ప్రేమ కథలకు ఆమె ఛాయిస్ అవుతుందా..?

సినిమాలో ఆమె పాత్ర చాలా స్పెషల్ గా ఉండేలా ఉంది. కె.జి.ఎఫ్ తో సూపర్ క్రేజ్ తెచ్చుకున్న శ్రీనిధి శెట్టి ఆ తర్వాత తమిళ్ లో చియాన్ విక్రం తో కోబ్రా సినిమా చేసింది.;

Update: 2025-09-29 04:52 GMT

సిద్ధు జొన్నలగడ్డ నెక్స్ట్ సినిమా తెలుసు కదా అక్టోబర్ 17న రిలీజ్ ఫిక్స్ చేశారు. ఈ సినిమాను నీరజ కోన డైరెక్ట్ చేయగా సినిమాలో రాశి ఖన్నా, శ్రీనిధి శెట్టి హీరోయిన్స్ గా నటించారు. ఈ సినిమా నుంచి వచ్చిన రెండు సాంగ్స్ సూపర్ అనిపించుకున్నాయి. ముఖ్యంగా సిద్ధు, శ్రీనిధి మధ్య సాంగ్ అయితే ఇంప్రెస్ చేసింది. తెలుసు కదా ఇద్దరు భామలు ఒక హీరో.. ఈ ట్రయాంగిల్ లవ్ స్టోరీ అసలు ట్విస్ట్ ఏంటో సినిమాలోనే చూడాలి. ఐతే ఈ సినిమా టీజర్, సాంగ్స్ లో శ్రీనిధి శెట్టి చాలా క్యూట్ గా కనిపిస్తుంది.

నాని హిట్ 3లో..

సినిమాలో ఆమె పాత్ర చాలా స్పెషల్ గా ఉండేలా ఉంది. కె.జి.ఎఫ్ తో సూపర్ క్రేజ్ తెచ్చుకున్న శ్రీనిధి శెట్టి ఆ తర్వాత తమిళ్ లో చియాన్ విక్రం తో కోబ్రా సినిమా చేసింది. ఆ నెక్స్ట్ నాని హిట్ 3లో నటించింది. నాని సినిమాతో టాలీవుడ్ లో సూపర్ హిట్ అందుకున్న అమ్మడు తెలుసు కదాతో ఆ హిట్ ఫాం కొనసాగించాలని చూస్తుంది. సిద్ధు కూడా తెలుసు కదాతో ఒక డీసెంట్ సక్సెస్ ఆశిస్తున్నాడు.

సినిమాలో శ్రీనిధి శెట్టిని చూస్తే ఇలాంటి ప్రేమకథలకు ఆమె పర్ఫెక్ట్ ఛాయిస్ అనిపించేలా ఉంటుందట. అంతేకాదు ఆ తర్వాత కూడా ఆమెకు ఇలాంటి రోల్స్ వచ్చే పరిస్థితి ఉంటుందని తెలుస్తుంది. ప్రేమ కథలకు ఎవరైతే బాగుంటారని ఆడియన్స్ అనుకుంటారో అలాంటి వారికి ఎక్కువ అవకాశాలు వస్తాయి. శ్రీనిధి శెట్టి ఇప్పటివరకు తీసిన సినిమాల్లో ఏది లవ్ స్టోరీ కాదు. గ్యాంగ్ స్టర్ మూవీ, డిఫరెంట్ జానర్ మూవీస్ చేసింది.

క్రేజీ లవ్ స్టోరీతో తెలుసు కదా..

తెలుసు కదా తో ఒక క్రేజీ లవ్ స్టోరీతో వస్తుంది. నీరజ కోన ఈ సినిమాను చాలా ప్లానింగ్ తో చేస్తున్నట్టు తెలుస్తుంది. సిద్ధు శ్రీనిధి జోడీ మాత్రమే కాదు రాశి ఖన్నా కూడా ఈ సినిమాకు మరో హైలెట్ అని అంటున్నారు. తెలుగులో ఈమధ్య పెద్దగా సినిమాలు చేయని రాశి ఖన్నా తెలుసు కదాతో కంబ్యాక్ ఇవ్వాలని చూస్తుంది.

శ్రీనిధి మాత్రం తెలుగు ఆడియన్స్ చూపిస్తున్న ప్రేమకు ఫిదా అయినట్టు ఉంది. అందుకే అమ్మడు ఇక్కడ సినిమాలు ఎక్కువగా చేయాలని అనుకుంటుంది. హిట్ 3 తో మంచి బోణీ కొట్టింది కాబట్టి తెలుసు కదాకు ఆ లక్ కలిసి వస్తే సిద్ధు కూడా సూపర్ హ్యాపీ అన్నట్టే లెక్క. ఎందుకంటే జాక్ తో ట్రాక్ తప్పిన అతను ఈ సినిమాతో సక్సెస్ అందుకోవాలని చూస్తున్నాడు.

Tags:    

Similar News