సింగీతం 'సింగ్ గీతం'.. ఆ ఒక్క రోజు లేట్ మంచిదేనా?
ఇక కథ విషయానికి వస్తే.. ఓ గ్రామంలో ప్రజలకు ఎదురయ్యే వింత సమస్య చుట్టూ సినిమా తిరుగుతుంది. అనూహ్య పరిణామాల తర్వాత ఆ ఊరి ప్రజల సాధారణ మాటలన్నీ పాటలుగా మారిపోతాయి.
సింగీతం శ్రీనివాసరావు అంటే ప్రయోగాలకు పెట్టింది పేరు అని చెప్పడంలో డౌట్ అక్కర్లేదు. కమల్ హాసన్ తో పుష్పక విమానం, బాలకృష్ణతో ఆదిత్య 369 వంటి కల్ట్ క్లాసిక్స్ అందించిన ఆయన.. ఇప్పుడు సింగ్ గీతం మూవీతో మరోసారి ప్రేక్షకుల ముందుకు వస్తున్నారు. అయితే జూన్ 11న విడుదల కావాల్సిన ఆ మూవీ ఇప్పుడు జూన్ 12న థియేటర్లలోకి రానుంది. కేవలం ఒక్క రోజు వాయిదా పడింది.
అయితే వాయిదా అనగానే ఏదో సమస్య వచ్చిందేమో, ఫైనాన్షియల్ ఇబ్బందులేమైనా ఉన్నాయేమో అనే డౌట్స్ వస్తాయి. కానీ సింగ్ గీతం విషయంలో అలాంటిదేమీ లేదు. కథలో కీలకమైన సీజీఐ, విజువల్ ఎఫెక్ట్స్ పనులను మరింత బెస్ట్ గా తీర్చిదిద్దేందుకు నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించారు. ఫాంటసీ, సూపర్ నేచురల్ ఎలిమెంట్స్ తో రూపొందిన ఆ సినిమాలో విజువల్స్ కథను నడిపిస్తాయట.
అందుకే ఫైనల్ అవుట్ పుట్ లో రాజీ పడకుండా, ప్రేక్షకులకు బెస్ట్ ఎక్స్పీరియన్స్ అందించాలనే ఉద్దేశంతో ఒక రోజు సమయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే సెన్సార్ బోర్డు మూవీ క్లీన్ యూ సర్టిఫికెట్ జారీ చేసింది. అంటే ఫ్యామిలీతో కలిసి చూసేలా ఉండబోతుందన్న మాట. వైజయంతి మూవీస్, స్వప్న సినిమా బ్యానర్లపై నాగ్ అశ్విన్ నిర్మించిన ఆ చిత్రంలో అయాన్, అహల్య, శాలిని కొండెపూడి లీడ్ రోల్స్ లో నటించారు. దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందించారు.
ఇక కథ విషయానికి వస్తే.. ఓ గ్రామంలో ప్రజలకు ఎదురయ్యే వింత సమస్య చుట్టూ సినిమా తిరుగుతుంది. అనూహ్య పరిణామాల తర్వాత ఆ ఊరి ప్రజల సాధారణ మాటలన్నీ పాటలుగా మారిపోతాయి. మాట్లాడాలన్నా పాటే, కోపం వచ్చినా పాటే, బాధ చెప్పుకున్నా పాటే. దీంతో గ్రామస్తులు ఎదుర్కొనే గందరగోళం, ఆ పరిస్థితికి కారణం ఏమిటి? దాని నుంచి ఎలా బయటపడ్డారు? అనే అంశాలను ఫన్నీగా చూపించనున్నారని తెలుస్తోంది.
అయితే బాక్సాఫీస్ యాంగిల్ లో చూసినా ఒక్క రోజు పోస్ట్ పోనే చేయడం వల్ల పెద్దగా నష్టమేమీ చేసేలా కనిపించడం లేదు. ప్రస్తుతం పెద్ది థియేటర్లలో ఉన్నప్పటికీ కొత్తగా భారీ పోటీ ఇచ్చే సినిమాలు లేకపోవడం సింగ్ గీతం మూవీకి కలిసి వచ్చే అంశం. ముఖ్యంగా ఫ్యామిలీ ఆడియన్స్ ను ఆకట్టుకునే కంటెంట్ ఉంటే, మంచి టాక్ తో వసూళ్లు పెరిగే అవకాశం ఉంది.
అందుకే ఆ ఒక్క రోజు ఆలస్యాన్ని నెగెటివ్ గా కాకుండా, క్వాలిటీ కోసం తీసుకున్న నిర్ణయంగా చూడొచ్చు. ప్రేక్షకులను ఓ కొత్త ప్రపంచంలోకి తీసుకెళ్లే ఫాంటసీ కథకు విజువల్స్ ప్రాణం. అలాంటప్పుడు ఫైనల్ టచ్ కోసం 24 గంటలు వెయిట్ చేయడం తప్పేమీ కాదు. పైగా సింగీతం లాంటి డైరెక్టర్ తన సినిమాను ఎలాంటి రాజీ లేకుండా అందించాలని అనుకోవడం కామనే.
ఫైనల్ గా చెప్పాలంటే.. సింగ్ గీతం మూవీ ఒక్క రోజు వాయిదా అభిమానులను కాస్త నిరాశపరిచినా, సినిమా అవుట్ పుట్ మరింత బెస్ట్ గా ఉంటే అది మంచి నిర్ణయమే అవుతుంది. ఇప్పుడు అందరి చూపు జూన్ 12పైనే ఉంది. సింగీతం మ్యాజిక్ మరోసారి పని చేస్తుందా? గ్రామం మొత్తం పాటల్లో మాట్లాడే ఆ వినూత్న కథ ప్రేక్షకుల ఆకట్టుకుంటుందా? అన్నది థియేటర్లలోనే తేలనుంది.