బాక్స్ ఆఫీస్ గోల్డెన్ లెగ్.. రాజమౌళి చిత్రాలు సాధించిన కలెక్షన్స్!

ఇకపోతే ఓటమెరుగని దర్శకుడిగా అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు తెచ్చుకున్న రాజమౌళి ఇప్పుడు బాక్స్ ఆఫీస్ వద్ద గోల్డెన్ లెగ్ గా మారిపోయారు.;

Update: 2025-11-04 07:56 GMT

రాజమౌళి.. ఈ పేరు గురించి ఎంత చెప్పినా తక్కువే.. తెలుగు సినిమా పరిశ్రమ ఖ్యాతిని ఎల్లలు దాటించడమే కాకుండా బాలీవుడ్ మాత్రమే కాదు హాలీవుడ్ నటీనటులకు కూడా తెలుగు సినిమాలలో నటించడానికి ఆసక్తి కలిగించిన ఏకైక దర్శకుడు.. దిగ్గజ దర్శక ధీరుడిగా పేరు సొంతం చేసుకున్న రాజమౌళి ఒక సినిమాను రిలీజ్ చేయడానికి మినిమం రెండు సంవత్సరాల టైమ్ తీసుకుంటారనే వార్తలు వినిపిస్తున్నప్పటికీ.. ఆ చిత్రాలతో బ్లాక్ బస్టర్ విజయాలను అందుకుంటారనే నమ్మకం కూడా అందరిలో కలిగింది. ఇకపోతే ఓటమెరుగని దర్శకుడిగా అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు తెచ్చుకున్న రాజమౌళి ఇప్పుడు బాక్స్ ఆఫీస్ వద్ద గోల్డెన్ లెగ్ గా మారిపోయారు.

శాంతి నివాసం సీరియల్ తో ఎపిసోడ్ డైరెక్టర్గా కెరియర్ ఆరంభించిన ఈయన.. ఇప్పటివరకు పలు చిత్రాలు చేసి అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు తెచ్చుకున్నారు. అయితే ఈ చిత్రాల ద్వారా ఏ రేంజ్ లో కలెక్షన్స్ రాబట్టారు అనే విషయం ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారుతోంది. మరి రాజమౌళి చిత్రాలు సాధించిన కలెక్షన్స్ ఏంటో ఇప్పుడు చూద్దాం..

స్టూడెంట్ నెంబర్ వన్ - రూ.18 కోట్లు

సింహాద్రి - రూ.40 కోట్లు

సై - రూ.23 కోట్లు

ఛత్రపతి - రూ.27 కోట్లు

విక్రమార్కుడు - రూ.38 కోట్లు

యమదొంగ - రూ.47 కోట్లు

మగధీర - రూ.134 కోట్లు ( రాజమౌళి సినీ కెరియర్ లో మొదటిసారి 100 కోట్ల క్లబ్లో చేరిన చిత్రం)

మర్యాద రామన్న - రూ.30 కోట్లు

ఈగ - రూ.101 కోట్లు (100 కోట్ల క్లబ్లో చేరిన రెండవ చిత్రం)

బాహుబలి ది బిగినింగ్ - రూ.650 కోట్లు (500 కోట్ల క్లబ్లో చేరిన మొదటి చిత్రం)

బాహుబలి 2 ది కంక్లూజన్ - రూ.1810 కోట్లు (మొదటిసారి 1000 కోట్లు 1500 కోట్ల క్లబ్లో చేరిన చిత్రం)

ఆర్ ఆర్ ఆర్ - రూ.1280 కోట్లు (1000 కోట్ల క్లబ్లో చేరిన రెండో చిత్రం)

ప్రస్తుతం ఎస్ఎస్ఎంబీ 29 అనే వర్కింగ్ టైటిల్ తో రాజమౌళి, మహేష్ బాబు తో పాన్ వరల్డ్ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. ఈ సినిమాతో రూ.2000 కోట్ల క్లబ్లో చేరిపోవాలని టార్గెట్ పెట్టుకున్నట్లు సమాచారం. ఏది ఏమైనా రాజమౌళి వరుస చిత్రాలతో భారీ బ్లాక్ బాస్టర్ విజయాలను అందుకోవడమే కాకుండా అంతకుమించి కలెక్షన్లు రాబట్టి సరికొత్త సంచలనం క్రియేట్ చేశారు.

రాజమౌళి ప్రస్తుతం మహేష్ బాబుతో యాక్షన్ అడ్వెంచర్ మూవీ చేస్తున్నారు. ఇందులో మహేష్ బాబు సరసన గ్లోబల్ స్టార్ బ్యూటీ ప్రియాంక చోప్రా హీరోయిన్గా నటిస్తోంది. అలాగే బాలీవుడ్ నటుడు పృథ్వీరాజ్ సుకుమారన్ విలన్ పాత్ర పోషిస్తున్నారు. త్వరలో రామోజీ ఫిలిం సిటీ వేదికగా లక్షమంది అభిమానుల మధ్య గ్రాండ్ ఈవెంట్ నిర్వహించనున్నారు.. అలాగే నవంబర్ 15న అప్డేట్ ఇస్తానని చెప్పిన రాజమౌళి ఆరోజు టైటిల్ రివీల్ చేయనున్నట్లు సమాచారం.

Tags:    

Similar News