సెట్టు.. సెట్టింగ్.. అంతా మహేష్ కోసమే..!
ఐతే ఈమధ్య కాలంలో ఇలా సెట్ వేసి సీజీ చేసిన సీన్స్ తెర మీద తేలిపోతున్నాయని తెలుగు ఆడియన్స్ లబోదిబో అని మొత్తుకుంటున్నారు.;
సూపర్ స్టార్ మహేష్ రాజమౌళి కాంబోలో తెరకెక్కుతున్న సినిమా నెక్స్ట్ ఫారిన్ షెడ్యూల్ అన్నారు కానీ లేటెస్ట్ గా జక్కన్న ప్లాన్ ఛేంజ్ చేసినట్టు తెలుస్తుంది. ఈ సినిమాను నెక్స్ట్ షెడ్యూల్ ఇక్కడే మన రామోజి ఫిల్మ్ సిటీలోనే ప్లాన్ చేస్తున్నారట. సినిమాలో మహేష్ లుక్ అదిరిపోతుందని అంటున్నారు. ఐతే ఆర్.ఎఫ్.సీ లో ఈ సినిమా కోసం భారీ సెట్ ని రెడీ చేస్తున్నారట రాజమౌళి.
రాజమౌళి కాబట్టి అలాంటి డౌట్లు అక్కర్లేదు..
ఐతే ఈమధ్య కాలంలో ఇలా సెట్ వేసి సీజీ చేసిన సీన్స్ తెర మీద తేలిపోతున్నాయని తెలుగు ఆడియన్స్ లబోదిబో అని మొత్తుకుంటున్నారు. కానీ అక్కడ ఉంది రాజమౌళి కాబట్టి అలాంటి డౌట్లు అక్కర్లేదని అనిపిస్తుంది. ఈ సినిమా కోసం రాజమౌళి వేసే సెట్టు.. మహేష్ కోసం చేసే సెట్టింగ్ అంతా కూడా సినిమాను నెక్స్ట్ లెవెల్ కి తీసుకెళ్లడమే అనేలా ఉంటుందట.
జక్కన్న సినిమా అంటే ఆ విషయం అందరికీ తెలుసు. బాహుబలి సినిమా కోసం కూడా భారీ సెట్ లు కట్టించాడు. కథకు తగినట్టుగానే సెట్ ప్రాపర్టీస్ వేస్తుంటాడు. బలమైన కథకు అంతే బలమైన ఎమోషన్ ని క్యారీ చేస్తుంటాడు రాజమౌళి. ఆ సీన్ కి ఈ సెట్స్ మరింత గ్రాండియర్ తెస్తాయి. అందుకే బాహుబలి లాంటి సినిమా రాజమౌళి తీయగలిగాడు. ఆడియన్స్ ని ఎక్కడ ఎమోషనల్ చేయాలి.. ఏ సీన్ కి వాళ్లకి గూస్ బంప్స్ ఇవ్వాలన్నది స్పెషల్ గా రాసుకుంటాడు.
మహేష్ లాంటి స్టార్ తో రాజమౌళి..
అందుకే ఆయన్ను మాస్టర్ క్లాస్ డైరెక్టర్ గా చెబుతుంటారు. SSMB29 కాంబో చాలా క్రేజీ అనిపిస్తుంది. మహేష్ లాంటి స్టార్ తో రాజమౌళి మొదటిసారి చేస్తున్నాడు. ఈ కాంబో సినిమా అంటేనే సినీ జనాలకు మైండ్ బ్లాక్ అయ్యేలా చేస్తుంది. ఇక ఈ సినిమాలో ప్రియాంక చోప్రా, పృధ్విరాజ్ సుకుమారన్ భాగం అవుతున్నారు. తప్పకుండా ఈ మూవీతో రాజమౌళి ఇంటర్నేషనల్ లెవెల్ లో సంచలనాలు సృష్టించే స్కోప్ ఉందనిపిస్తుంది.
ఎస్.ఎస్.ఎం.బి 29 సినిమా రెండు భాగాలుగా వస్తుందని తెలుస్తుంది. గ్లోబల్ త్రొట్టెన్ కాన్సెప్ట్ తో మహేష్ ని యూనివర్సల్ స్టార్ గా రాజమౌళి చూపించబోతున్నాడు. సినిమా అనుకున్నటుగా షూటింగ్ జరిగితే 2027 లో ఒక పార్ట్ రిలీజ్ అవుతుందని టాక్. ఆగష్టు 9 సూపర్ స్టార్ మహేష్ బర్త్ డే రోజు కూడా రాజమౌళి ఎలాంటి అప్డేట్ ఇవ్వలేదు. నవంబర్ లో ఈ సినిమా ప్రమోషన్స్ మొదలు పెడతామని రాజమౌళి స్వయంగా చెప్పాడు. అందుకే సూపర్ స్టార్ ఫ్యాన్స్ అంతా కూడా నవంబర్ కోసం ఎదురుచూస్తున్నారు.