అప్పట్లో ప్రకాష్ రాజ్ అంతలా బతిమాలారా?.. శివకృష్ణ ఏం చెప్పారంటే?

శివకృష్ణ చెప్పిన వివరాల ప్రకారం.. గతంలో ప్రకాష్ రాజ్ ఒక వర్గాన్ని ఉద్దేశించి చేసిన వ్యాఖ్యలపై సినీ ఇండస్ట్రీలో అభ్యంతరాలు వ్యక్తమయ్యాయి.

Update: 2026-07-08 05:48 GMT

సీనియర్ యాక్టర్ ప్రకాష్ రాజ్ రీసెంట్ గా కొన్ని రోజులుగా చేస్తున్న వ్యాఖ్యలు చర్చకు దారి తీసిన వేళ.. సీనియర్ నటుడు శివకృష్ణ చేసిన కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్‌ గా మారాయి. గతంలో ఓసారి మాట్లాడిన శివకృష్ణ.. ప్రకాష్ రాజ్‌ తో గతంలో జరిగిన ఓ ఘటనను గుర్తు చేస్తూ ఆసక్తికర విషయాలు వెల్లడించారు. ప్రస్తుతం వాటిపైనే సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది.

శివకృష్ణ చెప్పిన వివరాల ప్రకారం.. గతంలో ప్రకాష్ రాజ్ ఒక వర్గాన్ని ఉద్దేశించి చేసిన వ్యాఖ్యలపై సినీ ఇండస్ట్రీలో అభ్యంతరాలు వ్యక్తమయ్యాయి. ఆ వ్యాఖ్యలు వివాదానికి దారితీయడంతో పెద్దలు సమావేశమై ఆయనపై చర్యలు తీసుకోవాలని నిర్ణయించినట్లు తెలిపారు. ఆ సమయంలో పరిశ్రమలోని పలువురు ప్రముఖులు కూడా ఆ నిర్ణయానికి మద్దతు తెలిపారని శివకృష్ణ పేర్కొన్నారు. ఆ ఘటన తర్వాత ప్రకాష్ రాజ్ స్వయంగా తన ఇంటికి వచ్చి సమస్యను పరిష్కరించాలని కోరారని శివకృష్ణ తెలిపారు.

తనపై విధించిన బ్యాన్ తొలగించాలని వేడుకున్నారని, అంతా సెట్ అయిన తర్వాత మళ్లీ సినిమాల్లో కొనసాగారని చెప్పారు. అదే విషయాన్ని గుర్తు చేస్తూ.. అప్పట్లో అంతలా దిగివచ్చిన వ్యక్తి ఇప్పుడు మళ్లీ వివాదాస్పద వ్యాఖ్యలు చేయడం ఆశ్చర్యంగా ఉందని వ్యాఖ్యానించారు. ఇటీవలి కాలంలో కూడా హిందూ మతం, సనాతన ధర్మం వంటి అంశాలపై ప్రకాష్ రాజ్ చేస్తున్న వ్యాఖ్యలపై తనకు అభ్యంతరం ఉందని శివకృష్ణ స్పష్టం చేశారు. మత విశ్వాసాలను దెబ్బతీసేలా ఎవరూ మాట్లాడకూడదని, అలాంటి వ్యాఖ్యలు ఇండస్ట్రీ కూడా తేలికగా తీసుకోకూడదని అభిప్రాయపడ్డారు.

అవసరమైతే చర్యలు తీసుకోవాలని సూచించారు. ప్రకాష్ రాజ్ మాత్రం చాలా కాలంగా సామాజిక, రాజకీయ అంశాలపై తన అభిప్రాయాలను బహిరంగంగా వ్యక్తం చేస్తున్నారు. వివిధ అంశాలపై సోషల్ మీడియా వేదికగా స్పందిస్తూ వస్తున్నారు. ఆయన చేసిన కొన్ని వ్యాఖ్యలు గతంలో కూడా వివాదాలకు దారితీయగా.. వాటిపై రకరకాల అభిప్రాయాలు వ్యక్తమయ్యాయి. కొందరు ఆయన ఫ్రీడమ్ ను సమర్థిస్తే.. మరికొందరు తీవ్రంగా విమర్శించారు.

ఇటీవల కూడా కొన్ని రాజకీయ పరిణామాలపై ప్రకాష్ రాజ్ స్పందించిన నేపథ్యంలో.. శివకృష్ణ చేసిన పాత వీడియో మళ్లీ వైరల్ అయింది. ఆ వీడియోలో ప్రకాష్ రాజ్‌ పై ఆయన చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు చర్చనీయాంశంగా మారాయి. ముఖ్యంగా గతంలో ఆయనపై చర్యలు తీసుకోవాలని నిర్ణయం తీసుకున్నారని, ఆ తర్వాత ప్రకాష్ రాజ్ తన వద్దకు వచ్చి సమస్యను పరిష్కరించాలని కోరారని శివకృష్ణ చేసిన కామెంట్స్ సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి.

అయితే ఆ కామెంట్స్ శివకృష్ణ వ్యక్తిగత అభిప్రాయాన్ని గుర్తుంచుకోవాలి. గతంలో జరిగిన ఘటనలపై అధికారిక సమాచారం లేదు. అలాగే ఆ అంశంపై ప్రకాష్ రాజ్ నుంచి లేటెస్ట్ రెస్పాన్స్ కూడా రాలేదు. ఏదేమైనా ప్రకాష్ రాజ్ కామెంట్స్ నేపథ్యంలో శివకృష్ణ గతంలో చేసిన కామెంట్స్ మళ్లీ వైరల్ అవ్వడం, వాటిపై సోషల్ మీడియాలో చర్చ సాగడం ఆసక్తికరంగా మారింది. ఆ వివాదంపై ప్రకాష్ రాజ్ స్పందిస్తారా? లేక చర్చ అలాగే కొనసాగుతుందా? అన్నది చూడాలి.

Tags:    

Similar News