బోయ్‌ఫ్రెండ్‌తో స్టార్ హీరోయిన్ పెళ్లి?

సోనాక్షి సిన్హా జహీర్ ఇక్బాల్‌తో డేటింగ్ చేస్తున్నట్టు జాతీయ మీడియాలో ఇప్ప‌టికే క‌థ‌నాలు వెలువ‌డ్డాయి. జహీర్ ఇక్బాల్ - సోనాక్షి సిన్హా సల్మాన్ ఖాన్ వ‌ల్ల‌ కలుసుకున్నట్లు సమాచారం.

Update: 2024-05-10 00:30 GMT

సూప‌ర్ స్టార్ ర‌జ‌నీకాంత్ 'లింగ' సినిమాలో అనుష్క శెట్టితో పాటు మ‌రో క‌థానాయిక‌గా న‌టించింది సోనాక్షి సిన్హా. దుర‌దృష్ట‌వ‌శాత్తూ సౌత్ ఆరంగేట్రం డిజాస్ట‌ర్‌గా మారింది. ఈ సినిమా ప్రచారం కోసం హైద‌రాబాద్ లో తెలుగు మీడియాతో సోనాక్షి ఇంట‌రాక్ట్ అయింది. కానీ సినిమా ఫ్లాప‌య్యాక‌ సోనాక్షి ఇటువైపు చూడ‌లేదు. కానీ బాలీవుడ్ లో ఈ బ్యూటీ అద్భుత‌మైన చిత్రాల్లో న‌టించింది. ప‌లు సినిమాలు బ్లాక్ బ‌స్ట‌ర్లు అందుకున్నాయి. న‌టిగా ప్ర‌తి సినిమాతో త‌న‌ను తాను నిరూపించుకుంది. శ‌త్రుఘ్న సిన్హా న‌ట‌వార‌సురాలిగా సోనాక్షి ప‌రిణ‌తి నేటిత‌రానికి స్ఫూర్తి అన‌డంలో సందేహం లేదు. ఇటీవ‌లే భ‌న్సాలీ తెర‌కెక్కించిన వేశ్యా నేప‌థ్య వెబ్ సిరీస్ హీరామండిలో వేశ్య పాత్ర‌లో సోనాక్షి అభిన‌యానికి యువ‌త‌రం ఫిదా అయిపోతున్నారు. క్రిటిక్స్ నుంచి మిశ్ర‌మ స్పంద‌న‌లు వ్య‌క్త‌మైనా కానీ, హీరామండి నెట్ ఫ్లిక్స్ లో అత్య‌ధిక వీక్ష‌ణ‌లు పొందిన భార‌తీయ‌ సిరీస్ గా పాపుల‌రైంది.

ఇప్పుడు ది గ్రేట్ ఇండియన్ కపిల్ షో తాజా ఎపిసోడ్‌లో హీరామండికి న‌టీమ‌ణులు అతిథులుగా హాజ‌ర‌య్యారు. హీరామాండి తారాగణం - రిచా చద్దా, మనీషా కొయిరాలా, సంజీదా షేక్, సోనాక్షి సిన్హా, షర్మిన్ సెగల్, అదితి రావ్ హైదరీ ఈ వేదిక‌పై ప‌లు ఆసక్తికర విషయాలను షేర్ చేసారు. ఒక ప్రోమోలో, కపిల్ శర్మ పర్ఫెక్షనిస్ట్ సంజయ్ లీలా భ‌న్సాలీతో షూటింగ్ గురించి నటీమణులను అడిగాడు. మనీషా కొయిరాలా ప్రతి షాట్‌కు ముందు ఉద్వేగభరితంగా ఉందని.. రిచా చాలా ఎక్కువ రీటేక్ లు తీసుకున్నాన‌ని చెప్ప‌డం క‌నిపించింది. సోనాక్షి ఎప్పుడూ 12 రీటేక్‌లను మించలేదని గుర్తుచేసుకుంది. అయితే షోలో ఒక సన్నివేశం కోసం తాను 99 రీటేక్‌లు చేయాల్సి వచ్చిందని రిచా వెల్లడించింది.

Read more!

అలియా భట్, కియారా అద్వానీ ఇటీవలే పెళ్లి చేసుకున్నారు కాబ‌ట్టి సోనాక్షిని వివాహ ప్రణాళికల గురించి క‌పిల్ శ‌ర్మ అడిగాడు. సోనాక్షి సరదాగా మాట్లాడుతూ ''జలే పర్ నమక్ చిదక్ రహే హో'' అని అంది. అంటే తనకు పెళ్లి చేసుకోవ‌డం చాలా ఇష్టం అని చెప్పింది. ఈ వ్యాఖ్య‌ల అనంత‌రం సోనాక్షి తన స్నేహితుడైన జ‌హీర్ ఇక్బాల్ తో క‌లిసి ఉన్న ఫోటోలు వీడియోలు వైర‌ల్ అయ్యాయి. త్వ‌ర‌లోనే ఈ జంట పెళ్లాడుతోందంటూ హిందీ మీడియాలో ప్ర‌చారం మొద‌లైంది. ఇప్ప‌టికే దీనిపై జాతీయ మీడియాలో క‌థ‌నాలు వైర‌ల్ అవుతున్నాయి.

సోనాక్షి సిన్హా జహీర్ ఇక్బాల్‌తో డేటింగ్ చేస్తున్నట్టు జాతీయ మీడియాలో ఇప్ప‌టికే క‌థ‌నాలు వెలువ‌డ్డాయి. జహీర్ ఇక్బాల్ - సోనాక్షి సిన్హా సల్మాన్ ఖాన్ వ‌ల్ల‌ కలుసుకున్నట్లు సమాచారం. వారి స్నేహం ప్రేమగా వికసించింది. ప్రేమ పక్షులు తరచుగా కలిసి కనిపిస్తారు. వీరిద్దరూ కలిసి డబుల్ ఎక్స్‌ఎల్ చిత్రంలో నటించారు. దీనికి సత్రం రమణి దర్శకత్వం వహించారు. హుమా ఖురేషి కూడా కీలక పాత్రలో నటించారు. జహీర్ 2019లో సల్మాన్ ఖాన్ నిర్మించిన రొమాంటిక్ డ్రామా చిత్రం 'నోట్‌బుక్‌'తో బాలీవుడ్‌లోకి అడుగుపెట్టాడు. ఈ చిత్రంలో అతడు దివంగత లెజెండరీ నటి నూతన్ మనవరాలు ప్రనూతన్ బహల్ సరసన నటించాడు.

4

మ‌రోవైపు సోనాక్షి 'హీరామండి'లో తన పాత్రకు మంచి సమీక్షలను అందుకుంది. హీరమండిలో సోనాక్షి సిన్హా విల‌న్‌ పాత్ర పోషించింది. అద్భుతమైన అమ్మాయి.. తెలివిగలది ..వ్యంగ్యంగా ఉంటుంది. ఆమె ఎవరికీ భయపడదు. తన దివంగత తల్లికి న్యాయం చేయడం కోసం ఒంటరిగా పోరాడుతుంది. దాని కోసం దుర్మార్గాల మార్గంలో నడవడానికి కూడా సంకోచించ‌దు. చివరికి మహిళలు కేవలం తవైఫ్‌ల కంటే చాలా ఎక్కువ. ఆశయం వారి శాశ్వతమైన సహచరుడు.. వారు తమ అందాన్ని ఆయుధంగా ఉపయోగించుకుని పురుషులను తమ మంచాలలోకి లాగుతారు . సరైన సమయం వచ్చినప్పుడు వారిని శక్తిహీనులుగా చేస్తారు.. అనేది త‌న పాత్ర తీరుతెన్నుల‌ను ప్ర‌ద‌ర్శిస్తుంది. సోనాక్షి న‌ట‌న‌ను సీనియ‌ర్ న‌టి రేఖ ఎంత‌గానో ప్ర‌శంసించారు. ఇండ‌స్ట్రీలోని ప‌లువురు స‌హ‌చ‌రులు స‌హా ప్ర‌జ‌లు ఈ పాత్ర‌ను ప్ర‌శంసిస్తున్నారు.

Tags:    

Similar News