శ్రష్టి మళ్లీ సంచలన ఆరోపణలు.. అసోసియేషన్‌ లో ఏం జరుగుతోంది?

టాలీవుడ్ కొరియోగ్రాఫర్స్, డ్యాన్సర్స్ అసోసియేషన్‌ లో కొనసాగుతున్న వివాదం రోజురోజుకూ కొత్త మలుపులు తిరుగుతోంది.

Update: 2026-07-14 06:09 GMT

టాలీవుడ్ కొరియోగ్రాఫర్స్, డ్యాన్సర్స్ అసోసియేషన్‌ లో కొనసాగుతున్న వివాదం రోజురోజుకూ కొత్త మలుపులు తిరుగుతోంది. ఇటీవల ఎన్నికల నిర్వహణ, అసోసియేషన్ వ్యవహారాలపై రెండు వర్గాల మధ్య విభేదాలు బయటపడిన నేపథ్యంలో ఇప్పుడు కొరియోగ్రాఫర్, డ్యాన్సర్ శ్రష్టి వర్మ చేసిన వ్యాఖ్యలు చర్చకు దారితీశాయి. అసోసియేషన్‌ లో జరుగుతున్న పరిణామాలపై ఆమె స్పందిస్తూ పలు ఆరోపణలు చేశారు. దీంతో డ్యాన్స్ అసోసియేషన్‌ లో అసలేం జరుగుతోందనే చర్చ మరింత జోరందుకుంది.

శ్రష్టి వర్మ మాట్లాడుతూ, అసోసియేషన్‌ లో అందరికీ ఒకే రూల్స్ వర్తించాలని అభిప్రాయపడ్డారు. "ట్రెజరరీ, సెక్రటరీ తప్పు చేస్తే యూనియన్ క్షేమం కోసం శిక్ష వేయాలి. కానీ ఈసీ మెంబర్స్ ఎక్కడ తప్పు చేశారో.. ఏం తప్పు చేశారో నాకు అర్థం కావడం లేదు. శేఖర్ మాస్టర్, బాబీ మాస్టర్ సహా చాలా మంది నిన్న వచ్చారు. వాళ్లందరికీ కక్ష ఉంటుందా? అందరికీ తిరగబడాలని ఉంటుందా? అంతా ఏం జరుగుతుందో చూస్తున్నారు. అందుకే ఫైట్ చేస్తున్నారు. రూల్స్ అందరికీ ఒకేలా ఉండాలి. ఈక్వాలిటీ చూపించాలి. మేం చెప్పినలాగే ఉండాలి.. మేం చెప్పేలా చేయాలి అనే ఓనర్ షిప్ చూపించడం వర్కౌట్ అవ్వదు. మేం డాన్సర్స్ మాత్రమే. బానిసలం కాదు" అంటూ స్పష్టం చేశారు.

"మాకు మాట్లాడే హక్కు ఉంది. మాస్టర్ లేదా ప్రెసిడెంట్‌ కు నచ్చేలా అన్నీ ఉండాలని అంటున్నారు. అది కరెక్ట్ కాదు. ఎవరైనా తప్పు చేయకపోతే రైజ్ చేయడం వారి హక్కు. ఇన్నేళ్లుగా ఫెడరేషన్ ఆధ్వర్యంలో ఎన్నికలు జరుగుతున్నాయి. ఇప్పుడు కూడా అదే జరగాలని శేఖర్ మాస్టర్ తదితరులు రిక్వెస్ట్ చేస్తున్నారు. ఫెడరేషన్ అనేది పేరెంట్స్ వంటిది. ఫెడరేషన్ మాకు కావాలని రిక్వెస్ట్ చేస్తున్నాం. ఏడు కొండల అన్న తదితరులపై కొట్టేందుకు వచ్చారు. అంత ర్యూడ్ బిహేవియర్ చేయకూడదు. నేను కూడా చాలా ఏళ్లు లోపల దాచుకుని బయటపెట్టా" అని వ్యాఖ్యానించారు.

ఆ వ్యాఖ్యలతో అసోసియేషన్‌ లో సభ్యుల మధ్య డిస్టర్బన్స్ ఉందని మరోసారి అర్థమైంది. ఎన్నికల నిర్వహణలో క్రెడిబిలిటీ, నిబంధనల అమలు, సభ్యుల అభిప్రాయాలకు ప్రాధాన్యం వంటి అంశాలపై భిన్నాభిప్రాయాలు ఉన్నాయని శ్రష్టి కామెంట్స్ ద్వారా తెలుస్తోంది. అంతేకాకుండా తనపై వ్యక్తిగతంగా కక్ష సాధిస్తున్నారని కూడా శ్రష్టి రీసెంట్ గా ఆరోపించారు. తాను బిగ్ బాస్ నుంచి వచ్చి, బీబీ జోడీ విన్నర్ గా నిలిచిన తర్వాత అసోసియేషన్ సభ్యురాలిగా సన్మానం చేయాలని అప్పటి సెక్రటరీ ప్రతిపాదించారని చెప్పారు.

అయితే అప్పటి నుంచి పాత విషయాలను తీసుకొచ్చి తనను టార్గెట్ గా చేసుకుని అనేక వివాదాలు సృష్టిస్తున్నారని ఆరోపించారు. గతంలో తాను ఒక కేసు పెట్టిన కారణంగా కొందరు వ్యక్తిగత కక్ష పెంచుకున్నారని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికే అసోసియేషన్‌ లో కొనసాగుతున్న విభేదాలపై పలువురు తమ అభిప్రాయాలను వ్యక్తం చేస్తుండగా, శ్రష్టి వర్మ కామెంట్స్ మరోసారి వివాదాన్ని హాట్ టాపిక్‌ గా మార్చాయి. మరి ఎన్నికల ప్రక్రియ, అసోసియేషన్ వ్యవహారాలు, సభ్యుల మధ్య నెలకొన్న విభేదాలపై ఫ్యూచర్ లో ఎలాంటి పరిణామాలు చోటుచేసుకుంటాయన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.

Tags:    

Similar News