రూ.500 కోట్ల క్లబ్.. సౌత్ సినిమాల సత్తా ఎలా ఉందంటే?

అలా ఇప్పటి వరకు చెప్పుకున్న సినిమాలన్నీ రూ.500 కోట్ల క్లబ్ లో చేరాయి. ఓ సారి లిస్ట్ రూపంలో తెలుసుకుందాం.;

Update: 2025-10-15 14:18 GMT

సౌత్ సినీ ఇండస్ట్రీ.. భారతీయ సినీ పరిశ్రమలో సరికొత్త రికార్డులు సృష్టిస్తున్న విషయం తెలిసిందే. ఒకప్పుడు ప్రాంతీయ పరిమితుల్లోనే మిగిలిపోయిన సౌత్‌ సినిమాలు ఇప్పుడు జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో సత్తా చాటుతున్నాయి. బాక్సాఫీస్ వద్ద భారీ వసూళ్లు కురిపిస్తున్నాయి. రూ.500 కోట్ల క్లబ్ లోకి కూడా చేరి అరుదైన ఘనతలు సాధిస్తున్నాయి.

ఇప్పటి వరకు రూ.500 కోట్ల క్లబ్ లో 12 దక్షిణాది సినిమాలు చోటు దక్కించుకోవడం విశేషం. ఆ జాబితాలో చేరిన మొదటి దక్షిణాది చిత్రం బాహుబలి: ది బిగినింగ్ అన్న విషయం తెలిసిందే. దర్శకధీరుడు ఎస్‌ఎస్‌ రాజమౌళి సృష్టించిన ఆ విజువల్ వండర్‌ .. దేశవ్యాప్తంగా తెలుగు సినిమాకు కొత్త గుర్తింపును తెచ్చింది. సౌత్ సత్తా విశ్వవ్యాప్తం చేసింది.

ఆ సినిమా సీక్వెల్ బాహుబలి 2: ది కన్ క్లూజన్ అయితే బాక్సాఫీస్ వద్ద అనేక రికార్డులు బద్దలు కొట్టింది. రూ.1,700 కోట్లకు పైగా వసూళ్లు సాధించి చరిత్ర సృష్టించింది. అలా బాహుబలి సిరీస్ రెండు చిత్రాలు పాన్ ఇండియా రేంజ్ కు దారి చూపించాయి. ఆ తర్వాత నుంచి సౌత్‌ సినీ ఇండస్ట్రీ వెనుకడుగు వేయలేదు. ఎక్కడా వెనక్కి తిరిగి చూడలేదు.

కోలీవుడ్ మూవీ కేజీఎఫ్ 2 ప్రపంచవ్యాప్తంగా రూ.1,200 కోట్లకు పైగా వసూళ్లను రాబట్టింది. ఆ తరువాత రాజమౌళి మళ్లీ సృష్టించిన ఆర్ఆర్ఆర్ చిత్రం గ్లోబల్‌ లెవెల్‌ లో సంచలనం సృష్టించి, ఆస్కార్‌ అవార్డు గెలుచుకుంది. పుష్ప: ది రైజ్ తోపాటు ఆ మూవీ సీక్వెల్‌ పుష్ప 2: ది రూల్ సినిమాలు దేశవ్యాప్తంగా విపరీతమైన ఆదరణ పొందాయి.

2.0, జైలర్, కూలీ, లియో సినిమాలు భారీ వసూళ్లను సాధించాయి. కల్కి 2898 ఏడీ కూడా రూ.1000 కోట్లకు చేరువలోకి వచ్చింది. రీసెంట్ గా రిలీజ్ అయిన కాంతార సీక్వెల్‌ కాంతార: చాప్టర్ 1 సినిమా కలెక్షన్లలో సంచలనం సృష్టించింది. అలా ఇప్పటి వరకు చెప్పుకున్న సినిమాలన్నీ రూ.500 కోట్ల క్లబ్ లో చేరాయి. ఓ సారి లిస్ట్ రూపంలో తెలుసుకుందాం.

రూ.500 కోట్ల క్లబ్‌ దాటిన సినిమాలు

బాహుబలి 1

బాహుబలి 2

ఆర్ఆర్ఆర్

కేజీఎఫ్ 2

పుష్ప 2

పుష్ప 1,

కల్కి 2898 ఏడీ,

రోబో 2.0,

జైలర్

లియో,

కూలీ,

కాంతార: చాప్టర్ 1.

అయితే పై జాబితాలో ఉన్న సినిమా విజయాల వెనుక ఉన్న ప్రధాన కారణం.. విజన్‌, కథా బలం, మేకింగ్‌ నాణ్యత అని చెప్పాలి. భాషలను దాటిపోయే కథలు, ప్రపంచస్థాయి సాంకేతికత, భావోద్వేగాలను అందించే పాత్రలు కూడా విజయ రహస్యాలు. అలా దక్షిణాది సినిమాలు ఒక రాష్ట్రంలోనే కాకుండా.. పాన్ ఇండియా లెవెల్ లో అలరిస్తున్నాయి.

Tags:    

Similar News