పొంగల్ రేసులో కాలు దువ్వుతున్న తమిళ్ సినిమా.. బాగానే ధైర్యం చేస్తున్నారుగా

ఈసారి సంక్రాంతి పోటీ మామూలుగా లేదు. ఇప్పటికే పెద్ద పెద్ద సినిమాలు పొంగల్ టార్గెట్ గా రూపుదిద్దుకుంటున్నాయి.;

Update: 2025-08-26 16:55 GMT

ఈసారి సంక్రాంతి పోటీ మామూలుగా లేదు. ఇప్పటికే పెద్ద పెద్ద సినిమాలు పొంగల్ టార్గెట్ గా రూపుదిద్దుకుంటున్నాయి. లిస్ట్ లో చిరంజీవి చిరంజీవి మన వర ప్రసాద్ గారు, పాన్ఇండియా స్టార్ ప్రభాస్ ది రాజా సాబ్, మాస్ మహారాజ రవితేజ 77, నవీన్ పోలిశెట్టి అనగనగా ఒక రాజు పోటీలో ఉన్నాయి. దీంతో థియేటర్ల అడ్వస్ట్ మెంట్ కష్టంగా మారుతుంది. ఈ తెలుగు సినిమాలతోపాటు డబ్బింగ్ సినిమా విజయ్ దళపకి జననాయగన్ కూడా సంక్రాంతి పోటీలో ఉంది.

ఇందులో ఏ సినిమా కూడా వెనక్కి తగ్గే సంకేతాలు కనిపించడం లేదు. ఈ పోటీ డిస్ట్రిబ్యూటర్ల కు టెన్షన్ రేపుతుంది. ఇదిలా ఉండగా, ఇప్పుడు మరో సినిమా రేస్ లోకి వచ్చింది. ఈ టఫ్ కాంపిటీషన్ లో కోలీవుడ్ స్టార్ శివ కార్తికేయన్ హీరోగా తెరకెక్కిన పరాశక్తిని రేస్ లో నిలపాలనుకోవడం సాహసమనే చెప్పాలి. సుధా కొంగర ఈ సినిమాను పీరియాడికల్ డ్రామాగా తెరకెక్కించారు. అయితే కంటెంట్ పై నమ్మకంతో ఆమె కూడా సంక్రాంతి అడ్వాంటేజ్ మిస్ అవ్వకూడదని అనుకుంటున్నారు.

ఈ నేపథ్యంలోనే సినిమాను పొంగల్ కు తీసుకొచ్చేందుకు నిర్మాతను ఒప్పించారట. ఈ సినిమాతో శ్రీలీల హీరోయిన్ గా కోలీవుడ్ కు పరిచయమవుతోంది. అథర్వా, రవి మోహన్ కీలక పాత్రల్లో కనిపించనున్నారు. కొన్ని దశాబ్దాల కిందట జరిగిన హిందీ వ్యతిరేక ఉద్యమం రోజుల నాటి పరిణామాల నేపథ్యంలో ఇది తెరకెక్కింది. అందుకే ఇది వివాదం అవుతుందనే ఉద్దేశంతో హీరో సూర్య ఈ ప్రాజెక్ట్ వదులుకున్నారు. అందుకే పరాశక్తి సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి.

ఇన్ని సినిమాలు సంక్రాంతిపైనే కన్నేయడం వల్ల చాలా రిస్కులున్నాయి. మరీ ముఖ్యంగా రాజాసాబ్ సినిమాకు తమిళనాడులో కావాల్సినన్ని థియేటర్లు లభించడం కష్టమవుతుంది. మరోవైపు జననాయగన్ కు, పరాశక్తికి సినిమాకు ఏపీ తెలంగాణలో స్క్రీన్లు దక్కించుకోవడం కూడా అంత ఈజీగా ఉండదు. మిగిలినవి పాన్ఇండియా సినిమాలు కాదు. అందుకే ఇబ్బందేం లేదు. అయితే ఇలా ఇన్ని సినిమాలు క్లాష్ అవ్వడం వల్ల ఓపెనింగ్స్ పై ఎఫెక్ట్ అయ్యే ఛాన్స్ ఉంది. ఎక్కువలో ఎక్కువ మూడు సినిమాలకే మంచి వసూళ్లు సాధించేందుకు స్కోప్ ఉంటుంది. కానీ. ఇలా నాలుగు స్ట్రైట్ తెలుగు, రెండు డబ్బింగ్ సినిమాలు సంక్రాంతి రావడం వల్ల థియేటర్లు అడ్జెస్ట్ కష్టంగా మారుతుంది.

Tags:    

Similar News