స్మృతి మందానకు స్టేడియంలో ఊహించ‌ని స‌ర్‌ఫ్రైజ్

క్రికెట్- సంగీతం క‌ల‌యిక ఇది. మ‌హిళా క్రికెట్ ప్ర‌పంచంలో జ‌గ‌జ్జేత‌గా నిలిచిన టీమిండియా స‌భ్యురాలిగా స్మృతి మంధాన ఎప్ప‌టికీ ఈ విక్ట‌రీని సెల‌బ్రేట్ చేసుకుంటూనే ఉంది.;

Update: 2025-11-21 13:45 GMT

క్రికెట్- సంగీతం క‌ల‌యిక ఇది. మ‌హిళా క్రికెట్ ప్ర‌పంచంలో జ‌గ‌జ్జేత‌గా నిలిచిన టీమిండియా స‌భ్యురాలిగా స్మృతి మంధాన ఎప్ప‌టికీ ఈ విక్ట‌రీని సెల‌బ్రేట్ చేసుకుంటూనే ఉంది. త‌న ఆనందాన్ని జాయ్ ని ఈరోజు డ‌బుల్ ధ‌మాకా ట్రీట్ గా మార్చింది. సంగీత స్వ‌ర‌క‌ర్త ప‌లాష్ ముచ్చ‌ల్ ను స్మృతి పెళ్లి చేసుకోవ‌డానికి ఇంకో 24గంట‌ల స‌మ‌య‌మే మిగిలి ఉంది. 23 న‌వంబ‌ర్ వెడ్ లాక్ డేట్. ఇప్ప‌టికే హ‌ల్దీ వేడుక‌ల్లో ఈ జంట నృత్యాల‌కు సంబంధించిన ఫోటోలు వీడియోలు ఇంట‌ర్నెట్ లో సునామీలా మారాయి.

పెళ్లి ఇంట సంబ‌రాలు ఆకాశాన్నంటుతున్నాయి. కుటుంబ స‌భ్యులు, బంధుమిత్రులతో ఒక‌టే సంద‌డే సంద‌డి. ముఖ్యంగా హ‌ల్దీ కోసం డాన్స్ ఫ్లోర్‌లో స్మృతితో పాటు షఫాలీ వర్మ, రిచా ఘోష్, శ్రేయాంక పాటిల్, రేణుకా సింగ్, శివాలి షిండే, రాధా యాదవ్, జెమిమా రోడ్రిగ్స్ పండుగ థీమ్ ప్ర‌కారం షైనీ ఎల్లో క‌ల‌ర్ దుస్తులను ధరించారు. అంద‌మైన పెళ్లి మూడ్ కి త‌గ్గ‌ట్టే బాణీల‌కు నృత్యం చేస్తూ క‌నిపించారు.

స్మృతి మంధాన గురువారం పలాష్ ముచ్చల్ తో తన నిశ్చితార్థాన్ని సరదాగా ఫ‌న్ ఎలివేష‌న్ తో సాగిన తీరును రివీల్ చేసింది. టీమిండియా సహచరులతో కలిసి ఉల్లాసంగా నృత్యం చేసిన ఇన్‌స్టాగ్రామ్ రీల్‌ను షేర్ చేయ‌గా అది వైర‌ల్ గాఆరింది. ల‌గే రహో మున్నా భాయ్ (2006) లోని క్లాసిక్ బాలీవుడ్ పాట ``సమ్ఝో హో హి గయా``కి అనుగుణంగా నృత్యానికి సంబంధించిన వీడియో ఇంట‌ర్నెట్‌లో వైర‌ల్ గా మారింది. జెమిమా, శ్రేయాంక, రాధ, అరుంధతి త‌దిత‌రులు వెన్యూలో సంద‌డి చేసారు.

ఈ ప్ర‌పోజ‌ల్ అద్భుతం:

మ‌రోవైపు స్మృతి మందాన‌కు ప‌లాష్ ముచ్చ‌ల్ ప్ర‌పోజ్ చేసిన ఒక అంద‌మైన వీడియో ఇంట‌ర్నెట్ లో వైర‌ల్ గా మారుతోంది. అత‌డు త‌న కాబోయే భార్య‌ ప్ర‌పంచ క‌ప్ మ్యాచ్ ఆడిన ఆట‌స్థ‌లంలోనే ప్ర‌పోజ్ చేయ‌డం అంద‌రినీ ఆశ్చ‌ర్య‌ప‌రిచింది. అత‌డు స్మృతి మంద‌న క‌ళ్ల‌కు గంత‌లు క‌ట్టాడు. నేరుగా ఆట‌స్థ‌లం మ‌ధ్య‌లోకి తీసుకుని వెళ్లాడు. అక్క‌డ క‌ళ్ల‌కు గంత‌లు తీసి, త‌న చేతి వేలికి ఉంగ‌రం తొడిగాడు. అంద‌మైన జంట ఒక‌రికొక‌రు ప్రేమ కానుక‌లైన ఉంగ‌రాల‌ను మార్చుకున్నారు.

మహిళల మహారాష్ట్ర ప్రీమియర్ లీగ్‌లో రత్నగిరి జెట్స్ తరపున స్మృతి మంధానతో కలిసి ఆడుతున్న షిండే కూడా వేడుకకు ఒక ప్రత్యేకమైన ఆకర్షణను జోడించింది. శ్రేయంక కూడా వేడుక‌లో ఉన్నారు. ప్రపంచ కప్ ఛాంపియన్లు షఫాలి, రాధ, రిచా, రేణుక, జెమిమా కూడా ఈ వేడుక‌ల్లో పాల్గొన్నారు.

ఆట‌లో మెరుపులే:

మహిళల ప్రపంచ కప్‌లో మందాన తొమ్మిది ఇన్నింగ్స్‌లలో 434 పరుగులు చేసి అత్యుత్తమ ప్రదర్శనతో ఆక‌ట్టుకుంది. ఒక‌ టోర్నమెంట్‌లో ఏ ఇత‌ర‌ భారతీయ మ‌హిళా క్రికెట‌ర్ ఇన్ని ప‌రుగులు చేయ‌లేదు. 99.08 స్ట్రైక్ రేట్‌తో 54.25 సగటును కొనసాగించింది. టోర్నీలో అద్భుమైన సెంచరీ (109), రెండు హాఫ్ సెంచరీలు ఉన్నాయి. చివరి మ్యాచ్‌లో, స్థిరమైన ఇన్నింగ్స్ ఆడి 58 బంతుల్లో 45 పరుగులు చేసి కీల‌కమైన పునాది వేసి భారతదేశం టైటిల్ గెలుచుకోవ‌డానికి స‌హ‌క‌రించింది.



Tags:    

Similar News