పదహారేళ్ల కష్టానికి ప్రతిఫలం.. స్రవంతి ఎమోషనల్ కామెంట్స్!
సినిమా అనే రంగుల ప్రపంచంలోకి అడుగు పెట్టాలంటే అంత ఆషామాషీ కాదు.. ఒక్కసారి అడుగు పెట్టామో మళ్ళీ వదిలి వెళ్లడం కూడా అంతే కష్టం.;
సినిమా అనే రంగుల ప్రపంచంలోకి అడుగు పెట్టాలంటే అంత ఆషామాషీ కాదు.. ఒక్కసారి అడుగు పెట్టామో మళ్ళీ వదిలి వెళ్లడం కూడా అంతే కష్టం. అందుకే ఇండస్ట్రీలోకి వచ్చిన ఎంతోమంది తమ టాలెంట్ ను నిరూపించుకొని ఇక్కడే సెటిల్ అవ్వాలని ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. మరికొంతమంది ఈ రంగుల ప్రపంచంలో ఒక్క చిన్న అవకాశం కోసం ఏళ్ల తరబడి ఎదురుచూసిన వాళ్లు కూడా లేకపోలేదు. అలాంటి వారిలో స్రవంతి కూడా ఒకరు. ఏకంగా పదహారేళ్లపాటు ఒక్క సినిమాలో అవకాశం కోసం పోరాడిన ఈ తెలుగమ్మాయి.. ఇప్పుడు ఎట్టకేలకు అవకాశాన్ని అందరిని ఆశ్చర్యపరిచింది. అంతేకాదు ఇన్నేళ్ల కష్టానికి తగిన ప్రతిఫలం లభించింది అని ఎమోషనల్ అయ్యింది.
ఆమె ఎవరో కాదు ప్రముఖ యాంకర్ స్రవంతి చొక్కారపు. బుల్లితెరపై పలు షోలలో యాంకర్ గా.. సినిమా ఈవెంట్లకు హోస్ట్ గా వ్యవహరిస్తూ భారీ పాపులారిటీ సొంతం చేసుకున్న స్రవంతి.. అటు ఇన్స్టాగ్రామ్ ద్వారా భారీ పాపులారిటీ సొంతం చేసుకున్నప్పటికీ ఒక్క సినిమాలో కూడా అవకాశం లభించలేదు. అలా ఒక్క అవకాశం కోసం దాదాపు 16 సంవత్సరాల పాటు కష్టపడ్డానని.. అయితే ఒక స్టార్ వల్లే తన కలను నెరవేర్చుకోగలిగాను అని చెప్పి అందరిని ఆశ్చర్యపరిచింది. అసలు విషయంలోకి వెళ్తే.. కలర్ ఫోటో సినిమాతో తనను తాను ఇప్పుడు చేసుకొని ఇప్పుడు వరుస సినిమాలతో ప్రేక్షకులను అలరిస్తున్న సుహాస్ హీరోగా ఇటీవల వచ్చిన లిటిల్ హార్ట్స్ సినిమాతో ఓవర్ నైట్ లోనే స్టార్ సెలబ్రిటీ అయిపోయిన శివాని నాగారం మరోసారి జంటగా కలిసి నటిస్తున్న చిత్రం హే భగవాన్.
20 ఫిబ్రవరి 2026 థియేటర్లలోకి కాబోతున్న నేపథ్యంలో తాజాగా ఈ సినిమా నుండి టీజర్ రిలీజ్ చేశారు. అందులో భాగంగానే టీజర్ లాంచ్ లో పాల్గొన్న స్రవంతి చొక్కారపు ఎమోషనల్ అయింది. స్రవంతి మాట్లాడుతూ.." అనంతపూర్ జిల్లా కదిరి నుండి వచ్చిన నేను.. 2009లోనే నటి అవ్వాలనుకున్నాను. అయితే వెండితెరపై కనిపించడానికి నాకు 16 సంవత్సరాల సమయం పట్టింది. ఇప్పుడు హే భగవాన్ సినిమాతో నా కల నెరవేరింది. ఎన్ని ఆటంకాలు ఎదురైనా.. వెనక్కి తగ్గకుండా ఇక్కడికి రావడం నా పట్టుదలకు నిదర్శనం. అయితే నన్ను ఈ మార్గంలో నడిపించింది పవర్ స్టార్ పవన్ కళ్యాణ్.
దారంతా చీకటిగా.. గతుకులుగా ఉన్నా.. గుండెలు నిండా ధైర్యంతో ముందుకు సాగితేనే అనుకున్నది నెరవేరుతుంది అని పవన్ కళ్యాణ్ చెప్పారు. ఆయన మాటలను నేను ఇన్నేళ్లు పాటిస్తూ వచ్చాను. ఆ ధైర్యమే నాకు ఇప్పుడు నా కలను నెరవేర్చుకునేలా చేసింది". అంటూ చెప్పుకొచ్చింది. ఇక స్రవంతి చేసిన ఈ కామెంట్లు సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి. ఇకపోతే తన కుటుంబ సభ్యులకు తన ఎదుగుదలకు సపోర్ట్ చేసిన ప్రతి ఒక్కరికి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపింది. ఇకపోతే టీజర్ లోనే స్రవంతి చొక్కారపు పాత్రను రివీల్ చేయడంతో ఆమె అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. మరి ఇన్నేళ్ల కలకు అవకాశం లభించింది. మరి హే భగవాన్ సినిమాతో స్రవంతి తనను తాను ఏ విధంగా మెప్పిస్తుందో చూడాలి.