ఆయనకు 29 అయితే సంచలనానికి 13 వచిత్రం!
# ఎస్ ఎస్ ఎంబీ 29 అంటూ మహేష్ మూవీ గురించి అంతా గొప్పగా..గర్వంగా చెప్పుకుంటున్నాం. ఈ సినిమాతో మహేష్ గ్లోబల్ స్టార్ వెలిగిపోతాడని టాలీవుడ్ భావిస్తోంది.;
# ఎస్ ఎస్ ఎంబీ 29 అంటూ మహేష్ మూవీ గురించి అంతా గొప్పగా..గర్వంగా చెప్పుకుంటున్నాం. ఈ సినిమాతో మహేష్ గ్లోబల్ స్టార్ వెలిగిపోతాడని టాలీవుడ్ భావిస్తోంది. ఆప్రికన్ అడ్వెంచర్ థ్రిల్లర్ మహేష్ ఎలా కనిపించబోతున్నాడు? అన్న ఆసక్తి సర్వాత్రా వ్యక్తమవుతోంది. ఇలా ఎస్ ఎస్ ఎంబీ 29 విషయంలో ప్రతీది ఓ హైప్ గా మారింది. కానీ ఈ చిత్రం రాజమౌళికి ఎన్నవది? ఆయన నెంబర్ ఎంత? అన్నది మాత్రం ఇంత వరకూ ఎక్కడా రాలేదు.
తాజాగా లెక్కిస్తే దర్శక సంచలనానికిది 13వ చిత్రంగా తేలింది. దర్శకుడిగా ఆయన ప్రస్థానం 2001లో `స్టూడెంట్ నెంబర్ వన్` తో ప్రారంభమైంది. అటుపై అదే ఎన్టీఆర్ తో `సింహాద్రి` తో మరో హిట్ అందు కున్నారు. `సై`, `ఛత్రపతి`, `విక్రమార్కుడు`,` యమదొంగ`, `మగధీర`, `మర్యాద రామన్న`,` ఈగ`, `బాహుబలి`, `బాహుబ లి2`,` ఆర్ ఆర్ ఆర్` ఇలా ప్రతీది సినిమా సంచలనమే. బాక్సాఫీస్ వద్ద కోట్ల వసూళ్లను సాధించినవే.
`బాహుబలి`తో పాన్ ఇండియా మార్కెట్ ను పరిచయం చేసారు. ఇక మహేష్ తో 13వ సినిమా ఏ రేంజ్ లో ప్లాన్ చేసారో తెలిసిందే. ఆయన విజన్ ఊహకే అందడం లేదు. వరల్డ్ లో భారతీయ సినిమా సత్తా చాటే రేంజ్ ప్రణాళికతో ముందుకెళ్తున్నారు. ఈ సినిమా విజయం తర్వాత అంతర్జాతీయంగా రాజమౌళి పేరు మారుమ్రోగిపోవడం ఖాయమనే అంచనాలున్నాయి. 13వ సినిమాతో జక్కన్న రేంజ్ ఆకాశాన్నే తాకుతుం దంటున్నారు.
ఇప్పటికే ఈసినిమా షూటింగ్ రెండు షెడ్యూళ్లను పూర్తి చేసుకున్న సంగతి తెలిసిందే. మూడవ షెడ్యూల్ కు రంగం సిద్దమవుతోంది. హైదరాబాద్ లోనే ఈ షెడ్యూల్ ఉంటుందని సమాచారం. అనంతరం ఫారిన్ లో షూటింగ్ నిర్వహిస్తారు.