కోర్ట్ బ్యూటీ.. టాప్ గేర్ వేసేలా..!
సోషల్ మీడియాలో తన యాక్టింగ్ టాలెంట్ చూపిస్తూ వస్తున్న ఆమె కోర్ట్ సినిమాలో ఛాన్స్ అందుకుంది. ఆ సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ కొట్టడంతో శ్రీదేవి రేంజ్ మారిపోయింది.;
ఒక్క సినిమా ఫేట్ మార్చేస్తుంది అంటే ఏమో అనుకుంటాం. కానీ సినీ పరిశ్రమలో అదే జరుగుతుంది. అప్పటి దాకా ఎవరో తెలియని వాళ్లకి కూడా సూపర్ క్రేజ్ ఏర్పడేలా చేస్తుంది. అంతకుముందు చాలాసార్లు సోషల్ మీడియాలో వాళ్లని చూసినా సరే ఒక సినిమా హిట్టై.. అందులో ఏదైనా క్యారెక్టర్ తో రిజిస్టర్ అయితే ఆ తర్వాత వాళ్లను చూసే థింకింగ్ మారిపోతుంది. అలాంటి క్రేజ్ నే సంపాదించింది కోర్ట్ బ్యూటీ శ్రీదేవి.
సోషల్ మీడియా To సినిమా..
సోషల్ మీడియాలో తన యాక్టింగ్ టాలెంట్ చూపిస్తూ వస్తున్న ఆమె కోర్ట్ సినిమాలో ఛాన్స్ అందుకుంది. ఆ సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ కొట్టడంతో శ్రీదేవి రేంజ్ మారిపోయింది. కోర్ట్ సక్సెస్ తో తెలుగులోనే శ్రీదేవికి చాలా ఆఫర్లు వస్తున్నాయి. ఐతే ఇది చాలదు అన్నట్టుగా తమిళ్ లో కూడా అమ్మడికి అవకాశాలు వస్తున్నాయి. కోర్ట్ ఇచ్చిన జోష్ తో శ్రీదేవి ఫేట్ మారిపోయింది.
కోలీవుడ్ లో రాజేష్ హీరోగా చేస్తున్న సినిమాలో శ్రీదేవి నటిస్తుంది. సినిమాలో నటించేందుకు గాను ఆమె మంచి రెమ్యునరేషన్ తీసుకుంటున్నట్టు తెలుస్తుంది. లేటెస్ట్ గా శ్రీదేవి ఒక కొత్త కారు కొనుక్కుంది. ఎం.జి హెక్టార్ కారుకి పూజ చేస్తూ కనిపించింది శ్రీదేవి. తల్లిదండ్రులతో పాటు ఆ కారుకి పూజ చేస్తూ శ్రీదేవి ఒక వీడియోని సోషల్ మీడియాలో షేర్ చేసింది.
తొలి ఆఫర్ తో క్రేజ్..
కోర్ట్ సినిమాలో ఆమె న్యాచురల్ యాక్టింగ్ కి మంచి మారులు కొట్టేసింది శ్రీదేవి. మొదటి సినిమాతోనే క్రేజ్ తెచ్చుకున్న శ్రీదేవి ఇదే ఫాం కొనసాగిస్తే మాత్రం నెక్స్ట్ లెవెల్ క్రేజ్ తెచ్చుకునే అవకాశం ఉంటుంది. ఐతే యువ హీరోలతోనే కాదు శ్రీదేవి స్టార్ ఛాన్స్ లు అందుకుంటే కెరీర్ కి మరింత బూస్టింగ్ వస్తుంది.
కోర్ట్ తర్వాత ఒక తమిళ్ సినిమా చేస్తున్న శ్రీదేవి నెక్స్ట్ తెలుగు ఛాన్స్ కూడా అందుకుంటుంది. కోర్ట్ చూసినప్పుడు అందరు కూడా ఈ హీరోయిన్ ని జూనియర్ లావణ్య త్రిపాఠి అన్నారు. ఆమెలానే సహజ నటనతో ఆకట్టుకునేలా ఉంది. ఒక ఐడెంటిటీ వచ్చాక చేసే సినిమాలను బట్టే కెరీర్ నిర్ణయించబడుతుంది. కోర్ట్ తర్వాత శ్రీదేవి ఎలాంటి సినిమాలు చేస్తుంది అన్నది చూడాలి.కాస్త క్లవర్ గా ఉంటే కచ్చితంగా శ్రీదేవి తెలుగులో టాప్ రేంజ్ కి వెళ్లినా ఆశ్చర్యపోవాల్సిన పనిలేదు.