రాజమౌళి 'వారణాసి'.. మరి ఆ 'వారణాసి' సంగతేంటి?

దర్శకధీరుడు రాజమౌళి, సూపర్ స్టార్ మహేష్ బాబు కాంబినేషన్ లో రూపొందుతున్న భారీ బడ్జెట్ మూవీకి వారణాసి టైటిల్ ను ఖరారు చేస్తున్నట్లు మేకర్స్ కొన్ని గంటల క్రితం ప్రకటించిన విషయం తెలిసిందే.;

Update: 2025-11-16 08:41 GMT

దర్శకధీరుడు రాజమౌళి, సూపర్ స్టార్ మహేష్ బాబు కాంబినేషన్ లో రూపొందుతున్న భారీ బడ్జెట్ మూవీకి వారణాసి టైటిల్ ను ఖరారు చేస్తున్నట్లు మేకర్స్ కొన్ని గంటల క్రితం ప్రకటించిన విషయం తెలిసిందే. హైదరాబాద్ లోని రామోజీ ఫిల్మ్ సిటీలో గ్రాండ్ గా జరిగిన ఈవెంట్ లో టైటిల్ ను గ్లింప్స్ రూపంలో రివీల్ చేశారు.

నిజానికి షూటింగ్ స్టార్ట్ అయినప్పటి నుంచి కూడా మహేష్, రాజమౌళి మూవీకి ఆ పేరునే ఫిక్స్ చేస్తారని వార్తలు వచ్చాయి. అవే ఇప్పుడు నిజమయ్యాయి. అది ఓకే అయినా.. సాధారణంగా ఒకే టైటిల్ తో రెండు సినిమాలు ఎప్పుడూ రూపొందవు. అప్పుడెప్పుడో రిలీజ్ చేసిన సినిమాల టైటిల్స్ ను కొందరు మేకర్స్ యూజ్ చేస్తారు.

అందుకు గాను ఫార్మాలిటీస్ ను పూర్తి చేసుకుని తెరకెక్కిస్తారు. కానీ ఒకే టైమ్ లో.. ఒకే టైటిల్ తో సినిమాలు రూపొందడం జరగని పని. అయితే ఇప్పుడు మహేష్ బాబు, రాజమౌళి కాంబోలో వస్తున్న మూవీకి వారణాసి టైటిల్ ఫిక్స్ అవ్వగా.. కొన్ని రోజుల క్రితం అదే టైటిల్ తో మరో సినిమా అనౌన్స్మెంట్ వచ్చిన విషయం తెలిసిందే.

యంగ్ హీరో ఆది సాయి కుమార్ తో రఫ్ మూవీని తెరకెక్కించిన డైరెక్టర్ సీ. హెచ్ సుబ్బారెడ్డి.. ఆ సినిమాను తీస్తున్నారు. రామ‌భ‌క్త హ‌నుమ క్రియేష‌న్స్ బ్యాన‌ర్‌ పై నిర్మిస్తున్న ప్రొడ్యూసర్ విజయ్.కే టైటిల్ పోస్టర్ తో ఇటీవల ఆ మూవీని ప్రకటించారు. దీంతో అంతా అప్పుడు రాజమౌళికి ఒక ఝలక్ అని అనుకున్న మాట నిజమే.

మహేష్ తో చేస్తున్న మూవీకి జక్కన్న.. వారణాసి అనే టైటిల్ ను ఇకపై పెట్టరని వేరేది చూసుకుంటారని టాక్ వచ్చింది. కానీ ఇప్పుడు రాజమౌళి కూడా అదే పేరును అనౌన్స్ చేశారు. దీంతో అదెలా సాధ్యమని ఇప్పుడు అంతా డిస్కస్ చేసుకుంటున్నారు. ఒకే టైటిల్ తో రెండు సినిమాలు రావడం కుదరదు కదా అని మాట్లాడుకుంటున్నారు.

అయితే ఇక్కడ చిన్న విషయమేమిటంటే.. సుబ్బారెడ్డి తీస్తున్న మూవీ టైటిల్ పోస్టర్ లో కేవలం వారణాసి అని మాత్రమే ఉంది. కానీ మహేష్ మూవీ పోస్టర్ లో ఎస్ ఎస్ రాజమౌళి'స్ వారణాసి అని ఉంది. దీంతో చిన్న తేడాతో జక్కన్న ఎలాంటి ఇష్యూ లేకుండా టైటిల్ ను ఫిక్స్ చేసినట్లు కనిపిస్తోంది. నచ్చిన టైటిల్ కోసం రాజమౌళి అలా చేసినట్లు అర్థమవుతోంది. టైటిల్ లో చిన్న తేడా ఉంటే ఇబ్బంది ఉండే అవకాశం లేకపోవడంతో అలా చేశారేమో మరి.

Tags:    

Similar News