సిద్ధు చెప్పిన ఇంటర్వెల్ స్టోరీ.. పాప్ కార్న్ పంచాయితీ కోసం..!
యువ హీరో స్టార్ బాయ్ సిద్ధు జొన్నలగడ్డ లేటెస్ట్ గా తెలుసు కదా సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు.;
యువ హీరో స్టార్ బాయ్ సిద్ధు జొన్నలగడ్డ లేటెస్ట్ గా తెలుసు కదా సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. నీరజ కోన డైరెక్ట్ చేసిన ఈ సినిమాలో శ్రీనిధి శెట్టి, రాశి ఖన్నా హీరోయిన్స్ గా నటించారు. ఈ సినిమా చూసిన చాలా మందికి ఇది ఒక లేడీ డైరెక్టర్ రాసిన కథా అని షాక్ అవుతున్నారు. మగాళ్ల గురించి వాళ్ల ప్రేమ గురించి నీరజ కోన బాగానే రీసెర్చ్ చేసినట్టు అనిపిస్తుంది. ఇక తెలుసు కదా శుక్రవారం రిలీజై మిశ్రమ స్పందనతో కొనసాగుతుంది.
పాప్ కార్న్ పంచాయితీ కోసం ఇంటర్వెల్..
ఐతే ఈ సినిమా ప్రమోషనల్ ఇంటర్వ్యూస్ లో సిద్ధు జొన్నలగడ్డ ఇంటర్వెల్ బ్యాక్ స్టోరీ గురించి చెప్పాడు. హాలీవుడ్ సినిమాల్లో అసలు ఇంటర్వెల్ ఉండదు కానీ మన దగ్గర మాత్రం పాప్ కార్న్ పంచాయితీ కోసం ఇంటర్వెల్ పెట్టారని అన్నాడు. అంతేకాదు సినిమా కొంతమందికి ఫస్ట్ హాఫ్ బాగుంటుంది.. మరికొంతమందికి సెకండ్ హాఫ్ బాగుంటుంది. ఐతే అలా చూస్తే ఫస్ట్ హాఫ్, సెకండ్ హాఫ్ రెండు వర్క్ అవుట్ అయినట్టే అని అన్నారు.
అంతేకాదు సెకండ్ హాఫ్ ప్రతి సినిమా కిందకు పడిపోతుందని.. ఐతే మేకర్ గా అది ఎక్కడ పడుతుంది అన్నది నీకు అర్ధమవ్వాలని అన్నారు. ఒకే రేంజ్ లో తీసుకెళ్లినా మొనాటనీ వచ్చేస్తుందని అన్నారు. హాలీవుడ్ సినిమాల్లో ఇంటర్వెల్ ఉండదు. కానీ మన సినిమాల్లో పాప్ కార్న్ కోసమే ఇంటర్వెల్ పెట్టారని సిద్ధు చెప్పాడు.
సెకండ్ హాఫ్ సిండ్రోం రిజల్ట్ మీద ఎఫెక్ట్ పడేలా..
ఐతే సిద్ధు చెప్పిన పాప్ కార్ పంచాయితీ గురించి కాదు కానీ ప్రతి సినిమా సెకండ్ హాఫ్ సిండ్రోం రిజల్ట్ మీద ఎఫెక్ట్ పడేలా చేస్తుంది. ఐతే కింద పడ్డ మూమెంట్ ని పైకి లేపడం కష్టమే కానీ అది అలా చేస్తేనే సినిమా సక్సెస్ అవుతుంది. ఫస్ట్ హాఫ్, సెకండ్ హాఫ్ కోసం మేకర్స్ ఎంతో శ్రమ పడతారని.. ఏది ఎవరికి నచ్చినా వాళ్లు సక్సెస్ అయినట్టే లెక్క అని అన్నాడు సిద్ధు.
తెలుసు కదా కమర్షియల్ లెక్కలు ఎలా ఉన్నా సరే సినిమా ఒక మంచి యూత్ ఎమోషనల్ కంటెంట్ తో వచ్చింది. సిద్ధు అయితే తను చేసిన వరుణ్ రోల్ కి 100 శాతం న్యాయం చేశాడు.
ఇండియన్ సినిమాల్లో ఇంటర్వెల్ అనేది చాలా ప్రాధాన్యత వహిస్తుంది. సినిమా దాదాపు సగం రిజల్ట్ ఫస్ట్ హాఫ్ చూసే చెప్పేస్తారు. ఐతే హాలీవుడ్ సినిమాల్లా సినిమా పూర్తయ్యే వరకు వెయిట్ చేస్తే బాగుంటుందని కొందరు అంటున్నారు.