‌ స్టార్‌ హీరోలు సైతం సైలెంట్‌

ఖైదీ 2 సినిమాతో తన ప్రతిభను మరోసారి నిరూపించుకోవడం ద్వారా ఖచ్చితంగా స్టార్స్ దృష్టిని ఆకర్షిస్తాడని అంతా భావిస్తున్నారు. కార్తీ తో ఖైదీ 2 సినిమాను చేస్తే తప్ప లోకేష్ కనగరాజ్‌ తన కెరీర్‌లో ముందుకు సాగే పరిస్థితి లేదు అంటూ సినీ విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. టాలీవుడ్‌లో ఇద్దరు పెద్ద స్టార్స్ సైతం ఆ మధ్య లోకేష్ తో సినిమాను చేయాలని ఆశ పడ్డారు. ఇప్పుడు వారు సైతం సైలెంట్‌ అయ్యారు. కనుక లోకేష్ తన బండిని మళ్లీ ఓడగా మార్చుకునే ప్రయత్నం చేయాల్సిన అవసరం ఉంది. ఆ శుక్రవారం కోసం ఆయన సన్నిహితులు అభిమానులు ఎదురు చూస్తున్నారు. తన మార్క్‌ మేకింగ్‌ తో సినిమాలు చేస్తే ఖచ్చితంగా లోకేష్‌ కనగరాజ్‌ ను ఖచ్చితంగా ఫ్యాన్స్ మళ్లీ నెత్తిన పెట్టుకోవడం ఖాయం. స్టార్‌ హీరోలు సైతం మళ్లీ ఈయన దర్శకత్వంలో సినిమాలు చేసేందుకు ముందుకు వస్తారు. ఖైదీ 2 తో లోకేష్ వచ్చే ఏడాదిలో ప్రేక్షకుల ముందుకు వచ్చే అవకాశాలు ఉన్నాయి.

Tags:    

Similar News