పెళ్లిలో స్మృతి మందన-పలాష్ ఆనంద డోలికలు
భారత మహిళా క్రికెట్ జట్టు వైస్-కెప్టెన్ స్మృతి మంధాన- సంగీత దర్శకుడు పలాష్ ముచ్చల్ ఈ ఆదివారం నాడు వివాహం చేసుకోనున్నారు.;
భారత మహిళా క్రికెట్ జట్టు వైస్-కెప్టెన్ స్మృతి మంధాన- సంగీత దర్శకుడు పలాష్ ముచ్చల్ ఈ ఆదివారం నాడు వివాహం చేసుకోనున్నారు. వివాహ వేడుకలు నవంబర్ 21న హల్ది వేడుకతో ప్రారంభమయ్యాయి. ఆ తర్వాత 22 నవంబర్ 2025 శనివారం మెహందీ, సంగీత వేడుకలు జరిగాయి. వివాహానికి ముందు వేడుకల సందర్భంగా జంట వేదికపై కలిసి నృత్యం చేస్తున్న ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. స్మృతి - పలాష్ సలాం-ఎ-ఇష్క్ చిత్రంలోని పాపులర్ సాంగ్ `తేను లే కే మై జవాంగా`కి నృత్యం చేస్తూ కనిపించారు. ససురల్ మై జావాంగి పాట నేపథ్యంలో ప్లే అవుతుండగా, స్మృతి పలాష్ మెడలో దండను వేస్తున్న వీడియో ఆకట్టుకుంది.
తరువాత పలాష్- స్మృతి డ్యాన్స్ ఫ్లోర్ లోకి వెళ్లారు. స్మృతి ప్రదర్శన అభిమానులను ఆశ్చర్యపరుస్తుంది. నెలిజనులు ఈ జంటను `ఎప్పటికీ అందమైన జంట` అని ప్రశంసిస్తున్నారు. అలాగే సంగీత్ వేడుకలో భారత మహిళా క్రికెట్ టీమ్ సభ్యులు స్మృతి కోసం గ్రూప్ డ్యాన్స్ చేసిన వీడియోలు వైరల్ అయ్యాయి. వారంతా సోను కే టిటు కి స్వీటీ చిత్రం నుండి `తేరా యార్ హూన్ మై`కి నృత్యం చేశారు. క్రికెటర్ శ్రేయాంక పాటిల్ షేర్ చేసిన ఫోటోలలో ఆజాద్ చిత్రం నుండి ఉయ్ అమ్మా పాటలపై గ్రూప్ డ్యాన్స్ ఆకట్టుకుంది.
మొత్తానికి పెళ్లి సందడి పీక్స్ కి చేరుకుంది. అంతకుముందు స్మృతి మంధాన తన ఇన్‌స్టాగ్రామ్ హ్యాండిల్‌లో బాలీవుడ్ పాట `సమ్‌జో హో హి గయా`కి డ్యాన్స్ చేస్తున్న వీడియోను షేర్ చేసింది. ప్రస్తుతం పెళ్లి ఇంట సంబరాలు అంబరాన్నంటుతున్నాయి.
ఇంటర్నెట్ లో ఈ అందమైన జంటకు శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి. చాలా మంది క్రికెట్ అభిమానులు స్మృతి మందన లైఫ్ జాయ్ ఫుల్ గా ఉండాలని బ్లెస్ చేస్తున్నారు. తదుపరి క్రికెట్ లో రాణిస్తూనే, పలాష్ తో బంధాన్ని అపురూపంగా మలుచుకోవాలని సూచిస్తున్నారు.