ఖాళీ జేబులతో దర్శకధీరుడు.. చెక్ అధారిటీ కూడా లేదా..?
తెలుగు సినిమాను ప్రపంచ స్థాయి గుర్తింపు తెచ్చిన వ్యక్తి రాజమౌళి. ఆయన మొదటి సినిమా స్టూడెంట్ నెంబర్ 1 నుంచి RRR వరకు గ్రాఫ్ చూస్తేనే ఆయన రేంజ్ ఏంటన్నది అర్థమవుతుంది.;
తెలుగు సినిమాను ప్రపంచ స్థాయి గుర్తింపు తెచ్చిన వ్యక్తి రాజమౌళి. ఆయన మొదటి సినిమా స్టూడెంట్ నెంబర్ 1 నుంచి RRR వరకు గ్రాఫ్ చూస్తేనే ఆయన రేంజ్ ఏంటన్నది అర్థమవుతుంది. ఇక బాహుబలితో పాన్ ఇండియా సెన్సేషన్ గా మారి.. RRR తో ఇంటర్నేషనల్ ఆడియన్స్ ని సర్ ప్రైజ్ చేశాడు రాజమౌళి. ప్రస్తుతం మహేష్ బాబుతో వారణాసి సినిమా చేస్తున్నార్డు జక్కన్న. రాజమౌళి సినిమా అనే ముద్ర చాలు వందల కోట్ల బడ్జెట్.. స్టార్ హీరోల ఏళ్లకు ఏళ్లు డేట్స్.. టెక్నీషియన్స్.. వాట్ నాట్ ఏవైనా సరే ఇలా సెట్ అవుతాయి.
నేషనల్ వైడ్ గా టాప్ డైరెక్టర్స్ లిస్ట్ లో రాజమౌళి..
ఇక సినిమా సినిమాకు ఆయన తీసుకొనే రెమ్యునరేషన్ కూడా నెక్స్ట్ లెవెల్ లో ఉంటుంది. నేషనల్ వైడ్ గా డైరెక్టర్స్ లిస్ట్ లో టాప్ రెమ్యునరేషన్ అందుకునే వ్యక్తిగా రాజమౌళిని చెబుతుంటారు. తను సినిమా కోసం పడే కష్టానికి.. ఆయన ఇచ్చే సినిమా ఫలితానికి ఆయన ఎంత రెమ్యునరేషన్ తీసుకున్నా ఓకే అనేలా నిర్మాతలు ఉంటారు. ఐతే అలాంటి కోట్లు రెమ్యునరేషన్ తీసుకునే రాజమౌళి ఖాళీ జేబులతో తిరుగుతారని ఎవరైనా ఊహిస్తారా.
అవును ఇది నిజం.. రాజమౌళి సడెన్ గా బయటకు వెళ్తే ఖాళీ జేబులతోనే వెళ్తారట. అంతేకాదు ఆయన ఎటు వెళ్లినా ఆయన సతీమణి రమా డ్రైవర్ కి కొంత డబ్బు ఒక కార్డ్ ఇస్తుందట. అంతేకాదు చెక్ మీద సైన్ సరిగా పెట్టలేదని ఆ అధారిటీ కూడా ఆయన దగ్గర లేకుండా చేశామని రమా రాజమౌళి ఒక ఇంటర్వ్యూలో చెప్పారు. రాజమౌళికి డబ్బు మీద అంత వ్యామోహం లేదని ఆమె చెప్పారు.
చేతిలో డబ్బులు ఉండవు.. చెక్ అధారిటీ కూడా ఆయనకు లేదంటే..
అంతేకాదు లైఫ్ లో చాలా కష్టాలు పడ్డాం.. రెండు సార్లు కిందకి వెళ్లాం మళ్లీ అలా వెళ్లకుండా బ్రతికినన్నాళ్లు సంతోషంగా ఉంటే చాలని రమా రాజమౌళి ఒక ఇంటర్వ్యూలో చెప్పారు. ఐతే ఇన్ని విషయాల్లో రాజమౌళి ఖాళీ జేబులతో తిరుగుతారు అన్నది మాత్రం ఆడియన్స్ కి షాకింగ్ గా అనిపించింది. అంత గొప్ప దర్శకుడు తనకు వచ్చే రెమ్యునరేషన్ తో కాస్ట్ లీ మెయిటెనన్స్ చేయాలని అనుకుంటాడు కానీ రాజమౌళి అలాంటి వాటికి దూరమని తెలుస్తుంది. ముఖ్యంగా చేతిలో డబ్బులు ఉండవు.. చెక్ అధారిటీ కూడా ఆయనకు లేదంటే ఆయన ఎంత సింప్లిసిటీగా ఉంటున్నారు అన్నది అర్థమవుతుంది.
మొదలు పెట్టిన సినిమా పూర్తి చేసి రిలీజ్ చేసే వరకు ప్రతి ఫ్రేమ్ ఇది రాజమౌళి సినిమా అనిపించేలా చేయాలని ప్రతి క్షణం ఆరాటపడుతుంటాడు జక్కన్న. అందుకే మిగతా విషయాల మీద ఆయనకు అంత ఇష్టం ఉండదు. కేవలం ఇంకా మరిన్ని అద్భుతమైన సినిమాలు చేయాలి.. ఇంటర్నేషనల్ లెవెల్ లో తెలుగు సినిమాలు ఆడాలన్న రేంజ్ లో ఆయన ఆలోచనలు ఉన్నాయి. అందుకే ఆయన అంత గొప్ప దర్శకుడు అయ్యాడని చెప్పుకోవచ్చు.