చిరు- వంగా కాంబో సెట్ అయితే.. పూనకాలేనా?
టాలీవుడ్ లో తనదైన ఇంటెన్స్ మేకింగ్, బోల్డ్ కథలతో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా ప్రస్తుతం మోస్ట్ వాంటెడ్ డైరెక్టర్లలో ఒకరిగా నిలిచారు.
టాలీవుడ్ లో తనదైన ఇంటెన్స్ మేకింగ్, బోల్డ్ కథలతో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా ప్రస్తుతం మోస్ట్ వాంటెడ్ డైరెక్టర్లలో ఒకరిగా నిలిచారు. అర్జున్ రెడ్డి, కబీర్ సింగ్, యానిమల్ వంటి సినిమాలతో హీరోల ఎమోషన్స్ ను రా అండ్ అగ్రెసివ్ గా చూపించిన సందీప్.. ఇప్పుడు చిరంజీవిపై చేసిన కామెంట్స్ తో మరోసారి చర్చల్లోకి వచ్చారు. ఆయనతో సినిమా చేయాలన్న తన కోరికను ఆయన ఓపెన్ గా చెప్పడంతో అభిమానుల్లో భారీ ఆసక్తి నెలకొంది.
సందీప్ రెడ్డి వంగా సినిమాలంటే ప్రేమ, కోపం, బాధ.. ఏ ఫీలింగ్ అయినా ఎక్స్ట్రీమ్ స్థాయిలో కనిపిస్తుంది. హీరో క్యారెక్టర్లలో కనిపించే ఆ ఇంటెన్సిటీకి కారణం ఏమిటనే ప్రశ్నకు సమాధానం మాత్రం చిరంజీవి సినిమాలేనని తెలుస్తోంది. ముఖ్యంగా ఆరాధన’సినిమాలో చిరంజీవి పోషించిన పులిరాజు పాత్ర సందీప్ పై ఎఫెక్ట్ చూపిందని చర్చ జరుగుతోంది. ఇటీవల సందీప్ తన ఆఫీస్ కు సంబంధించిన ఓ ఫోటోను సోషల్ మీడియాలో షేర్ చేశారు.
అందులో గోడపై ఉన్న చిరంజీవి ఫ్రేమ్ అభిమానుల దృష్టిని ఆకర్షించింది. అది సాధారణ ఫోటో కాదు. ఆరాధన సినిమాలో హీరోయిన్ సుహాసిని చెంపదెబ్బ కొట్టిన తర్వాత చిరంజీవి ఇచ్చిన ఎక్స్ప్రెషన్ కు సంబంధించిన స్టిల్. ఆ ఒక్క ఎమోషన్ నే ఫ్రేమ్ కట్టించి ఆఫీస్ లో పెట్టుకోవడం ద్వారా సందీప్ ఎంతటి హార్డ్ కోర్ చిరు ఫ్యానో అర్థమవుతోంది. తాజాగా ఓ ఈవెంట్ లో పాల్గొన్న సందీప్.. తన ఫేవరెట్ హీరో ఎవరు? ఎవరితో సినిమా చేయాలని ఉంది? అనే ప్రశ్నకు వెంటనే చిరంజీవి పేరే చెప్పారు.
దీంతో ఆ కాంబినేషన్ పై సోషల్ మీడియాలో మరింత హైప్ పెరిగింది. ఇప్పటివరకు చిరంజీవి ఎన్నో విభిన్నమైన పాత్రలు చేశారు. మాస్, కామెడీ, ఎమోషన్, డ్యాన్స్, యాక్షన్.. అన్ని జోనర్స్ లో తనదైన ముద్ర వేశారు. కానీ సందీప్ వంగా స్టైల్ లో పూర్తిగా రా అండ్ అగ్రెసివ్ పాత్రలో చిరంజీవిని చూడాలనే ఆసక్తి అభిమానుల్లో కనిపిస్తోంది. సందీప్ సినిమాల్లో హీరోల క్యారెక్టరైజేషన్ చాలా స్ట్రాంగ్ గా ఉంటుంది. హీరోలోని ఆవేశం, ఎమోషన్స్ ను ఆయన ప్రత్యేకంగా చూపిస్తారు.
అలాంటి దర్శకుడితో చిరంజీవి వంటి టాలెంటెడ్ హీరో వర్క్ చేస్తే.. అది నార్మల్ కమర్షియల్ సినిమా స్థాయిలో ఉండదనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. మెగాస్టార్ స్క్రీన్ ప్రెజెన్స్ కు సందీప్ ఇంటెన్స్ టేకింగ్ జతకలిస్తే ఇండియన్ సినిమాకే కొత్త ట్రెండ్ సెట్ అయ్యే అవకాశం ఉందని భావిస్తున్నారు. ప్రస్తుతం సందీప్.. స్పిరిట్ సినిమాతో బిజీగా ఉన్నారు. ఆ మూవీ లాంచ్ కు చిరంజీవి ముఖ్య అతిథిగా హాజరై క్లాప్ కొట్టడం కూడా అప్పట్లో వైరల్ అయింది.
అయితే స్పిరిట్ లో చిరంజీవి నటిస్తున్నారనే వార్తలు సందీప్ ఇప్పటికే ఖండించారు. ప్రస్తుతం అలాంటి ప్రాజెక్టు ఏదీ లేదని స్పష్టం చేశారు. అయినప్పటికీ భవిష్యత్తులో చిరంజీవితో ఒక సోలో సినిమా తప్పకుండా చేస్తానని సందీప్ చెప్పడం అభిమానులకు కొత్త ఆశలు కలిగిస్తోంది. ఆ కాంబినేషన్ ఎప్పుడు సెట్ అవుతుందో తెలియకపోయినా.. ఒకవేళ నిజమైతే మాత్రం అది కేవలం సినిమా కాకుండా ఇండస్ట్రీ మొత్తం మాట్లాడుకునే మాసివ్ ఈవెంట్ గా మారుతుంది. ఫ్యాన్స్ కు పూనకాలు కూడా వస్తాయి!