బులుగు సముద్రాన్ని ఎరుపెక్కించిన సిద్ధిక
ఆ తర్వాత 2019లో 'ప్రేమ పరిచయం' అనే తెలుగు చిత్రంలో నటించింది. నాలుగేళ్ల గ్యాప్ తర్వాత నిన్నే పెళ్లాడుతా (2023) చిత్రంలో కనిపించింది.;
2012 నుంచి తెలుగు చిత్రసీమలో కెరీర్ పోరాటం సాగిస్తోంది సిద్ధికా శర్మ. ఈ పంజాబీ బ్యూటీ అందచందాలు, ప్రతిభకు యువతరంలో ఫాలోయింగ్ ఏర్పడింది. అయినా లక్ కలిసి రాక, ఆశించిన హిట్లు దక్కక కెరీర్ పరంగా రేసులో వెనకబడింది. 2012లో టాలీవుడ్ లో అడుగుపెట్టిన ఈ బ్యూటీ ఆల్ ది బెస్ట్, గల్లీ కుర్రోళ్లు చిత్రాల్లో నటించింది. ఆ తర్వాత క్రియేటివ్ డైరెక్టర్ కృష్ణవంశీ తెరకెక్కించిన `పైసా`లో నటించింది. ఈ చిత్రంలో నేచురల్ స్టార్ నాని కథానాయకుడిగా నటించారు. 'పైసా' ఫ్లాప్ షోగా మిగలడం సిద్ధిక టాలీవుడ్ బిగ్ డ్రీమ్స్ కి గండి కొట్టింది. ప్రతిభావంతుడైన కథానాయకుడు, పెద్ద దర్శకుడు కూడా సిద్ధిక ఫేట్ ని మార్చలేకపోయారు.
ఆ తర్వాత 2019లో 'ప్రేమ పరిచయం' అనే తెలుగు చిత్రంలో నటించింది. నాలుగేళ్ల గ్యాప్ తర్వాత నిన్నే పెళ్లాడుతా (2023) చిత్రంలో కనిపించింది. సిద్ధికను ఒక రకంగా టాలీవుడ్ మాత్రమే ఆదుకుందని చెప్పాలి. జయాపజయాలతో సంబంధం లేకుండా తెలుగు చిత్రసీమ అవకాశాలు కల్పించింది. మాతృపరిశ్రమ పంజాబీలో `ఓయ్ మక్నా` అనే చిత్రంలోను సిద్ధిక ఆడిపాడింది. కానీ ఆ తర్వాత అక్కడ నటించలేదు. 2024లో `ఆపరేషన్ లైలా` అనే చిత్రంతో తమిళంలో కూడా అడుగుపెట్టింది. కానీ అక్కడా పాప్పులుడకలేదు. హిట్టు మాత్రమే కోరుకునే పరిశ్రమలో ఒడిదుడుకుల ప్రయాణానికి సిద్ధిక అలవాటు పడిపోయింది.
ఈ పంజాబీ బ్యూటీ గ్లామర్ సరిహద్దులు చెరిపేసి చెలరేగిపోతున్నా, పరిశ్రమలో అవకాశాలు రావడం అంత సులువుగా లేదు. ఓ వైపు మలయాళం, కన్నడం నుంచి అందంతో పాటు ప్రతిభావంతులైన కథానాయికలు వెల్లువెత్తుతున్నారు. ఇటీవల తెలుగమ్మాయిలు కూడా ఇతర భామలకు ధీటుగా రాణిస్తున్నారు. దీంతో సిద్ధిక లాంటి ఉత్తరాది భామలకు ఠఫ్ కాంపిటీషన్ ఎదురవుతోంది.
పరిశ్రమ ఎవరికి రెడ్ కార్పెట్ వేస్తుందో, ఎవరిని ఎప్పుడు ఇంటికి పంపుతుందో తెలీదు కదా! సిద్ధిక కూడా చాలా పోరాటాల తర్వాత బాలీవుడ్ లోను ప్రయత్నాలు ప్రారంభించింది. కెరీర్ ఆరంభం నుంచి ప్రముఖ పంజాబీ గాయకులతో కలిసి పలు సింగిల్ ఆల్బమ్స్ తో సందడి చేసింది.
ప్రస్తుతానికి సోషల్ మీడియాల్లో వేడెక్కించే ఫోటోషూట్లతో చెలరేగుతోంది. తాజాగా సిద్ధిక రె*డ్ హా*ట్ లుక్ ఇంటర్నెట్ ని షేక్ చేస్తోంది. ఇన్నర్ అందాలను ఎలివేట్ చేస్తూ డిజైన్ చేసిన ఈ స్పెషల్ డిజైనర్ డ్రెస్ సిద్ధిక ఛామ్ అండ్ గ్లోని ఎలివేట్ చేస్తోంది. నేపథ్యంలో అలలు అలలుగా దుముకుతున్న బులుగు సముద్రంతో పోటీపడుతూ ఈ రె*డ్ హా*ట్ బ్యూటీ వాతావరణాన్ని ఒక్కసారిగా ఎరుపెక్కించింది. సిద్ధిక అపరిమితమైన గ్లామర్ ట్రీట్ కి ఫ్యాన్స్ ఫిదా అవుతున్నా, ఇప్పుడు దర్శకనిర్మాతల దృష్టికి రావాల్సి ఉంది. తనకు మళ్లీ టాలీవుడ్ ఒక్క ఛాన్స్ ఇస్తుందేమో చూడాలి.