ఆ రోజు స్మృతి మంధాన పెళ్లి.. అసలు నిజం చెప్పిన సోదరుడు..

టీమిండియా స్టార్ క్రికెటర్ స్మృతి మంధాన పెళ్లి వ్యవహారం ఇటీవల హాట్ టాపిక్ గా మారిన విషయం తెలిసిందే. నవంబర్ 23న జరగాల్సిన వివాహం ఆఖరి నిమిషంలో ఆగిపోవడం అందరినీ షాక్‌కు గురిచేసింది.;

Update: 2025-12-03 03:58 GMT

టీమిండియా స్టార్ క్రికెటర్ స్మృతి మంధాన పెళ్లి వ్యవహారం ఇటీవల హాట్ టాపిక్ గా మారిన విషయం తెలిసిందే. నవంబర్ 23న జరగాల్సిన వివాహం ఆఖరి నిమిషంలో ఆగిపోవడం అందరినీ షాక్‌కు గురిచేసింది. అయితే, మంగళవారం నుంచి సోషల్ మీడియాలో ఒక కొత్త వార్త చక్కర్లు కొడుతోంది. స్మృతి మంధాన, పలాష్ ముచ్చల్ డిసెంబర్ 7న పెళ్లి చేసుకోబోతున్నారని జోరుగా ప్రచారం జరుగుతోంది.

దీంతో ఫ్యాన్స్ మళ్లీ కన్ఫ్యూజన్‌లో పడ్డారు. అసలు ఈ కొత్త తేదీలో ఎంత నిజం ఉంది? పెళ్లి ఎప్పుడు జరుగుతుంది? అనే సందేహాలకు స్మృతి సోదరుడు శ్రవణ్ మంధాన చెక్ పెట్టారు. ఈ వార్తలపై శ్రవణ్ మంధాన స్పందిస్తూ, డిసెంబర్ 7న పెళ్లి జరుగుతుందనే ప్రచారంలో ఏమాత్రం నిజం లేదని తేల్చి చెప్పారు. "మాకు ఆ రూమర్స్ గురించి తెలియదు. ఇప్పటికైతే పెళ్లి ఇంకా వాయిదా పద్ధతిలోనే ఉంది. కొత్త తేదీని ఇంకా నిర్ణయించలేదు" అని ఆయన నేషనల్ మీడియాకు క్లారిటీ ఇచ్చారు. దీంతో సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న డేట్ కేవలం గాసిప్ మాత్రమే అని అర్థమైంది.

నిజానికి నవంబర్ 23న సాంగ్లీలో వీరి పెళ్లి జరగాల్సి ఉంది. కానీ పెళ్లి రోజు ఉదయమే స్మృతి మంధాన తండ్రి శ్రీనివాస్ మంధానకు తీవ్రమైన అనారోగ్య సమస్య రావడంతో హుటాహుటిన ఆసుపత్రికి తరలించారు. ఆ టెన్షన్, ఒత్తిడి తట్టుకోలేక వరుడు పలాష్ ముచ్చల్ కూడా అనారోగ్యానికి గురయ్యారు. ఆయనకు సెలైన్ ఎక్కించాల్సి వచ్చిందని, అందుకే పెళ్లిని వాయిదా వేశామని పలాష్ తల్లి గతంలోనే తెలిపారు. స్మృతి తండ్రి ఆరోగ్యం కుదుటపడ్డాకే తదుపరి నిర్ణయం ఉంటుందని సమాచారం.

అయితే, ఈ ఆరోగ్య సమస్యల వార్తల వెనుక మరో కోణం కూడా సోషల్ మీడియాలో వినిపిస్తోంది. స్మృతి మంధాన తన ఎంగేజ్‌మెంట్ ఫోటోలను, ప్రపోజల్ వీడియోను ఇన్‌స్టాగ్రామ్ నుంచి డిలీట్ చేయడం అనేక అనుమానాలకు తావిచ్చింది. పలాష్ ముచ్చల్ వేరే అమ్మాయితో చాటింగ్ చేశారంటూ కొన్ని స్క్రీన్ షాట్లు నెట్టింట వైరల్ అయ్యాయి. పెళ్లి ఆగిపోవడానికి ఈ 'చీటింగ్' ఆరోపణలే కారణమని నెటిజన్లు చర్చించుకుంటున్నారు. కానీ దీనిపై ఇద్దరిలో ఎవరూ స్పందించలేదు.

ఈ గందరగోళంలోకి పెళ్లి పనుల్లో ఉన్న ఇద్దరు కొరియోగ్రాఫర్లు నందిక ద్వివేది, గుల్నాజ్ ఖాన్‌లను కూడా నెటిజన్లు లాగారు. పలాష్‌తో లింక్ పెడుతూ రూమర్స్ క్రియేట్ చేశారు. దీనిపై ఆ కొరియోగ్రాఫర్లు తీవ్రంగా స్పందించారు. ఇవన్నీ కల్పితాలని, తమపై బురద చల్లొద్దని విజ్ఞప్తి చేశారు. పలాష్ తల్లి కూడా ఈ రూమర్స్‌ను ఖండించారు. తన కొడుకే పెళ్లి వాయిదా వేయమని కోరాడని, స్మృతి తండ్రి ఆరోగ్యం ముఖ్యమని చెప్పాడని ఆమె గుర్తుచేశారు. ఇంత జరుగుతున్నా స్మృతి మంధాన గానీ, పలాష్ ముచ్చల్ గానీ ఈ చీటింగ్ రూమర్స్‌పై ఎలాంటి అధికారిక ప్రకటన చేయలేదు. ఏది ఏమైనా, డిసెంబర్ 7న పెళ్లి లేదని మాత్రం క్లారిటీ వచ్చింది.

Tags:    

Similar News