బాలీవుడ్ సీక్వెల్ సినిమాకు తెలుగోడు

ప్రస్తుతం గోపి, నందమూరి బాలకృష్ణతో ఓ సినిమా చేయాలని డిసైడ్ అయ్యారు. ఈ ప్రాజెక్ట్ మొన్న దసరా పండగకే అధికారికంగా ప్రారంభం కావాల్సి ఉంది.;

Update: 2025-10-17 20:30 GMT

తెలుగు దర్శకుడు శ్రీరామ్ ఆదిత్య వైవిధ్యభరిత కథలతో టాలీవుడ్ లో పలు సినిమాలు తెరకెక్కించారు. వాటి ఫలితం అటుంచితే ఒక్కో సినిమాలో ఒక్కో వేరియషన్ చూపించారు శ్రీరామ్ ఆదిత్య. అలాంటి డైరెక్టర్ పేరు ఇప్పుడు ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా నిలిచింది. ఇందుకు కారణం ఆయన బాలీవుడ్ హీరోతో సినిమా చేస్తున్నారనే ప్రచారం జోరందుకోవడమే! ఇంతకీ ఆ హీరో ఎవరు? అది ఏ సినిమా అంటే?

బాలీవుడ్ స్టార్ నటుడు సన్నీ డియోల్‌ ఈ ఏడాది జాట్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చారు. ఈ సినిమాను తెలుగు స్టార్ డైరెక్టర్ గోపిచంద్ మలినేని తెరకెక్కించారు. ఇందులో మాస్ మసాలా, యాక్షన్‌ డ్రామా, లార్జర్‌ దెన్‌ లైఫ్‌ ఎనర్జీతో సన్నీ అభిమానులకు కన్నుల పండువగా నిలిచింది. హిందీలోనే కాకుండా తెలుగులోనూ మంచి రెస్పాన్స్ అందుకుంది. అయితే ఈ సినిమాకు సీక్వెల్ రానుందని తెలుస్తోంది. అయితే ఈ సీక్వెల్ ను తొలి పార్ట్ తెరకెక్కించిన గోపి కాకుండా దర్శకుడు శ్రీరామ్ ఆదిత్య టేకాఫ్ చేసుకున్నారని ప్రచారం సాగుతోంది.

ప్రస్తుతం గోపి, నందమూరి బాలకృష్ణతో ఓ సినిమా చేయాలని డిసైడ్ అయ్యారు. ఈ ప్రాజెక్ట్ మొన్న దసరా పండగకే అధికారికంగా ప్రారంభం కావాల్సి ఉంది. కానీ ఎందుకో డిలే అయ్యింది. త్వరలోనే ఇది పట్టాలెక్కనున్నట్లు సమాచారం. అందుకే గోపి జాట్ సీక్వెల్ నుంచి తప్పుకున్నట్లు తెలుస్తోంది. ఈ క్రమంలోనే ఈ ప్రాజెక్ట్ ను ఆదిత్య అందుకున్నారని తెలిసింది.

భలే మంచి రోజు, శమంతకమణి, దేవదాస్, మనమే వంటి చిత్రాలతో టాలీవుడ్ లో తనదైన ముద్ర వేశారు శ్రీరామ్ ఆదిత్య. కానీ ఇవన్నీ ఫ్యామిలీ ఎంటర్టైనర్లే. పెద్దగా యాక్షన్ తో సంబంధం లేనివే. ఆయన ఇంతకముందు ఇలాంటి మాస్ ఎలిమెంట్స్, యాక్షన్‌ చిత్రాలను తెరకెక్కించలేదు. ఇదే ఈ సీక్వెల్‌లో ఆసక్తికరమైన అంశంగా మారింది. ఆదిత్య ఈ సీక్వెల్ ను మాస్‌ యాక్షన్‌ ఫార్ములాకే కట్టుబడి తనకు అలవాటు లేని జానర్ లో కొత్తగా ట్రై చేస్తారా? లేదా పాత ఫార్ములాతో కంటిన్యూ చేస్తారా అనేది ఆసక్తిగా మారింది.

సన్నీ డియోల్‌ ట్రేడ్‌ మార్క్‌ పంచ్‌ లతో కూడిన ఈ సినిమా ఎలా ఉంటుందనే ఉత్కంఠ అభిమానుల్లో నెలకొంది. ఈ జాట్ 2 గురించి సోషల్‌ మీడియాలో మీమ్స్ ఇప్పుడే ప్రారంభం అయ్యాయి. ఆదిత్య ఈ యాక్షన్‌ సినిమాను మరింత ఇంపాక్ట్ గా చూపిస్తారా? లేగా తనకు అలవాటైన ఎమోషనల్‌ సన్నివేశాలతో ప్రేక్షకులను భావోద్వేగానికి గురి చేస్తారా? అనేది చూడాలి. అయితే దీనిపై ఇప్పటికైతే ఎలాంటి అధికారిక సమాచారం లేదు. త్వరలోనే దీనిపై మేకర్స్ ఓ క్లారిటీ ఇచ్చే ఛాన్స్ ఉంది.

Tags:    

Similar News