సిద్ధు నీ టార్గెట్ తెలుసు కదా..?
ఐతే టిల్లు స్క్వేర్ తో 100 కోట్లు కూడా కొల్లగొట్టిన ఈ హీరో తర్వాత జాక్ తో పెద్ద షాక్ ఇచ్చాడు. బొమ్మరిల్లు భాస్కర్ డైరెక్షన్ లో తెరకెక్కిన జాక్ డిజాస్టర్ అయ్యింది.;
సైడ్ రోల్ నుంచి లీడ్ రోల్ గా ప్రమోషన్ అందుకోవడానికి దాదాపు పదేళ్లకు పైగా ప్రయత్నించాడు సిద్ధు జొన్నలగడ్డ. డీజే టిల్లుతో అతను సూపర్ హిట్ కొట్టాడు. ఆ తర్వాత టిల్లు స్క్వేర్ కూడా అదే వరుసలో సూపర్ హిట్ అయ్యింది. ఐతే అతన్ని డీజే టిల్లు నుంచి ఇష్టపడే వాళ్లకు ఫలానా సినిమాలో సిద్ధు ఉన్నాడా అవునా అంటూ షాక్ అవ్వడం జరుగుతుంది. కెరీర్ లో ఒక్కో మెట్టు ఎక్కుతూ.. వచ్చిన ప్రతి అవకాశాన్ని చేస్తూ వచ్చాడు సిద్ధు.
టిల్లు స్క్వేర్ తో 100 కోట్లు..
ఐతే టిల్లు స్క్వేర్ తో 100 కోట్లు కూడా కొల్లగొట్టిన ఈ హీరో తర్వాత జాక్ తో పెద్ద షాక్ ఇచ్చాడు. బొమ్మరిల్లు భాస్కర్ డైరెక్షన్ లో తెరకెక్కిన జాక్ డిజాస్టర్ అయ్యింది. ఆ సినిమాలో బేబీ వైష్ణవి చైతన్య హీరోయిన్ గా నటించింది. ఆమెకు కూడా సినిమా పెద్ద షాక్ ఇచ్చింది. ఐతే సిద్ధు డీజే టిల్లు, టిల్లు స్క్వేర్ ఈ రెండు బ్లాక్ బస్టర్ కాగా ఆ నెక్స్ట్ వచ్చిన జాక్ నిరాశపరచింది. ఇక నెక్స్ట్ తెలుసు కదా సినిమాతో వస్తున్నాడు సిద్ధు.
నీరజ కోన డైరెక్షన్ లో తెరకెక్కుతున్న ఈ సినిమాలో సిద్ధు సరసన రాశి ఖన్నా, శ్రీనిధి శెట్టి హీరోయిన్స్ గా చేస్తున్నారు. ఈ సినిమా అక్టోబర్ 17న రిలీజ్ లాక్ చేశారు. సినిమాకు థమన్ మ్యూజిక్ అందిస్తుండగా ఈమధ్యనే ఒక సాంగ్ ప్రేక్షకులను అలరించింది. ట్రయాంగిల్ లవ్ స్టోరీగా వస్తున్న ఈ సినిమాపై బజ్ బాగుంది. సిద్ధు ఈ సినిమాతో కచ్చితంగా హిట్టు కొట్టాల్సిన పరిస్థితి.
సరైన కంటెంట్ తో సినిమా..
జాక్ ఫ్లాప్ నుంచి సిద్ధు హిట్ ట్రాక్ ఎక్కాలంటే తెలుసు కదాతో మంచి సక్సెస్ అందుకోవాలి. మరి ఈ విషయంలో సిద్ధు తీసుకుంటున్న జాగ్రత్తలు ఏంటన్నది తెలియాల్సి ఉంది. ప్రెజెంట్ టాలీవుడ్ యూత్ హీరోల్లో స్టార్ బాయ్ సిద్ధుకి కూడా మంచి ఫాలోయింగ్ ఉంది. ఐతే సరైన కంటెంట్ తో సినిమా చేస్తే వర్క్ అవుట్ అవుతుంది. సిద్ధు తెలుసు కదా సినిమా ఆడియన్స్ ని మెప్పించేలా ఉంటుందా లేదా అన్నది చూడండి.
హిట్లు పడితే ఎలా ఎంకరేజ్మెంట్ ఉంటుందో.. ఫ్లాప్ పడితే చాలు కెరీర్ వెనక్కి వెళ్తుంది. సిద్ధు రెండు బ్లాక్ బస్టర్ కొట్టింది ఒక లెక్క అయితే జాక్ తర్వాత మళ్లీ హిట్ ట్రాక్ ఎక్కడం అనేది చాలా ఇంపార్టెంట్. మరి తెలుసు కదా సిద్ధుకి ఎలాంటి బ్రేక్ ఇస్తుందో చూడాలి. సిద్ధు మార్క్ కామెడీ లవ్ ఇంకా ఎమోషన్ ఇలా తెలుసు కదా ప్రేక్షకుల మనసు గెలవాలని వస్తుంది. ఈ మూవీతో సిద్ధుకి ఎలాంటి రిజల్ట్ వస్తుందో చూడాలి.