జటాధార టీజర్: అందాల రాక్షసితో సుధీర్ బాబు బిగ్ ఫైట్!
టాలీవుడ్‌లోని యువ హీరో సుధీర్ బాబు తన సినిమాల ఎంపికతో ఎప్పటికప్పుడు నూతన ప్రయోగాలు చేస్తూ ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నారు.;
టాలీవుడ్‌లోని యువ హీరో సుధీర్ బాబు తన సినిమాల ఎంపికతో ఎప్పటికప్పుడు నూతన ప్రయోగాలు చేస్తూ ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నారు. లేటెస్ట్ గా, ఆయన ప్రధాన పాత్రలో తెరకెక్కుతున్న ‘జటాధార’ సినిమాపై ఆసక్తి మరింత పెరుగుతోంది. ఎప్పటికప్పుడు నూతన ప్రయోగాలు చేయడంలో ముందుండే సుధీర్ బాబు, ఈసారి మైథాలజికల్ హారర్ థ్రిల్లర్ జానర్ లో అడుగుపెట్టారు.
ఈ చిత్రంలో బాలీవుడ్ స్టార్ సోనాక్షి సిన్హా కూడా అందమైన రాక్షసి పాత్రతో తెలుగు తెరపై అరంగేట్రం చేయడం మరో హైలైట్ గా మారింది. ఇక ఈ సినిమా టీజర్ ను రెబల్ స్టార్ ప్రభాస్ విడుదల చేశారు. టీజర్ చూస్తే.. డైలాగ్స్ లేకున్నా విజువల్ గా కనువిందు చేసేలా ఉంది. మొదటి షాట్ నుంచే ఓ డివైన్ యాత్ర మొదలైనట్టు కనిపిస్తూ, భీకరమైన శక్తులు, ఊహించని ఫైట్స్, యూనివర్స్‌లోని పాతాళంలోని రాక్షసి, మానవత్వం మధ్య యుద్ధాన్ని టీజర్ ద్వారా చూపించారు.
అంతే కాకుండా, భయపెట్టే స్థాయిలో సోనాక్షి సిన్హా పాత్ర, మైథలాజికల్ పవర్‌తో కూడిన సుధీర్ బాబు లుక్ అద్భుతంగా ఆకట్టుకుంటున్నాయి. వెంకట్ కళ్యాణ్, అభిషేక్ జైస్వాల్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాలో సుధీర్ బాబు శివ భక్తుడిగా మంచి కోసం నిలబడే పాత్రలో కనిపిస్తారు. త్రిశూలం పట్టుకుని, ఆధ్యాత్మిక ముద్రతో శివుడి తత్వాన్ని ప్రతిబింబించేలా కనిపించడం ఇంటెన్సిటీని పెంచింది.
అలాగే సోనాక్షి సిన్హా మాత్రం నెగటివ్ పవర్‌గా, అగాధ చీకటి రూపంలో కనిపించి ఆశ్చర్యానికి గురిచేస్తోంది. ఈ పాత్రతో ఆమె పాత్ర దుమ్ము రేపడం ఖాయమని టీజర్ చూస్తే అర్థమవుతోంది. టీజర్ లోని ప్రతి ఫ్రేమ్‌లో గ్రాండ్‌గా ఉండే సెట్స్, అత్యాధునిక విజువల్ ఎఫెక్ట్స్, ఇంటెన్స్ బీజీఎం ఈ సినిమాకు స్పెషల్ హైప్ తీసుకువచ్చాయి. అలాగే పవర్‌ఫుల్ విజువల్స్‌తో ప్రేక్షకుల్ని మైమరిపించేలా ఉన్నది.
దైవ శక్తి, అసుర శక్తి మధ్య జరిగే యుద్ధాన్ని ఆధునిక గ్రాఫిక్స్, పవర్ఫుల్ స్కోర్‌తో చూపించడం ట్రెండింగ్ పాయింట్‌గా నిలిచింది. జీ స్టూడియోస్, ఉమేష్ కుమార్ బన్సల్, ప్రేరణ అరోరా నిర్మాణంలో వస్తున్న ఈ ప్యాన్ ఇండియా మూవీ ఇప్పుడు నేషనల్ లెవెల్‌లో పెద్ద హైప్ క్రియేట్ చేసింది. భారీ తారాగణం, టెక్నికల్ టీమ్‌తో నిర్మితమవుతున్న ఈ చిత్రం దేశవ్యాప్తంగా థియేటర్లలో విడుదలకు సిద్ధమవుతోంది. త్వరలోనే విడుదల తేది విషయంలో క్లారిటీ రానుంది.