• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  టాలీవుడ్ కి గుడ్ బై...

టాలీవుడ్ కి గుడ్ బై చెప్పినట్టేనా..?

| కమల్ హాసన్ గారాల పట్టి శృతి హాసన్ టాలీవుడ్ కి దాదాపు గుడ్ బై చెప్పినట్టే అనిపిస్తుంది.

By - Ramesh Boddu
Update: 2025-08-12 04:07 GMT

కమల్ హాసన్ గారాల పట్టి శృతి హాసన్ టాలీవుడ్ కి దాదాపు గుడ్ బై చెప్పినట్టే అనిపిస్తుంది. ఆమె వ్యవహార శైలి చూస్తే అది నిజం అనేలా ఉంది. ఎందుకంటే అమ్మడు తెలుగులో సినిమాలు చేయాలన్న ఆసక్తి చూపించట్లేదు. ఒకటి అర సినిమాలు చేసినా వాటి మీద అంత ఆసక్తి చూపించట్లేదట. అడివి శేష్ తో డెకాయిట్ సినిమా ముందు శృతి హాసన్ తోనే చేయాలని అనుకున్నారు. ఆమెతో టీజర్ కూడా రిలీజ్ చేశారు. కానీ ఏమైందో ఏమో సడెన్ గా శృతి హాసన్ ప్లేస్ లో మృణాల్ ఠాకూర్ వచ్చింది.

కెరీర్ పీక్స్ లో ఉన్న టైంలో కూడా..

టాలీవుడ్ లో శృతికి వచ్చేదే అర కొర అవకాశాలు వాటిని కూడా అమ్మడు చేజార్చుకుంటుంది. దీని వెనక రీజన్స్ ఏమై ఉండొచ్చు అని ఆడియన్స్ డిస్కషన్ చేస్తున్నారు. ఇప్పుడే కాదు కెరీర్ పీక్స్ లో ఉన్న టైంలో కూడా శృతి హాసన్ తెలుగు దర్శక నిర్మాతలను కాస్త ఇబ్బంది పెట్టేదని టాక్ ఉంది. సినిమా కమిట్ అవ్వడం వరకు ఓకే ఆ తర్వాత అమ్మడు డేట్స్ విషయంలో ఇబ్బందులు పెడుతుందని ఇన్నర్ టాక్. అందుకే అంతకుముందు కూడా శృతి హాసన్ చేయాల్సిన కొన్ని సినిమాలు వేరే హీరోయిన్స్ ని పెట్టి చేశారు.

అడివి శేష్ డెకాయిట్ సినిమాలో శృతి హాసన్ ఉంటే బాగుండేదని అనుకున్నారు. కానీ ఆమెకు ఛాన్స్ లేదు. ఈ పరిస్థితులన్నీ చూస్తుంటే శృతి హాసన్ తెలుగు సినిమాలను దాదాపు దూరం పెట్టినట్టే ఉంది. ప్రభాస్ తో సలార్ లో నటించిన శృతి హాసన్ ఆ సినిమా సెకండ్ పార్ట్ లో కూడా నటించాల్సి ఉంది. అది ఎలాగు కమిట్ అయ్యింది కాబట్టి తప్పదు. కానీ ఇక మీదట తన పూర్తి ఫోకస్ అంతా కూడా కోలీవుడ్ మీదే పెట్టాలని చూస్తుంది అమ్మడు.

పవర్ స్టార్ తో చేసిన గబ్బర్ సింగ్..

శృతి హాసన్ పర్సనల్ గా కూడా లైఫ్ ని సూపర్ గా ఎంజాయ్ చేస్తుంది. ఏ విషయం గురించి పెద్దగా సీరియస్ గా తీసుకోదు అమ్మడు. ఐతే సౌత్ లో క్రేజీ హీరోయిన్ గా పేరు తెచ్చుకున్న శృతి హాసన్ కెరీర్ లో మొదటి హిట్ కొట్టింది మాత్రమే తెలుగు సినిమాతోనే. అది కూడా పవర్ స్టార్ తో చేసిన గబ్బర్ సింగ్ సినిమాతోనే ఆమె సూపర్ హిట్ అందుకున్నారు. అప్పటి నుంచి శృతి హాసన్ ఇక తిరిగి చూసుకోలేదు. ప్రజెంట్ శృతి హాసన్ సూపర్ స్టార్ర్ రజినీకాంత్ కూలీ సినిమాలో నటించింది.

మరో రెండు రోజుల్లో రిలీజ్ కాబోతున్న కూలీ సినిమాతో ప్రేక్షకులను అలరించనుంది శృతి హాసన్. ఈ మూవీ మీద శృతిహాసన్ చాలా హోప్స్ పెట్టుకుంది. మరి అమ్మడి పెట్టుకున్న ఈ హోప్స్ ఎంతవరకు నిజం అవుతానన్నది చూడాలి.

Tags:    
  • ShrutiHaasan 
  • Tollywood 
  • TeluguCinema 
  • GabbarSingh 
  • CoolieMovie 
  • AdiviSesh 
  • Dacoit 
  • Prabhas 
  • Salaar 
  • Kollywood 
  • TeluguActress 
  • ShrutiHaasanFans 
  • శృతి హాసన్ 
  • కూలీ 

Similar News

ప్రేక్షకుల పరిణతికి నిదర్శనం.. ఒరిజిన‌ల్ క‌థ‌లు, క్రియేటివిటీకి ప‌ట్టం!

2026-11-06 00:30 GMT

హీరో ఇమేజ్ ప్రెజర్‌తో దెబ్బతింటున్న కొత్త కథలు.. ఇదే అసలు సమస్య!

2026-11-05 23:30 GMT

సెన్సార్షిప్‌లో మార్పులు.. నేటిత‌రం ఔత్సాహిక ఫిలింమేక‌ర్స్ తెలుసుకోవాల్సిన‌వి!

2026-11-05 22:30 GMT

టికెట్ రేట్ల వివాదం: తెలుగు రాష్ట్రాలు vs తమిళనాడు!

2026-11-05 19:30 GMT

రాజమౌళి మహాభారతం కృష్ణుడు, అర్జునుడు, దుర్యోధనుడిగా ఈ ముగ్గురు నటులు ఫిక్స్ అయ్యారా?

2026-11-05 18:30 GMT

సూపర్‌స్టార్లు స్వీయ భారం..నేటి తరం మాత్రం నిర్మాతలపై భారం!

2026-11-05 17:30 GMT

వారణాసి మహేష్ బాబు రాముడిగా ఎంత సేపు కనిపిస్తాడు...

2026-11-05 16:32 GMT

స్టెప్-మదర్ కాదు అంతకుమించి!

2026-11-05 16:30 GMT

అంగరంగ వైభవంగా సాయి దుర్గ తేజ్, కిరణ్ నిశ్చితార్థం.. అమ్మాయి వివరాలు ఇవే!

2026-11-05 16:16 GMT

రెడ్ అవుట్‌ఫిట్‌లో స్టన్నింగ్ లుక్‌తో మెరిసిన పాలక్!

2026-11-05 16:16 GMT

'రామాయణ' సెట్స్‌లో సీతగా సాయి పల్లవి.. BTS ఫొటోలు వైరల్!

2026-11-05 16:15 GMT

RC17: హీరో.. హీరోయిన్..విలన్.. ఎవరెవరంటే..!

2026-11-05 16:15 GMT

Copyright @2026

Powered by Blink CMS