• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  పద్దతిగా చెప్పా.....

పద్దతిగా చెప్పా.. వినకపోతే కోర్టుకే: శ్రీకాంత్

| బెంగళూరు రేవ్ పార్టీకి సంబంధించిన అనేక రకాల విషయాలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్న విషయం తెలిసిందే

By - Tupaki Desk
Update: 2024-05-24 07:50 GMT

బెంగళూరు రేవ్ పార్టీకి సంబంధించిన అనేక రకాల విషయాలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్న విషయం తెలిసిందే. సినిమా ఇండస్ట్రీకి చెందిన కొంత మంది ప్రముఖులు కూడా ఈ వ్యవహారంలో ఉన్నారు అంటూ ఇప్పటికే పోలీసులు తెలియజేశారు. ఈ క్రమంలో సోషల్ మీడియాలో కూడా తెలుగు ఇండస్ట్రీకి సంబంధించిన సీనియర్ హీరోతో పాటు ఒక సీనియర్ నటి కూడా ఉంది అన్నట్లుగా కూడా కథనాలు వచ్చాయి.

అయితే ఈ విషయంపై ఎప్పటికప్పుడు సినీ నటులు క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేస్తున్నారు. ఇక సీనియర్ హీరో శ్రీకాంత్ కూడా తప్పుడు వార్తలపై క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేశారు. మొదట శ్రీకాంత్ తప్పుడు వార్తలపై చాలా మర్యాదగా సున్నితంగానే స్పందించారు. రేవ్ పార్టీకి సంబంధించిన న్యూస్ బయటకు రాగానే ఎవరో శ్రీకాంత్ తరహాలో ఉండడంతో అందరూ కూడా నేను అని పొరపాటు పడ్డారని అన్నారు.

ప్రత్యేకంగా ఒక వీడియో కూడా విడుదల చేసిన శ్రీకాంత్ అందులో తనపై తప్పుడు వార్తలు వస్తున్నాయి అని అసలు పార్టీలకి వెళ్లే మనిషిని తాను కాదు అని ఎవరో తనలా ఉంటే పొరపాటు పడ్డారని, అయితే అతను నేను కాదు అంటూ శ్రీకాంత్ ఎంతో పద్ధతిగా తెలియజేశారు. అంతకు ముందు కొంతమంది మీడియా మిత్రులు కూడా తనకు ఫోన్ చేసి ఈ విషయం గురించి అడిగారు అని అలా ముందుగా వెరిఫై చేసుకోవడం చాలా మంచిది అంటూ తనకు కాంటాక్ట్ చేసిన ప్రతి మీడియా సభ్యుడికి కూడా తాను వివరణ ఇచ్చినట్లుగా శ్రీకాంత్ తెలియజేశారు.

ఇక రీసెంట్ గా మరోసారి శ్రీకాంత్ పేరు మళ్లీ వైరల్ గా మారడంతో ఆయన చాలా సీరియస్ గా రియాక్ట్ అయ్యారు. నిజమైతే ఉన్నది ఉన్నట్లు వార్తలు రాయండి, లేదంటే వదిలేయండి. అంతే కాని అనవసరంగా తప్పుడు వార్తలు వస్తే ఏ మాత్రం సహించేది లేదు అని, నేను లేకపోయినా కూడా, ఉన్నాను అంటూ వార్తలు రాయడం ఏమాత్రం కరెక్ట్ కాదని అన్నారు.

ఇదే తరహాలో రిపీట్ అయితే నేను చట్టపరంగా చర్యలు తీసుకోవాల్సి ఉంటుంది అని కోర్టులో కూడా తేల్చుకుంటాను అని శ్రీకాంత్ చాలా సీరియస్ గా తెలియజేశారు. అసలు రేవ్ పార్టీలకు తనకు ఎలాంటి సంబంధం లేదు అని శ్రీకాంత్ మీడియాకు తెలియజేయడంతో ప్రస్తుతం ఈ విషయం మరింత హాట్ టాపిక్ గా మారిపోయింది.

మరోవైపు సినీనటి హేమ గురించి కూడా అనేక రకాల వార్తలు వస్తున్న విషయం తెలిసిందే. ఆమె మరో పేరుతో రేవ్ పార్టీలో పాల్గొంది అన్నట్లుగా కూడా కథనాలు వచ్చాయి. అయితే అందులో కూడా ఏ మాత్రం నిజం లేదు అని ఆమె వివరణ ఇచ్చే ప్రయత్నం చేశారు. మరి ఈ విషయంలో పోలీసులు తదుపరి విచారణలో ఏం తెలుస్తారో చూడాలి.

Tags:    
  • Srikanth 
  • Legalaction 
  • Bangloreraveparty 
  • Raveparty 
  • Srikanthraveparty 
  • Actresshema 
  • Filmindustry 

Similar News

పవన్ కళ్యాణ్ గురించి కీలక అప్‌డేట్ ఇచ్చిన జనసేన!

2026-11-10 09:55 GMT

బిజినెస్ ఉమెన్ గా తొలి దీపావళి.. తమన్నా అవుట్ ఫిట్ ఖరీదు ఎంత అంటే

2026-11-10 09:39 GMT

ఆ విషయంలో యష్ జాగ్రత్త పడాల్సిందే..!

2026-11-10 09:38 GMT

టాలీవుడ్ పై కన్నేసిన మలయాళ బ్యూటీ!

2026-11-10 08:30 GMT

Tupaki Exclusive: సుశాంత్ హ్యాండ్ ఇచ్చినప్పుడు అంతా బ్లాంక్ అయిపోయింది

2026-11-10 08:03 GMT

RC17 : అప్పుడు ఆది, ఫాహద్‌ ఇప్పుడు రిషికాంత్‌..!

2026-11-10 07:52 GMT

స్పెషల్ విఐపి లతో శ్రీ లీల దీపావళి వేడుకలు.. ఫొటోస్ వైరల్!

2026-11-10 07:49 GMT

పవన్ కళ్యాణ్ – అన్నా కొణిదెల మధ్య రెండు నెలల్లోనే ఏమైపోయింది?

2026-11-10 07:49 GMT

నా నోటి తిట్లు తింటే కెరీర్ సెట్ అయినట్లే!

2026-11-10 07:00 GMT

లంకేశ్వరుడి గెటప్ కోసం యష్ పడిన కష్టం ఇదే!

2026-11-10 06:56 GMT

కథల సెలక్షన్.. గేర్ మారుస్తున్న చిరు

2026-11-10 06:56 GMT

అల్లుడిని చూసి మామ గ‌ర్వంగా!

2026-11-10 06:56 GMT

Copyright @2026

Powered by Blink CMS