• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  రష్మిక బాటలో శ్రీలీల.....

రష్మిక బాటలో శ్రీలీల.. వర్కౌట్ అవుతుందా?

| పేరుకే కన్నడ బ్యూటీ అయిన నేడు పాన్ ఇండియా స్థాయిలో గుర్తింపును సొంతం చేసుకుంటూ స్టార్ హీరోల రికార్డులను సైతం చెరిపి వేస్తూ అందరిని ఆశ్చర్యపరిచింది ఈ ముద్దుగుమ్మ.

By - Madhu Reddy
Update: 2026-05-03 09:30 GMT

ఒకప్పుడు హీరోయిన్స్ అంటే కేవలం గ్లామర్ పాత్రలకు లేదా హీరోని కాపాడడం, హీరోని ప్రేమించడం, హీరో కోసం త్యాగం చేయడం ఇలాంటి పాత్రలలోనే ఎక్కువగా నటించేవారు. కానీ కాలం మారుతోంది. ప్రేక్షకుడిలో అభిరుచులు మారుతున్నాయి. అందుకే హీరోయిన్స్ కూడా హీరోలకు తగ్గట్టుగా లేదా వారికి ధీటుగా వైవిద్య భరితమైన కథలను ఎంచుకుంటూ అందరినీ ఆశ్చర్యపరుస్తున్నారు. ఇక అలాంటి వారిలో ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన పేరు రష్మిక. ఒకప్పుడు కేవలం హీరోయిన్ గా ప్రేక్షకులను అలరించిన ఈమె.. ఆ తర్వాత కాలంలో విభిన్నమైన పాత్రలను ఎంచుకుంటూ తనలోని నటన విశ్వరూపాన్ని చూపించి అందరిని ఆశ్చర్యపరిచింది.

పేరుకే కన్నడ బ్యూటీ అయిన నేడు పాన్ ఇండియా స్థాయిలో గుర్తింపును సొంతం చేసుకుంటూ స్టార్ హీరోల రికార్డులను సైతం చెరిపి వేస్తూ అందరిని ఆశ్చర్యపరిచింది ఈ ముద్దుగుమ్మ. ఇప్పుడు ఈమె బాటలోనే మరో యంగ్ కన్నడ బ్యూటీ కూడా నడవాలని ఆశ పడుతోంది. సరైన ఛాన్స్ వస్తే తనను తాను నిరూపించుకుంటానని చెబుతోంది. ఆమె ఎవరో కాదు యంగ్ బ్యూటీ శ్రీ లీల.. పెళ్లి సందD సినిమా ద్వారా వెండితెరకు పరిచయమైన ఈమె.. ఆ తర్వాత ధమాకా సినిమాతో ఓవర్ నైట్ లోనే స్టార్ హీరోయిన్గా పేరు సొంతం చేసుకుంది. ఆ తర్వాత వరుసగా అవకాశాలు అందుకుంది కానీ అనుకున్నంత స్థాయిలో గుర్తింపు అయితే రావడం లేదు.

అందులో భాగంగానే తెలుగులో నటించిన రాబిన్ హుడ్, మాస్ జాతర, రీసెంట్గా వచ్చిన ఉస్తాద్ భగత్ సింగ్ వంటి చిత్రాలు పూర్తిగా నిరాశ పరచడంతో అవకాశాలు కూడా దాదాపు తగ్గిపోయాయనే చెప్పాలి. అందుకే ప్రస్తుతం తమిళ చిత్రాలపై శ్రీ లీల దృష్టి పెట్టినట్లు కనిపిస్తోంది ఇకపోతే శ్రీ లీల తమిళంలో నటించిన తొలి సినిమా పరాశక్తి . ఈ సినిమా విమర్శలు ఎదుర్కొన్నప్పటికీ మంచి గుర్తింపు లభించింది. ఇక అందుకే కోలీవుడ్ లోనే సినిమాలు చేయాలని ఫిక్స్ అయిపోయింది ఈ ముద్దుగుమ్మ. అలా ధనుష్ హీరోగా నటిస్తున్న 55వ సినిమాలో నటిస్తోంది. అలాగే హిందీలో కూడా ఒక సినిమాలో నటిస్తోంది. ఇకపోతే ప్రస్తుతం ధనుష్ కి జోడిగా నటిస్తున్న నేపథ్యంలో ఇందులో ఈమె పాత్ర ఎలా ఉంటుంది అనే కామెంట్లు వ్యక్తం అవ్వగా.. తాజాగా ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న ఈమె తన కోరికను బయట పెట్టింది.

బలమైన సెంటిమెంట్ సన్నివేశాలతో కూడిన మంచి కుటుంబ కథా చిత్రాలలో నటించాలనే ఆశను వ్యక్తం చేసింది. ముఖ్యంగా అలాంటి చిత్రాలు నటిగా తనలోని నటనను చూపిస్తాయని.. వైవిద్య భరిత కథ చిత్రాలలోనూ నటించాలని కోరుకుంటున్నట్లు తెలిపింది. ఇక ఆ చిత్రాలే తన కెరియర్ను ముందుకు తీసుకెళ్తాయని నమ్ముతున్నట్లు శ్రీ లీలా తెలిపింది. ఇకపోతే రష్మిక కూడా ఇలా వైవిధ్యమైన కథ చిత్రాలలో నటించి ప్రేక్షకులలో మంచి ఆదరణ సొంతం చేసుకుంది. ఇక అందుకే శ్రీ లీల కూడా ఇలాంటి పాత్రలే కావాలని కోరుకుంటుంది. ఒకవేళ అలాంటి పాత్రలు లభిస్తే ఆ పాత్రలతో ఈమె ప్రేక్షకులను మెప్పిస్తుందా? అసలు అలాంటి పాత్రలు ఈమెకు వర్కౌట్ అవుతాయా? అనే కామెంట్లు వ్యక్తం అవుతున్నాయి.

Tags:    
  • sreeleela 
  • rashmika 
  • tollywood 
  • kollywood 
  • heroines 
  • filmnews 
  • southcinema 

Similar News

ISKCON వ్యవస్థాపక ఆచార్యులు శ్రీ‌ల ప్ర‌భుపాద్‌ బ‌యోపిక్..హోంబలే సంచలనం!

2026-11-10 17:30 GMT

తమిళ ఇంటర్వ్యూలో తెలుగు సినిమాకు ఎలివేషన్

2026-11-10 16:30 GMT

డైరెక్టర్ టు హీరో.. భాషతోపాటు క్యారెక్టర్ మార్చిన తరుణ్ భాస్కర్.. వర్కౌట్ అయ్యేనా?

2026-11-10 15:30 GMT

వైట్ క్రాప్ టాప్‌లో గ్లామర్ ట్రీట్ ఇచ్చిన దిశా పటానీ!

2026-11-10 14:30 GMT

మండే రోజు రామాయణం మంటలు

2026-11-10 14:11 GMT

వాళ్లు 1% మాత్రమే... సినిమాను ఏం చేయలేరు!

2026-11-10 13:30 GMT

ట్రెడిషనల్ లుక్ లో మెరిసిన నిహారిక!

2026-11-10 12:54 GMT

పాత బాకీల పంచాయితీ.. ఆ డైరెక్టర్ సినిమా రిలీజ్ కష్టమేనా?

2026-11-10 12:54 GMT

'ఇంకా ఏం అనుకోలేదు' మూవీ.. మెస్మరైజ్ చేస్తున్న ఫస్ట్ సింగిల్!

2026-11-10 12:51 GMT

రేణు దేశాయ్ షాకింగ్ పోస్ట్.. కర్మఫలం తప్పదంటూ..

2026-11-10 12:49 GMT

'ఇరుముడి' కావేరి పెళ్లి పీటలు ఎక్కనుందా?

2026-11-10 12:49 GMT

కమల్ హాసన్ మల్టీ టాస్కింగ్ జర్నీ!

2026-11-10 12:30 GMT

Copyright @2026

Powered by Blink CMS