తనూజకి సపోర్ట్ గా శ్రీజ.. పర్సనల్ టార్గెట్ అంటూ కామెంట్..!

బిగ్ బాస్ సీజన్ 9లో దమ్ము శ్రీజ ఉన్నన్నాళ్లు హంగామా చేసింది. ఆమె ఐదో వారం వైల్డ్ కార్డ్స్ వచ్చిన తర్వాత ఎలిమినేట్ అయినా కూడా మళ్లీ రీ ఎంట్రీ ఛాన్స్ పట్టేసింది.;

Update: 2025-11-08 07:58 GMT

బిగ్ బాస్ సీజన్ 9లో దమ్ము శ్రీజ ఉన్నన్నాళ్లు హంగామా చేసింది. ఆమె ఐదో వారం వైల్డ్ కార్డ్స్ వచ్చిన తర్వాత ఎలిమినేట్ అయినా కూడా మళ్లీ రీ ఎంట్రీ ఛాన్స్ పట్టేసింది. ఐతే ఆడియన్స్ మాత్రం ఆమె రీ ఎంట్రీ అవసరం లేదని భరణికి ఓటు వేశారు. ఐతే భరణిని హౌస్ లోకి తీసుకెళ్లేందుకే తనని వాడుకున్నారని శ్రీజ బయటకు వచ్చాక ఒక స్పెషల్ వీడియో చేసింది. హౌస్ లో ప్రతి విషయం మీద అవసరం ఉన్నా లేకపోయినా ఆర్గ్యుమెంట్స్ చేస్తుందని శ్రీజ మీద చాలా కంప్లైంట్స్ ఉన్నాయి. అందువల్లే ఆమె రీ ఎంట్రీ ఇస్తున్నా కూడా సేవ్ చేసే వారికన్నా వద్దనుకున్న వారే భరణికి ఓటేశారు.

నామినేషన్స్ టైంలో వెళ్లి కళ్యాణ్ ని నామినేట్..

ఐతే హౌస్ లో నామినేషన్స్ టైంలో వెళ్లి కళ్యాణ్ ని నామినేట్ చేసి చెప్పాల్సిన దాన్ని చెప్పిన శ్రీజ తనూజ మీద కూడా ఫైర్ అయ్యింది. ఐతే ఆఫ్టర్ ఎలిమినేషన్ బయట నుంచి ఆట చూస్తున్న శ్రీజ తన డెసిషన్ మార్చుకున్నట్టు కనిపిస్తుంది. నిన్న జరిగిన కెప్టెన్సీ టాస్క్ లో దివ్య తనూజని ఎలిమినేట్ చేయడంపై తనూజకి సపోర్ట్ చేస్తూ దివ్య పర్సనల్ టార్గెట్ తోనే తనూజని తీసిందని. ఆమె తనూజ మీద గ్రడ్జ్ పెట్టుకుందని సోషల్ మీడియాలో కామెంట్ పెట్టింది.

తనూజ కు సారీ చెబుతూ దివ్య కావాలనే ఇలా చేసిందని రాసుకొచ్చింది శ్రీజ. దాదాపు నిన్న దివ్య చేసిన పని చూస్తే అందరు కూడా ఇదే క్లారిటీతో ఉన్నారు. తనూజ గురించి అందరు పాజిటివ్ గా చెబుతున్నారన్న ఆలోచనతోనో.. లేక ఆమెను టార్గెట్ చేయాలనే ఉద్దేశ్యమో కాని దివ్య నిన్న ముందు తనూజని సేఫ్ చేస్తానని చెప్పి ఇలా అర్ధాంతరంగా తీసేయడం మాత్రం ఆడియన్స్ కి షాక్ ఇచ్చింది. దివ్య ఏం చేసినా సపోర్ట్ చేసే భరణి కూడా తనూజని తీసినందుకు దివ్య మీద సీరియస్ గా ఉన్నాడు.

శ్రీజ సపోర్ట్ తో తనూజ మరింత బలంగా..

మొత్తానికి శ్రీజ సపోర్ట్ తో తనూజ మరింత బలంగా మారుతుందని చెప్పొచ్చు. ఐతే హౌస్ లోకి అగ్నిపరీక్ష ద్వారా కామనర్ గా వెళ్లిన శ్రీజ తనతోటి కామనర్స్ కళ్యాణ్, డీమాన్ పవన్ ఇద్దరికి సపోర్ట్ గా ఉంది. ముఖ్యంగా కళ్యాణ్ అంటే తనకు పర్సనల్ గా ఇష్టం కాబట్టి అతన్ని సపోర్ట్ చేస్తుంది. తాజాగా కెప్టెన్సీ టాస్క్ అయ్యాక తనూజ కి పాజిటివ్ గా పోస్ట్ పెట్టడంతో ఈ సీజన్ తనూజ టాప్ ప్లేస్ కి కన్ ఫర్మ్ అనేలా ఇండికేషన్స్ బలంగా మారుతున్నాయి.

Tags:    

Similar News