వింబుల్డన్ వెళ్లే స్టార్స్‌పై సోఫీ ఆగ్రహం
తాజాగా ప్రముఖ నటి సోఫీ చౌదరి ఇన్‌స్టాగ్రామ్‌లో షాకింగ్ వ్యాఖ్యలు చేసింది. ఇన్‌స్టాగ్రామ్‌లో వింబుల్డన్ కి హాజరు అయిన సెలబ్రిటీల గురించి ఇన్ఫ్లుయెన్సర్ల గురించి ఘాటు వ్యాఖ్యలు చేసింది.;
లండన్‌లో జరిగిన వింబుల్డన్ 2025 కి ప్రపంచ వ్యాప్తంగా వందల సంఖ్యలో సెలబ్రిటీలు హాజరు అయ్యారు. హాలీవుడ్ నుంచి ప్రపంచ దేశాలకు చెందిన ఎంతో మంది సినీ ప్రముఖులు, సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్లు పాల్గొన్నారు. అక్కడ ఫోటోలు దిగి సోషల్ మీడియాలో షేర్ చేయడంను చాలా మంది స్టేటస్‌గా భావిస్తున్నారు. తెలుగు దర్శకుడు సుకుమార్ తన భార్యతో కలిసి ఆటను చూసేందుకు వెళ్లిన విషయం తెల్సిందే. సోనమ్ కపూర్, అనుష్క శర్మ, విరాట్, అవ్నీత్, జాక్వెలిన్ ఫెర్నాండెజ్, జాన్వీ కపూర్, మిలింద్ ప్రీతీ జింటా, ఊర్వశి రౌతేలా ఇలా ఎంతో మంది ప్రముఖులు సైతం వింబుల్డన్‌ను చూసేందుకు వెళ్లారు.
ఈసారి వింబుల్డన్ గేమ్‌లో బాలీవుడ్ సెలబ్రిటీలు ఎక్కువగా పాల్గొనడం చర్చనీయాంశంగా మారింది. హాలీవుడ్ సెలబ్రిటీలు సింపుల్‌గానే వింబుల్డన్‌ను చూసేందుకు వెళ్తే బాలీవుడ్ సెలబ్రిటీలు మాత్రం ఒక అవార్డ్ వేడుకలో హాజరు అయినట్లుగా అందంగా ముస్తాబయ్యారు. అంతే కాకుండా రెడ్ కార్పెట్ పై ఫోటోలు దిగినట్లుగా ఫోటోలు దిగి వాటిని సోషల్ మీడియా ద్వారా షేర్ చేయడంతో పాటు, తమ తమ పీఆర్ టీంలతో పెద్ద ఎత్తున సోషల్ మీడియాలో పబ్లిసిటీ అయ్యేలా చేశారు. వింబుల్డన్ వెళ్లిన వారికి గుర్తింపు గౌరవం ఉంటుంది. అందుకే చాలా మంది ఖర్చు ఎక్కువ అయినా సరే అని అక్కడకు వెళ్లి ఫోటోలు దిగి షేర్ చేసిన వారు ఉన్నారు.
తాజాగా ప్రముఖ నటి సోఫీ చౌదరి ఇన్‌స్టాగ్రామ్‌లో షాకింగ్ వ్యాఖ్యలు చేసింది. ఇన్‌స్టాగ్రామ్‌లో వింబుల్డన్ కి హాజరు అయిన సెలబ్రిటీల గురించి ఇన్ఫ్లుయెన్సర్ల గురించి ఘాటు వ్యాఖ్యలు చేసింది. అక్కడకు వెళ్లిన వారిలో చాలామందికి ఆటపై ఆసక్తి లేదని, చాలా మంది వ్యక్తిగత అభిరుచితో వెళ్తే, కొందరు ఎంజాయ్ చేసేందుకు వెళ్లి ఉంటారని అభిప్రాయం వ్యక్తం చేసింది. వింబుల్డన్‌ను చాలా మంది సెలబ్రిటీలు ఫ్యాషన్ రన్ వేగా మార్చడం విడ్డూరంగా ఉందని, వారు చేసిన పనితో ముందు ముందు వింబుల్డన్ స్టేజ్ ఒక కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్ వేడుక మాదిరిగా మారే ప్రమాదం ఉందని సోఫీ చౌదరి తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తూ పోస్ట్ చేసింది.
దయచేసి వింబుల్డన్‌ను ముందు ముందు కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్‌గా మార్చవద్దని విజ్ఞప్తి చేసింది. నాకు టెన్నిస్ పట్ల చాలా అభిమానం ఉంది. నా పేవరెట్స్ సంప్రాస్, అగస్సీ, నాదల్, ఇప్పుడు అల్కరాజ్ లు అంటూ చెప్పుకొచ్చింది. స్కూల్ ఎగ్జామ్స్ టైమ్‌లోనూ మేము టెన్నీస్ మ్యాచ్‌లు చూసిన సందర్భాలు ఉన్నాయని సోఫీ గుర్తు చేసుకుంది. కానీ ఇప్పుడు చాలా మంది టెన్నీస్ పై ఆసక్తి లేకున్నా కూడా వింబుల్డన్ చూసేందుకు వెళ్లారు అంటూ సోఫీ చెప్పుకొచ్చింది. వారు కేవలం తమ స్టార్‌డంను, స్టార్ స్టేటస్‌ను చూపించడానికి అక్కడికి వెళ్లి ఉంటారు అంది. వింబుల్డన్ కి వెళ్లిన వారు టెన్నీస్ పై ఆసక్తితో వెళ్లి ఉంటే నాకేం సమస్య లేదని చెప్పుకొచ్చింది.