టాలీవుడ్ స్టార్ల సైడ్ వ్యాపారాలు బిందాస్‌గా
సౌత్ స్టార్ హీరోలు భారీ పారితోషికాలు అందుకోవడంలోనే కాదు, తమ సంపాదనను తెలివిగా పెట్టుబడులు పెట్టడంలోను ముందున్నారు.;
సౌత్ స్టార్ హీరోలు భారీ పారితోషికాలు అందుకోవడంలోనే కాదు, తమ సంపాదనను తెలివిగా పెట్టుబడులు పెట్టడంలోను ముందున్నారు. చాలామంది లాభసాటి వ్యాపారాలతో ఎంటర్ ప్రెన్యూర్స్ గా నిరూపించుకుంటున్నారు. పలువురు హీరోలు వాణిజ్య ప్రకటనలతోను భారీ మొత్తాలను ఆర్జిస్తున్నారు.
స్టార్ హీరోల్లో అక్కినేని నాగార్జున, రామ్ చరణ్- అల్లు అర్జున్ - మహేష్ బాబు-ప్రభాస్- రానా దగ్గుబాటి- విజయ్ దేవరకొండ వంటి స్టార్లు వ్యవస్థాపకులుగా వ్యాపారాల్లో సత్తా చాటుతున్నారు.
నాగార్జున అక్కినేని
కింగ్ నాగార్జునకు వ్యాపారాలలో నిష్ణాతుడు. సొంత నిర్మాణ సంస్థ అన్నపూర్ణ స్టూడియోస్ నిర్వహణతో పాటు, హోటల్స్, ఆతిథ్య రంగాల్లో ఆయన సుప్రసిద్ధుడు. అన్నపూర్ణ స్టూడియోస్ కేవలం నిర్మాణ సంస్థ మాత్రమే కాదు.. ఇక్కడ సకల సౌకర్యాలతో ఫిలింమేకింగ్ కి అనువైన ప్రదేశం. హైదరాబాద్ లోని అత్యంత ఖరీదైన ప్రాంతంలో 7 ఎకరాల విస్తీర్ణంలో స్టూడియోను కలిగి ఉంది. దీనిని అన్నపూర్ణ ఏడెకరాలు అంటారు. అన్నపూర్ణ స్కూల్ ఆఫ్ ఫిల్మ్ స్టడీస్ దశాబ్ధాల చరిత్రను కలిగి ఉంది. ఇవి కాకుండా హైదరాబాద్ లో కొన్ని రెస్టారెంట్లు - కన్వెన్షన్ సెంటర్ లను నాగార్జున నిర్వహిస్తున్నారు.
విక్టరీ వెంకటేష్ & దగ్గుబాటి కుటుంబం :
మూవీ మొఘల్ దగ్గుబాటి రామానాయుడు వారసులుగా విక్టరీ వెంకటేష్- డి.సురేష్ బాబు సినిమా వ్యాపారంలో దశాబ్ధాల కాలంగా ఉన్నారు. వారి వారసుడు రానా దగ్గుబాటి కూడా హీరోగా, నిర్మాతగా రాణిస్తున్నారు. రానా పలు లాభదాయకమైన ఇతర వ్యాపారాల్లోను ఉన్నారు. స్టూడియోలు & డిస్ట్రిబ్యూషన్ రంగంలో సురేష్ ప్రొడక్షన్స్ హవా గురించి తెలిసిందే. ఫిల్మ్ ల్యాబ్స్, డిస్ట్రిబ్యూషన్ రంగంలో అత్యంత బలమైన పట్టు కలిగి ఉన్నారు.
వెంకటేష్ `వైక్ వూ` అనే ఎలక్ట్రిక్ వెహికల్ (EV) స్టార్టప్‌లో వ్యూహాత్మక పెట్టుబడిదారుడిగా చేరారు. హైదరాబాద్ , విశాఖపట్నంలో భారీ స్థాయిలో భూములు, కమర్షియల్ ప్రాపర్టీలు ఉన్నాయి. ఇక్నాజ్, అంథిల్ వెంచర్స్ ద్వారా టెక్, మీడియా స్టార్టప్‌లలో దగ్గుబాటి రానా పెట్టుబడులు పెట్టారని కథనాలొచ్చాయి. ప్రముఖ టాలెంట్ మేనేజ్‌మెంట్ ఏజెన్సీ అయిన KWANలో రానా సహ వ్యవస్థాపకుడు. ప్రొడక్షన్ హౌస్- మ్యూజిక్ లేబుల్ వ్యాపారంతో పాటు `అమర్ చిత్ర కథ` అనే కామిక్ బుక్ కంపెనీ ని నిర్వహిస్తున్నాడు. టెక్ స్టార్ట్-అప్ ల కోసం బిజినెస్ యాక్సిలరేటర్ ప్రోగ్రామ్ ను రానా రన్ చేస్తున్నాడు. రామానాయుడు స్టూడియోస్ లో యానిమేషన్ కోసం ప్రత్యేకించి ఒక డివిజన్ ని రన్ చేస్తున్నారు.
అల్లు అర్జున్
హైదరాబాద్ లోని `బఫెలో వైల్డ్ వింగ్స్`(బి -డబ్స్) ఫ్రాంచైజీ పేరుతో బన్ని బార్ ల వ్యాపారంలో ప్రవేశించారు. ఈ ఫ్రాంఛైజీ ప్రారంభమై చాలా కాలమైంది. గచ్చిబౌళి, జూబ్లీహిల్స్‌లో బి డబ్స్‌కి అవుట్‌లెట్స్ ఉన్నాయి. బన్నీకి 800 జూబ్లీ పేరుతో పబ్ రన్నింగ్ లో ఉంది. ఇది కాకుండా అతడి భార్య స్నేహారెడ్డికి పిక్-ఎ-బూ అనే ఫోటో స్టూడియో ఉంది. అల్లు అర్జున్ ఇటీవల సినిమా థియేటర్ల వ్యాపారంలోకి ప్రవేశించాడు. ఏషియన్ సినిమాస్ తో మల్టీప్లెక్స్ రంగంలోకి ప్రవేశించాడు. AAA సినిమాస్ అమీర్ పేటలో పెద్ద సక్సెస్ కాగా, రెండో వెంచర్ ని కోకాపేట్ లో లాంచ్ చేస్తున్నారు. గీతా ఆర్ట్స్, ఆహా (AHA) ఓటీటీ ప్లాట్‌ఫారమ్‌లో కూడా బన్ని భాగస్వామి.
మహేష్ బాబు
మహేష్ బాబు సినిమాలు వేగంగా చేయకపోయినా.. ప్రతి సంవత్సరం భారీగా వాణిజ్య ప్రకటనలలో నటిస్తున్నాడు. పాపులర్ బ్రాండ్ లకు అంబాసిడర్ గా భారీగా ఆర్జిస్తున్నాడు. మరోవైపు హైదరాబాద్ లోని ఆసియన్ సినిమాస్ తో కలిసి మహేష్ బాబు థియేటర్ల వ్యాపారంలోకి ప్రవేశించాడు. ఏఎంబీ సినిమాస్ ఇప్పటికే పెద్ద సక్సెసైంది. ఏఎంబీ నగరంలోని సాఫ్ట్ వేర్ హబ్ గచ్చిబౌళి పరిసరాల్లో ఉంది. మహేష్ భార్య నమ్రత తమ మొట్టమొదటి రెస్టారెంట్ ను ఆసియన్ గ్రూప్ తో కలిసి ప్రకటించడం ఆసక్తికరం. వీటికి AN రెస్టారెంట్లు - మినర్వా కాఫీ షాప్ అంటూ ఆసక్తికరమైన పేర్లు పెట్టారు. మహేష్ తన ఏఎంబి సినిమాస్ ని బెంగళూరులోను ప్రారంభించడం ఆసక్తిని కలిగించింది. `ది హంబుల్ కో` బ్రాండ్ పేరుతో సొంత మెన్స్ వేర్ క్లాథింగ్ వ్యాపారాన్ని నిర్వహిస్తున్నారు.
రామ్ చరణ్ తేజ్
RRR తో పాన్ ఇండియా స్టార్ గా సత్తా చాటిన రామ్ చరణ్ విమానయాన రంగంలో ప్రవేశించడం ఒక సంచలనం. ట్రూజెట్ పేరుతో తక్కువ దూరాలకు ప్రయాణీకులను చేరవేసే ఎయిర్ లైన్స్ సంస్థ ఇది. ఇది టర్బో ఏవియేషన్ కి అనుబంధ సంస్థ. అయితే ఈ వ్యాపారం అధిక నిర్వాహణా వ్యయం కారణంగా, ఇటీవల నిలిపివేసారని కథనాలొచ్చాయి. హైదరాబాద్ పోలో అండ్ రైడింగ్ క్లబ్ కు చరణ్ యజమాని. అలాగే చరణ్ ఇప్పటికే కొణిదెల ప్రొడక్షన్ కంపెనీ అనే ప్రొడక్షన్ హౌస్ ని ప్రారంభించి మెగాస్టార్ కథానాయకుడిగా సినిమాలను నిర్మిస్తున్నారు. చరణ్ సతీమణి ఉపాసన కొణిదెలకు అపోలో గ్రూప్స్ లోని అపోలో హెల్త్ వింగ్ అధినేత. అన్నింటికీ మించి హైదరాబాద్ పోలో అండ్ రైడింగ్ క్లబ్ యజమానిగా చరణ్ కి గుర్తింపు ఉంది.
ప్రభాస్:
బాహుబలి స్టార్ ప్రభాస్ కుటుంబానికి తొలి నుంచి సినిమాల నిర్మాణం పంపిణీ రంగంలో అనుభవం ఉంది. ప్రభాస్ సొంతంగా మల్టీప్లెక్స్ థియేటర్ల చైన్ వ్యాపారాన్ని ప్రారంభించారు. అతడు వాణిజ్య ప్రకటనల్లో నటించేందుకు ఆసక్తిగా ఉండడు. కేవలం సినిమాలు చేసేందుకే ఎక్కువ ప్రాధాన్యతను ఇస్తున్నాడు.
విజయ్ దేవరకొండ :
రౌడీ వేర్ పేరుతో దుస్తుల బ్రాండ్ ద్వారా యూత్ లో మంచి క్రేజ్ సంపాదించారు. మహబూబ్‌నగర్‌లో AVD సినిమాస్ అనే థియేటర్ ను నిర్వహిస్తున్నారు. సినిమా నిర్మాతగాను పెట్టుబడులు పెడుతున్నారు. పలు వాణిజ్య ప్రకటనల్లో నటించి మంచి ఆదాయం ఆర్జిస్తున్నాడు.
నేచురల్ స్టార్ నాని వాల్ పోస్టర్ సినిమా అనే ప్రొడక్షన్ హౌస్ ద్వారా సినిమాలను నిర్మిస్తున్నారు. టాలీవుడ్ లో పలువురు ప్రముఖ నిర్మాతలు ప్రధానంగా రియల్ ఎస్టేట్, సాఫ్ట్‌వేర్ పార్కులు, అగ్రికల్చర్ ల్యాండ్స్‌లో భారీగా పెట్టుబడులు పెడుతుంటారు.
దళపతి విజయ్
కోలీవుడ్ స్టార్ హీరో విజయ్ నెమ్మదిగా తన మార్కెట్ పరిధిని పొరుగు భాషలకు విస్తరిస్తున్నాడు. అతడు నటించిన జననాయగన్ సంక్రాంతి కానుకగా విడుదలవుతోంది. తమిళనాడులో అనేక కళ్యాణ మండపాలు, కన్వెన్షన్ సెంటర్ ల నిర్వహణలో ఉన్నాడు. వీటికి తన కుటుంబ సభ్యుల పేర్లను పెట్టినట్లు చెబుతున్నారు. అలాగే శ్రీలంకలో విజయ్ కొన్ని థియేటర్లను రన్ చేస్తున్నాడనే విషయం చాలామందికి తెలియదు.
హీరో ఆర్య
ఈ హీరోకి `సీ షెల్` అనే సౌత్ ఇండియన్ రెస్టారెంట్ ఉంది. అతను ది షో పీపుల్ అనే ప్రొడక్షన్ హౌస్ ని ప్రారంభించి సినిమాలు నిర్మిస్తున్నాడు. ఈ బ్యానర్ లో పలు విజయవంతమైన చిత్రాలను నిర్మించాడు.
సినీ గ్లామర్ ఎప్పుడూ ఒకేలా ఉండదు కాబట్టి టాలీవుడ్ ప్రముఖులు తమ భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని పలు వ్యాపారాలలో పెట్టుబడులు పెడుతున్నారు. రియల్ ఎస్టేట్, హాస్పిటాలిటీ (హోటల్స్), టెక్ రంగాలలో స్థిరమైన వ్యాపారాలను ఎంచుకుంటున్నారు.