చేతిలో మైక్ ఉందని ఇబ్బంది పెట్టేస్తారా? లేడీ జర్నలిస్ట్‌పై సిద్ధూ ఫైర్
ఈవెంట్ లోనే ఆ లేడీ జర్నలిస్ట్ కు ఇది నా పర్సనల్ ఇంటర్వ్యూనా? సినిమా ఇంటర్వ్యూనా అని కౌంటర్ ఇవ్వగా, తెలుసు కదా ప్రమోషన్స్ లో మరోసారి ఈ టాపిక్ పై ప్రస్తావన రాగా దానికి సిద్దూ రెస్పాండ్ అవుతూ ఫైర్ అయ్యారు.;
ఈ మధ్య తెలుగు సినీ జర్నలిస్టులు హద్దులు మితిమీరి ప్రవర్తిస్తూ సెలబ్రిటీలను ఇబ్బంది పెట్టే ప్రశ్నలు అడుగుతున్నారు. రీసెంట్ గా తెలుసు కదా ట్రైలర్ లాంచ్ ఈవెంట్ లో సిద్దు జొన్నలగడ్డని ఓ లేడీ జర్నలిస్ట్ మీరు సినిమాలో లాగానే బయట కూడా ఉమెనైజరా అంటూ ప్రశ్నించగా, సిద్ధూతో పాటూ ఒక్కసారిగా అక్కడున్న వాళ్లంతా షాకయ్యారు.
అలా మాట్లాడటం కరెక్ట్ కాదు
ఈవెంట్ లోనే ఆ లేడీ జర్నలిస్ట్ కు ఇది నా పర్సనల్ ఇంటర్వ్యూనా? సినిమా ఇంటర్వ్యూనా అని కౌంటర్ ఇవ్వగా, తెలుసు కదా ప్రమోషన్స్ లో మరోసారి ఈ టాపిక్ పై ప్రస్తావన రాగా దానికి సిద్దూ రెస్పాండ్ అవుతూ ఫైర్ అయ్యారు. ఆమె అలా మాట్లాడటం ఎంతో అగౌరవమని, మైక్ ఉంది కదా అని అలా మాట్లాడటం కరెక్ట్ కాదని, అలా తప్పుగా మాట్లాడటమే కాకుండా నవ్వుతున్నారని, అలాంటి దానికి తానేం సమాధానమిస్తానని, అందుకే అవాయిడ్ చేశానని సిద్ధు చెప్పుకొచ్చారు.
అలాంటివి పట్టించుకోను
హీరో సినిమాలో పోలీస్ అయితే బయట కూడా పోలీస్ గా చేస్తారా? సినిమాకీ బయటకీ తేడా తెలీదా? మన చేతిలో మైక్ ఉందని, స్టేజ్ పైన ఉన్న వాళ్లను అలా అనడం కరెక్ట్ కాదని, ఈ విషయం వాళ్లకు వాళ్లు రియలైజ్ అవాలని, తనను ఆ ప్రశ్న అడిగిన ఆమె ఎవరో కూడా తనకు తెలీదని,ఈవెంట్ కు ముందు పద్ధతిగా తనను ఇంటర్వ్యూ ఇవ్వమని అడిగిందని, కానీ మైక్ చేతికి రాగానే మారిపోయిందని, ఇది మంచి వాతావరణం కానే కాదని, అయినా ఈ విషయం తనను కాకుండా, అలాంటి మాటలు అనేవాళ్లను ఎందుకు అన్నారో అడగమని చెప్తూ, తాను ఇవేమీ పట్టించుకుని వాటికి అటెన్షన్ ఇవ్వనని, ఏదో ఒక రోజు వాళ్లే తాము చేసింది తప్పని రియలైజ్ అవుతారని సిద్దు చెప్పారు.
లేడీ జర్నలిస్ట్ ను తప్పుబడుతున్న నెటిజన్లు
సీనియర్ జర్నలిస్టులంతా మర్యాదగా ఉంటున్నారని, కానీ వీళ్లు మాత్రం ఇలా ఉంటున్నారని, తన వరకు తాను అందరితో బావుండాలని కోరుకుంటానని, అదే లేడీ జర్నలిస్ట్ ప్రదీప్ రంగనాథన్ ను కూడా ఏదో అడిగారు, ఇష్యూ అయిందని చూశానని, అలాంటి వాటి మీద ఆలోచించడం కూడా వేస్ట్ అని, ఇలాంటి ప్రశ్నలు అడగడం వల్ల తానేమీ ఫీలవనని, తాను చాలా స్ట్రాంగ్ అని సిద్దూ క్లారిటీ ఇచ్చారు. అయితే రీసెంట్ గా జరిగిన డ్యూడ్ ప్రెస్ మీట్ లో అదే లేడీ జర్నలిస్ట్ ప్రదీప్ ను మీరు లుక్ పరంగా హీరో మెటీరియల్ కాదు అని అనగా, కిరణ్ అబ్బవరం కె ర్యాంప్ ప్రెస్ మీట్ లో కూడా దాని ప్రస్తావన తీసుకురాగా, మనం మనం ఏమనుకున్నా పర్లేదని, కానీ బయట ఇండస్ట్రీ నుంచి వచ్చిన వాళ్లను గౌరవించమని చివాట్లు పెట్టాడు కిరణ్. ఈ విషయంలో సదరు లేడీ జర్నలిస్టును తప్పుబడుతూ నెటిజన్లు ఆమెపై తెగ కోప్పడుతూ కామెంట్స్ చేస్తున్నారు.