వైరల్‌ : ఆటో ఎక్కిన లేడీ హాసన్‌

తండ్రి కమల్‌ హాసన్ యొక్క ఇమేజ్ ను ఎప్పుడు కూడా వినియోగించని శృతి హాసన్‌ సొంతంగానే ఇండస్ట్రీలో ఎదిగింది.

Update: 2024-05-10 05:19 GMT

యూనివర్శిల్‌ స్టార్‌ కమల్‌ హాసన్ నట వారసురాలు శృతి హాసన్‌ మల్టీ ట్యాలెంటెడ్‌ అనే విషయం ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. హీరోయిన్‌ గా శృతి హాసన్‌ వరుసగా సినిమాలు చేస్తూనే మరో వైపు ఐటం సాంగ్స్ చేయడంతో పాటు మ్యూజిక్‌ వీడియోలను చేస్తూ బిజీ బిజీగా గడుపుతూ ఉంటుంది.

తండ్రి కమల్‌ హాసన్ యొక్క ఇమేజ్ ను ఎప్పుడు కూడా వినియోగించని శృతి హాసన్‌ సొంతంగానే ఇండస్ట్రీలో ఎదిగింది. ఒంటరిగా ముంబైలో నివాసం ఉండే శృతి హాసన్ మరోసారి వార్తల్లో నిలిచింది. ఇటీవల ముంబైలో ఒక సినిమా షూటింగ్‌ కు వెళ్తున్న సమయంలో ట్రాఫిక్ జామ్‌ అయ్యిందట.

కారు ట్రాఫిక్‌ లో చిక్కుకోవడంతో శృతి హాసన్ కొద్ది దూరం నడిచి వెళ్లి అక్కడ నుంచి ఆటోలో షూటింగ్‌ లొకేషన్‌ కి వెళ్లిందట. ఆ విషయాన్ని స్వయంగా శృతి హాసన్‌ సోషల్‌ మీడియా లో వీడియోను షేర్‌ చేసి తెలియజేసింది. ఆటోలో ప్రయాణిస్తున్న వీడియోను షేర్‌ చేయడంతో అది కాస్త వైరల్‌ అయ్యింది.

పబ్లిసిటీ కోసం శృతి హాసన్ ఇలా చేసిందని కొందరు విమర్శిస్తే, కొందరు మాత్రం షూటింగ్‌ కు ఆలస్యం అవ్వద్దు అనే ఉద్దేశ్యంతో ఆటోలో వెళ్లడంను అభినందిస్తున్నారు. మొత్తానికి శృతి హాసన్‌ ఆటో ప్రయాణం సోషల్‌ మీడియాలో టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీగా నిలవడం విశేషం.

Read more!

గత ఏడాది సలార్‌ తో పాటు పలు సినిమాలతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన శృతి హాసన్‌ ఈ ఏడాది కూడా పలు సినిమాల్లో మరియు వెబ్‌ సిరీస్‌ ల్లో నటిస్తోంది. ఇటీవలే ఈమె ప్రముఖ దర్శకుడు లోకేష్ కనగరాజ్ తో కలిసి చేసిన ఇన్నిమేల్‌ మ్యూజిక్‌ ఆల్బం ప్రేక్షకుల ముందుకు వచ్చింది. దానికి మంచి స్పందన వచ్చింది.

ఆ మ్యూజిక్ వీడియో కు సంగీతం తో పాటు దర్శకత్వం కూడా అందించిన శృతి హాసన్ ప్రతిభను పలువురు నెటిజన్స్‌ అభినందిస్తున్నారు. నెట్టింట ఇన్నిమేల్‌ ఇంకా ట్రెండ్‌ అవుతూనే ఉంది. హీరోయిన్ గా కూడా ఈమె బిజీ బిజీగా సినిమాలు చేస్తూ వస్తోంది.

Tags:    

Similar News