శ్రీలీల లవ్ స్టోరీ.. ఎందుకు ఇలా..?
యాక్టింగ్ తో పాటు డ్యాన్స్ లో కూడా తన మార్క్ చాటుతుంది శ్రీలీల. తెలుగు అమ్మాయే అయినా అమ్మడు కన్నడ ఇండస్ట్రీలో తొలి సినిమా చేసింది.;
యాక్టింగ్ తో పాటు డ్యాన్స్ లో కూడా తన మార్క్ చాటుతుంది శ్రీలీల. తెలుగు అమ్మాయే అయినా అమ్మడు కన్నడ ఇండస్ట్రీలో తొలి సినిమా చేసింది. ధమాకాతో తొలి హిట్ అందుకున్న శ్రీలీల తెలుగులో వరుస స్టార్ సినిమాలతో అదరగొట్టేస్తుంది. ఐతే సినిమాలైతే చేస్తుంది కానీ శ్రీలీలకు సక్సెస్ లు మాత్రం పడలేదు. ఐతే స్టార్ సినిమాల్లో శ్రీలీల హీరోయిన్ గా ఛాన్స్ అంటే కేవలం సాంగ్స్, రెండు మూడు సీన్స్ కోసమే అన్నట్టు ఉంటుంది.
తిరుపతిలో క్యూ లైన్ లో పక్క్కింటి అమ్మాయిలానే..
అసలు శ్రీలీల ఆఫ్ స్క్రీన్ ఫోటోస్ చూస్తే ఎంతో క్యూట్ గా ఉంటాయి. మొన్న తిరుపతిలో క్యూ లైన్ లో మన పక్కింటి అమ్మాయిలానే శ్రీలీల చాలా న్యాచురల్ గా అనిపించింది. ఐతే ఆ వీడియో చూసిన శ్రీలీల ఫ్యాన్స్ ఆమెతో ఎందుకు మన దర్శకులు లవ్ స్టోరీస్ ట్రై చేయట్లేదని అంటున్నారు. నిజమే శ్రీలీల లవ్ స్టోరీస్ కి పర్ఫెక్ట్ యాప్ట్ అవూతుంది. ఆమెను ఎందుకో మన మేకర్స్ గర్ల్ ఫ్రెండ్ గా చూపించడానికి ఆసక్తి చూపించట్లేదు.
కమర్షియల్ సినిమాల్లో గ్లామర్ రోల్స్ కోసమో.. లేదా డ్యాన్స్ పెర్ఫార్మెన్స్ ల కోసమో తప్ప అసలు శ్రీలీల వెయిట్ ఉన్న రోల్ చేయట్లేదు. ఒకప్పుడు త్రిష చేసినట్టుగా లవ్ స్టోరీస్ చేస్తే శ్రీలీల కెరీర్ కి కాస్త ఉపయోగకరంగా ఉంటుంది. బాలీవుడ్ లో శ్రీలీల తొలి సినిమా కార్తీక్ ఆర్యన్ తో లవ్ స్టోరీ చేస్తుంది. సూపర్ హిట్ ఫ్రాంచైజ్ ఆషికి సీక్వెల్ గా ఇది వస్తుందని తెలుస్తుంది.
శ్రీలీలలో ఒక ప్రేమికురాలిని..
బాలీవుడ్ డైరెక్టర్స్ గుర్తించినట్టుగా శ్రీలీలలో ఒక ప్రేమికురాలిని ఎందుకు చూడలేకపోతున్నారు అన్నది సోషల్ మీడియాలో డిస్కషన్ చేస్తున్నారు. తెలుగులో శ్రీలీల ఒక సీరియస్ లవ్ స్టోరీ చేస్తే తప్పకుండా ఆమెకు అది ప్లస్ అవుతుంది. శ్రీలీల తో ఒక క్రేజీ లవ్ స్టోరీ అంటే ఏ యువ హీరో అయినా చేయడానికి సై అనేస్తారు. మరి మన దర్శక నిర్మాతలు ఇలాంటి ఒక ప్రయత్నం చేస్తే బాగుంటుందని ఆడియన్స్ కోరుతున్నారు.
శ్రీలీల కూడా తెలుగులో కెరీర్ కొనసాగించాలని ఆలోచన ఉన్నా కేవలం కమర్షియల్ సినిమాల్లో ఏదో ఒక ఆట బొమ్మలా కాకుండా కాస్త వెయిట్ ఉన్న సీరియస్ రోల్స్ పడితే బాగుంటుందని అనుకుంటుంది. సో శ్రీలీలతో ఒక మంచి లవ్ స్టోరీ చేస్తే మాత్రం ఆమె డ్యాన్స్, పెర్ఫార్మెన్స్ కూడా ప్లస్ అయ్యి సినిమా ప్రేక్షకులను రీచ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. మరి అలాంటి అటెంప్ట్ ఎవరు చేస్తారు.. శ్రీలీలని ఆ యాంగిల్ లో ఎవరు చూపిస్తారు అన్నది చూడాలి. శ్రీలీల మాత్రం ఇదివరకు లాగా వచ్చిన ప్రతి సినిమా అన్నట్టు కాకుండా కాస్త ఆచి తూచి అడుగులు వేయాలని చూస్తుంది. వరుస ఫ్లాపులు ఆమెలో చాలా మార్పులు తెచ్చాయని తెలుస్తుంది.